
సమ్మె చీకట్లు
రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. వేతన సవరణ (పీఆర్‌సీ) అమలుపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉధృతరూపం దాల్చింది.
* ఉద్యోగుల సమ్మెతో నిలిచిన కరెంటు ఉత్పత్తి
* పలు ప్లాంట్లలో 2,160 మెగావాట్లకు గండి
* రాష్ట్రవ్యాప్తంగా అనేక ఫీడర్లకు సరఫరా కట్
* ఆర్‌టీపీపీ, ఎన్‌టీటీపీఎస్, కేటీపీఎస్‌లో యూనిట్ల మూత
* ఫిట్‌మెంట్ బదులుగా ఐఆర్ ఇస్తామన్న యాజమాన్యం
* దానిపై వివరంగా చర్చించలేదన్న జేఏసీ
* ఆదివారం రాత్రి జరిగిన చర్చలూ విఫలం
* అంధకారంలో విజయవాడ, ఇతర పట్టణాలు, వందలాది గ్రామాలు
* నేడు మళ్లీ చర్చలు
* సమ్మె కొనసాగితే సగం రాష్ట్రానికి విద్యుత్ సరఫరా బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. వేతన సవరణ (పీఆర్‌సీ) అమలుపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉధృతరూపం దాల్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక విద్యుత్ ప్లాంట్లలో 2160 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. డిమాండ్‌కు సరిపడినంత విద్యుత్ అందుబాటులో లేక అధికారులు అనేక ఫీడర్లకు సరఫరాను నిలిపివేశారు. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)లో ఇప్పటికే 210 మెగావాట్ల ఒక యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోరుుంది.
ఇప్పటికే విజయవాడ నగరాన్ని చీకట్లు కమ్ముకున్నారుు. రాష్ట్రంలోని పలు పట్టణాలు, వందలాది గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నారుు. ఎన్‌టీటీపీఎస్‌లో యూనిట్లు ట్రిప్ అరుుతే రాష్ట్రంలోని మిగిలిన థర్మల్ స్టేషన్లలో కూడా యూనిట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే దక్షిణాది గ్రిడ్‌పై ప్రభావం పడి కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళలకు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, యూజమాన్యం మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యూరుు.
సోమవారం ఉదయం 11 గంటలకు మరో ధఫా సమావేశమై చర్చించాలని నిర్ణరుుంచారు. ఇదే పరిస్థితి సోమవారం కూడా కొనసాగితే సగం రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలిచిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం రాత్రి షిఫ్ట్‌కు వెళ్లిన ఉద్యోగులతో బలవంతంగా పని చేరుుంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా .. వారు అంగీకరించడం లేదని సమాచారం. ఎన్టీటీపీఎస్ నుంచి ఆదివారం రాత్రికి చాలావరకు ఉద్యోగులు బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది.
చర్చలు విఫలం..
ఆదివారం ఉదయం ఆరు గంటలకు పలు విద్యుత్ కేంద్రాలలో ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. రాత్రికి ఏకంగా 2,160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె విరమణకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు. వేతన సవరణను అమలు చేయలేమని, కొత్త ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్‌తో జెన్‌కో ఎండీ విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందాలు ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.
అనంతరం వారు విద్యుత్ సౌధలో ఉద్యోగులతో చర్చలు జరిపారు. వేతన సవరణ కమిటీ ప్రతిపాదించిన మేరకు 27.5 శాతం ఫిట్‌మెంట్ బదులుగా ఐఆర్ (మధ్యంతర భృతి) ఇస్తామని చెప్పారు. రెగ్యులర్ పీఆర్‌సీని కొత్త ప్రభుత్వాలు చూసుకుంటాయని ప్రతిపాదించారు. ఇదే సమయంలో సమ్మె విరమించాలని సీఎస్ మహంతి కూడా విజ్ఞప్తి చేశారు.
అయితే ఐఆర్‌పై వివరంగా చర్చించేందుకు యాజమాన్యం ససేమిరా అంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు, చైర్మన్ సీతారాంరెడ్డి, కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, జేఏసీ నేతలు ఎం.గోపాల్, వెంకన్నగౌడ్, ప్రసాద్, కిరణ్, చంద్రుడు, భానుప్రకాశ్‌లు మండిపడ్డారు. సమ్మెను కొనసాగించేందుకే నిర్ణయించామని ప్రకటించారు. అనంతరం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో మరోమారు జరిగిన చర్చలు కూడా విఫలమయ్యూరుు. సోమవారం ఉదయం 11 గంటలకు మరోమారు సమావేశం కావాలని ఉద్యోగుల జేఏసీ, యూజమాన్యం నిర్ణరుుంచారుు.
యూనిట్లకు యూనిట్లు ట్రిప్!
సమ్మె నేపథ్యంలో జెన్‌కోకు చెందిన అనేక థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు జలాశయాల్లో నీళ్లు లేకపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి జరిగే పరిస్థితి లేదు. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గ్యాసు ఉత్పత్తి తగ్గిపోవడంతో గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా అనేక ఫీడర్లకు (విద్యుత్ సరఫరా లైన్లు) సరఫరాను నిలిపివేశారు.
ఖమ్మ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోరుుంది. ఎన్‌టీటీపీఎస్‌లోని 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్ మూతపడింది. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ)లోని ఒక్కొక్కటి 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం ఐదు యూనిట్లలో (మొత్తం 1050 మెగావాట్లు) ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా కేటీపీఎస్‌లో ఒక్కొక్కటి 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో రెండు యూనిట్లు ఆదివారం రాత్రి సమయానికి ఒక్కొక్కటి కేవలం 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికే (400 మెగావాట్ల నష్టం) పరిమితమయ్యాయి.
ఇవన్నీ కలిపి మొత్తం 2,160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఇదే పరిస్థితి కొనసాగితే సోమవారం నాటికి ఈ యూనిట్లలో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోనుందని జెన్‌కో అధికారులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల బొగ్గు నిల్వలు నిండుకున్నారుు. రెల్వే వేగన్ల ద్వారా ప్లాంటుకు వచ్చిన బొగ్గును అన్‌లోడ్ చేసే సిబ్బంది లేరు. ఉన్న బొగ్గును బాయిలర్లలోకి ఫీడ్ చేసే సిబ్బందీ కరువయ్యారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా విద్యుత్ సరఫరా తగ్గిపోయింది.
హైదరాబాద్‌లోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) నుంచే భారీ విద్యుత్ లైన్లకు కరెంటును కట్ చేశారు. దీంతో అనేక గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల బొగ్గు స్థానంలో ఫర్నేస్ ఆరుుల్ మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
యాజమాన్యానిదే నిర్లక్ష్యం
మొదటి నుంచీ మేము బాధ్యతాయుతంగానే వ్యవహరించాం. యాజమాన్యమే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పుడు కూడా మేం ఐఆర్‌పై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు ఐఆర్‌పై సరైన చర్చే జరగలేదు. చర్చలకు ముందుకు వస్తే మేం సిద్ధం. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఐఆర్ ఇవ్వాల్సిందే. పురపాలకశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఐఆర్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి.
- జేఏసీ కన్వీనర్ సుధాకర్‌రావు
సమ్మె విరమించండి: కేసీఆర్
విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పిల్లలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మెను వెంటనే విరమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే వేతన సవరణ అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కాగా ప్రస్తుత వేసవి పరిస్థితుల్లో సమ్మె చేయవద్దని, కొన్ని రోజులు ఓపిక పట్టాలని సీఎస్ మహంతి విజ్ఞప్తి చేశారు. జూన్ 2న కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే పీఆర్‌సీ ఫైలును ప్రభుత్వాల ముందు పెడతామని, ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఈ పీఆర్‌సీ ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తుందని, ఎలాంటి ఆందోళన వద్దన్నారు.