రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌.. సునీల్‌ కుమార్‌ వాహనంపై దాడి! | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌.. సునీల్‌ కుమార్‌ వాహనంపై దాడి!

Published Mon, May 6 2024 8:56 AM

TDP Supporters Attack On YSRCP MP Candidate Sunil Kumar

సాక్షి, ఏలూరు: ఏపీలో ఎన్నికల వేళ పచ్చ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌ యాదవ్‌ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వాహనాన్ని చుట్టుముట్టి అద్ధాలు ధ్వంసం చేశారు.

వివరాల ప్రకారం.. ఏలూరులోని లింగపాలెం మండలం రంగాపురం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్‌ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడిక దిగాయి. జంగారెడ్డిగూడెం టౌన్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని నూజివీడు నియోజకవర్గం ముసునూరు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని ప్రభాకర్‌, సొంగ రోషన్‌ వర్గీయులే దాడి చేసినట్టు గుర్తించారు.

కాగా, రంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న సునీల్‌ కుమార్‌ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సునీల్‌ కుమార్‌ వాహనాన్ని చుట్టిముట్టి టీడీపీ శ్రేణులు అద్ధాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పచ్చమూకల దాడి నుంచి సునీల్‌ కుమార్‌, అతని అనుచరులు చాకచక్యంగా తప్పించుకున్నారు.

అనంతరం సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారు. రెండు కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడి నుండి వచ్చేశాను. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు. హుందాగా రాజకీయాలు చేయాలి. కానీ మా సహనాన్ని పరీక్షించకండి. ఓడిపోతున్నామనే భయంతోనే మాపై దాడులకు పాల్పడుతున్నారు.

దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో 150 కుటుంబాలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కోసం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వారి దాడిలో మాకు సంబంధించిన రెండు కార్లు ధ్వసం అయ్యాయి. దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాము. వారు కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి చర్యలను నియంత్రించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగే రాజకీయాలు చేయకూడదు. తెలుగుదేశం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోంది. ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపు అన్న రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నారు’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement