‘చేనేత’ను ఆదుకున్నది జగన్‌ ప్రభుత్వమే | Sakshi
Sakshi News home page

‘చేనేత’ను ఆదుకున్నది జగన్‌ ప్రభుత్వమే

Published Mon, May 6 2024 9:35 AM

‘చేనే

యలమంచిలి : రాష్ట్రంలో చేనేత రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) అన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల చేనేత సంఘాల సభ్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం యలమంచిలిలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి యూవీ రమణమూర్తిరాజు చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తోడ్పాటునందించారన్నారు. యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న చేనేత కార్మికులకు ఒక సామాజిక భవనం నిర్మిస్తానని తెలిపారు. మగ్గం లేని పేద, వృద్ధ చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్‌ అందజేసేందుకు కృషి చేస్తానన్నారు. బీసీలను రాజ్యసభకు పంపిన ఎకై క ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత సంఘం సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తమను ఎలా ఆదుకున్నారో తెలిపారు. ఆయనకు బాసటగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం చేనేత సంఘం సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి రమణమూర్తిరాజుకు చరఖా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోదెపు గోవింద్‌, యలమంచిలి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు అర్రెపు గుప్త, బెజవాడ నాగేశ్వరరావు, యలమంచిలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొద్దపు యర్రయ్యదొర, పట్టణ సచివాలయ కన్వీనర్‌ కర్రి శివ, పార్టీ మండల అధ్యక్షుడు కొల్లి త్రినాఽథ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు దూది నర్సింహమూర్తి, జిల్లా చేనేత సంఘం అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు, సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్‌ సూరిఽశెట్టి సూరిబాబు, తేలు ఈశ్వరరరావు, వానపల్లి జగన్నాథరావు అరుణలత, మాడెం అప్పలరాజు, శేశెట్టి శ్రీను, మాడెం రమణ, తెడ్లపు సతీష్‌, శ్రీ భద్రావతి చేనేత సంఘం ప్రెసిడెంట్‌ దుప్పితూరు, మాడెం నూకరత్నం, మాడెం అప్పారావు, పోతిరెడ్డిపాలెం చేనేత సంఘం సభ్యుడు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబువి బూటకపు హామీలు

మగ్గం లేని చేనేత కార్మికులకు కూడా పింఛన్‌

ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు

‘చేనేత’ను ఆదుకున్నది జగన్‌ ప్రభుత్వమే
1/1

‘చేనేత’ను ఆదుకున్నది జగన్‌ ప్రభుత్వమే

Advertisement

తప్పక చదవండి

Advertisement