తెరచుకోని పశువుల ఆస్పత్రి | veternary hospital closed | Sakshi
Sakshi News home page

తెరచుకోని పశువుల ఆస్పత్రి

Oct 8 2016 6:59 PM | Updated on Sep 4 2017 4:40 PM

తెరుచుకోని పశువుల ఆస్పత్రి

తెరుచుకోని పశువుల ఆస్పత్రి

రెండు రోజులుగా పశువులు ఆసుపత్రి తెరచుకోవడం లేదు. శనివారం ఆసుపత్రికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు.

డాక్టర్‌ డిప్యూటేషన్‌ రద్దు
సెలవులో అటెండర్‌
సమాచారం లేదన్న ఏడీఏ

 

కౌడిపల్లి: రెండు రోజులుగా పశువులు ఆసుపత్రి తెరచుకోవడం లేదు. శనివారం ఆసుపత్రికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రణీత్‌రాజ్‌ విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఇటీవల అతని డిప్యూటేషన్‌ రద్దు చేశారు.

ఇక్కడ విధులు నిర్వహించే అటెండర్‌ రెండు రోజుల నుంచి సెలవుపై వెళ్తున్నట్లు ఆసుపత్రి ఎదుట బోర్డుపై కాగితం అంటించారు. వైద్యుడు లేక అటెండర్‌ రాక మూగజీవులకు వైద్యం అందడదం లేదు. ఆసుపత్రికి వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఈ విషయమై నర్సాపూర్‌ ఏడీఏ వెంకటయ్య వివరణ కోరగా డాక్టర్‌పై ఆరోపణలు రావడంతో అతని డిప్యూటేషన్‌ రద్దు చేశామన్నారు. అటెండర్‌ సెలవు పెట్టిని విషయం తమకు తెలియదన్నారు. సెలవుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు. రాయలాపూర్‌ లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ను డిప్యుటేషన్‌ వేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement