కౌడిపల్లి: మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించాలని పశుసంవర్ధకశాఖ జేడీ విక్రంకుమార్ సూచించారు. గురువారం కౌడిపల్లి పుశువైద్యశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకుతాయన్నారు. గొర్రెలకు నీలినాలుక వ్యాధి వ్యాపిస్తుందన్నారు. అనారోగ్యంతో మేత మేయక పోవడంవల్ల మృతి చెందుతాయని వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించాలన్నారు. ఇటీవల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశామన్నారు. ఆసుపత్రులలో మందుల కొరత లేదన్నారు. ఆయన వెంట డాక్టర్ ప్రణీత్‌రాజ్ సిబ్బంది పాల్గొన్నారు.