మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ....కేంద్రమంత్రి చిరంజీవిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిరంజీవి కమెడియన్లా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను సీఎం ఎప్పుడు అయ్యానో కూడా చిరంజీవికి తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. విభజనకు తానే కారణం అంటుంటే చిరంజీవి రాజకీయ పరిజ్ఞానంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. రాజకీయాలు తెలిసిన వారికైతే సమాధానాలు చెప్పవచ్చని కిరణ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు తానే కారణమని చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు.