మాజీమంత్రులంతా ఒక్కొక్కరుగా సచివాలయంలోని తమ చాంబర్లను ఖాళీ చేస్తున్నారు. చాంబర్లను ఖాళీ చేసేందుకు సాధారణ పరిపాలన శాఖ మాజీ మంత్రులందరికీ ఈనెల 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
మాజీమంత్రులంతా ఒక్కొక్కరుగా సచివాలయంలోని తమ చాంబర్లను ఖాళీ చేస్తున్నారు. వాస్తవానికి ఆయా చాంబర్లను ఖాళీ చేసేందుకు సాధారణ పరిపాలన శాఖ మాజీ మంత్రులందరికీ ఈనెల 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయినా కూడా రాష్ట్రపతి పాలన ఉండటం, గవర్నర్ నరసింహన్ ప్రతి విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఎందుకైనా మంచిదని తమ వ్యక్తిగత వస్తువులను ఇళ్లకు తరలించుకుంటున్నారు.
అలాగే, ఆయా మంత్రుల వద్ద ఇంతకుముందు పనిచేసిన పీఏలు, పీఎస్లో కూడా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేస్తున్నారు. వారంతా మాతృశాఖలలో చేరేందుకు నిరభ్యంతర సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు.