రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో ప్రతిభ | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో ప్రతిభ

Published Mon, May 6 2024 6:45 AM

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో ప్రతిభ

నిర్మల్‌టౌన్‌: ఈనెల 3నుంచి 5వరకు హైదరా బాద్‌లోని లాలాగూడలో రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి కొండూరు రిషిక 63–66 కేజీల విభాగంలో పాల్గొంది. ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించింది. ఈ సందర్భంగా బాక్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సెక్రటరీ రవీందర్‌ రిషికకు ప్రశంసాపత్రం అందజేశారు. జిల్లా ప్రెసిడెంట్‌ శ్రీధర్‌, సెక్రటరీ స్వామి అభినందించారు.

న్యూస్‌రీల్‌

అడెల్లిలో భక్తుల సందడి

సారంగపూర్‌: శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆల యం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement