Sanda Island లగ్జరీ దీవి అమ్మకానికి, ధర రూ. 26 కోట్లే | Sakshi
Sakshi News home page

Sanda Island లగ్జరీ దీవి అమ్మకానికి, ధర రూ. 26 కోట్లే

Published Tue, Apr 30 2024 10:31 AM

Luxury Private Islands for Sale Worldwide

 నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ నిర్వహిస్తున్న సేల్‌ 

453 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని   ప్రకృతి నడుమ,  బీచ్‌, పబ్‌, హెలిప్యాడ్.. ఇంకా

సాధారణంగా సొంతంగా  ఒక ఇల్లు, ఓ  చిన్న  కారు ఇదీ  ఓ మధ్య తరగతి జీవి కల. కానీ యూకేలోని స్కాట్లాండ్‌లో  ఒక బంపర్‌ ఆఫర్‌ సామాన్యుడ్ని సైతం ఊరిస్తోంది. పశ్చిమ తీరంలో 453-ఎకరాల ప్రైవేట్ లగ్జరీ ఐలాండ్‌ ఒకటి అతి తక్కువ  ధరకే అమ్మకానికి సిద్ధంగా ఉంది.  ఏడు బెడ్‌ రూంలు,  బీచ్‌లు, పబ్,హెలిప్యాడ్  అబ్బో..‌ ఇలాంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి.  ప్రముఖ నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది. అయితే  ఈ దీవిని  సొంతం  చేసుకోవాలంటే  మీ దగ్గర 26 కోట్లు ఉంటే చాలు.  వివరాలు  ఇలా ఉన్నాయి..


స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ మధ్య  453 ఎకరాల మేర విస్తరించి ఉందీ  సాండా ద్వీపం. పాల్ మాక్‌కార్ట్‌నీ , వింగ్స్‌చే 1977 పాట "ముల్ ఆఫ్ కింటైర్’’ ద్వారా ఇది పాపులర్‌ అయింది. గత కొన్నేళ్లుగా సన్యాసులు, సాధువులు, రాజులతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. దీనిని స్కాటిష్ రాజు రాబర్ట్ ది బ్రూస్ , నార్వే రాజు హకోన్ సందర్శించారట. 1946లో ద్వీపం నుండి ధ్వంసమైన ఓడ  సాండా పేరునే ఈ దీవికి పెట్టారు.  ఈ ద్వీపం అనేక సంవత్సరాల్లో అనేక మంది యజమానుల  చేతుల్లో ఉంది. వీరిలో స్కాటిష్‌ గాయకుడు,  రాక్ బ్యాండ్ క్రీమ్‌కు చెందిన జాక్ బ్రూస్ ప్రముఖుడు.

 ప్రాపర్టీస్‌ ఏజెన్సీ  నైట్ ఫ్రాంక్  సమాచారం ప్రకారం  ఈ దీవిలో  ఏడు ఇళ్లు, బీచ్‌, పబ్‌తోపాటు హెలికాప్టర్‌ దిగడానికి వీలుగా హెలిప్యాడ్‌ కూడా ఉంది. పక్కనే రెండు మరింత చిన్న దీవులు కూడా ఉ‍న్నాయి.  సాండా కొనుగోలు చేసినవారు ఈరెండు దీవులను కూడా సొంతం చేసుకోవచ్చు.  ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్‌ హౌజ్‌ కూడా ఉందని సంస్థకు చెందిన స్టీవర్ట్-మూర్‌ ప్రకటించారు.

ఇంకో విశేషంగా ఏమిటంటే  ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్‌ కూడా ఉంది. అందులో బ్లాక్‌ ఫేస్‌ 55 గొర్రెలు కూడా ఉన్నాయట. వన్యప్రాణులతో పాటు పశువులకు కూడా ఈ దీవి  ఆవాసం. పఫిన్‌లు, కిట్టివాక్‌లు, కార్మోరెంట్‌లు, షాగ్‌లు, రేజర్‌బిల్స్‌,  మరెన్నో  పక్షులను  ఇక్కడ  వీక్షించవచ్చు.ఉత్తర ఐర్లాండ్‌ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్‌ లోని క్యాంపెల్‌ టౌన్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ పేర్కొంది. దీని 31 మిలియన్‌ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు మాత్రమే.దీంతో  కొనుగోలు ఇప్పటికే క్యూకట్టినట్టు నైట్‌ ఫ్రాంక్‌  తెలిపింది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement