చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం | Sakshi
Sakshi News home page

చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం

Published Sun, May 5 2024 4:45 AM

చట్ట

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే మైనారిటీలకు న్యాయం జరిగింది. సీఎం వైఎస్‌ జగన్‌ చట్టసభల్లో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు. మైనారిటీ ఎమ్మెల్యేను ఉప ముఖ్యమంత్రిని చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా టీడీపీ మూడు సీట్లే ఇచ్చింది.

– ఎండీ గఫార్‌ అలీఖాన్‌, కరస్పాండెంట్‌, ఎంజీ బీఈడీ కళాశాల, కంభం

ముస్లింలంతా జగన్‌ వెంటే..

వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్‌ వల్ల ఎంతో మంది పేద ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌, ఇతర ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. షాదీ తోఫా, మౌజన్‌, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇచ్చి సీఎం వైఎస్‌ జగన్‌ జగన్‌ అండగా నిలిచారు. ముస్లింల రిజర్వేషన్‌ రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీకి రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతాం.

– మహమ్మద్‌ ఇబ్రహీం, రిటైర్డ్‌ టీచర్‌

ముస్లింల వంచకుడు చంద్రబాబు

టీడీపీ అధికారంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. హామీల అమలుపై ప్రశ్నించిన మైనారిటీ యువకులపై కేసులు పెట్టి వేధించారు. జగనన్న పాలనలో మౌజమ్‌ల గౌవర వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఆదుకున్నారు. షాదీతోఫాను రూ.లక్షకు పెంచి అండగా ఉన్నారు. టీడీపీకి ముస్లింలు ఓటు వేస్తే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్టే. బీజేపీతో కలిసి కుట్రలు చేసే పార్టీలకు ముస్లింలంతా ఓటుతో బుద్ధి చెప్పాలి.

– షేక్‌ ఖాజా హుస్సేన్‌, కంభం

బాబే పెద్ద భూచోడు

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే జరగుతోంది. రూ.3 వేల కోట్లకు ఖర్చుతో బృహత్తర కార్యక్రమం చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌ బొమ్మలు ఎక్కడా వేయకూడదనే హక్కు టీడీపీ వాళ్లకు ఎక్కడిది? పండగ సరుకులపైనే నీచంగా బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకోవచ్చు కానీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం గురించి ఎక్కడా ఆనవాళ్లు ఉండకూడదంటే ఎలా? సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలోనే వేల మంది రైతులకు భూ హక్కులు వచ్చాయి. రీసర్వేతో సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని నమ్ముతున్నాం. పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇస్తే ఓర్చుకోలేని కులోన్మాదులు ప్రజల భూముల గురించి నీతి వాక్యాలు చెబితే నమ్మేవాళ్లు ఎవరూ లేరు.

– ఎద్దు నగేష్‌

చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం
1/3

చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం

చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం
2/3

చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం

చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం
3/3

చట్ట సభల్లో మైనారిటీలకు సముచిత స్థానం

Advertisement
Advertisement