శంకర్ కొత్త ‘రోబో’గా...? | Aamir Khan to team up with Rajinikanth for Robot 2 | Sakshi

శంకర్ కొత్త ‘రోబో’గా...?

Nov 17 2014 11:55 PM | Updated on Sep 2 2017 4:38 PM

శంకర్ కొత్త ‘రోబో’గా...?

శంకర్ కొత్త ‘రోబో’గా...?

రజనీకాంత్‌తో శంకర్ తీసిన ‘రోబో’ ఓ విజువల్ వండర్. దక్షిణాదినే కాకుండా ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది.

రజనీకాంత్‌తో శంకర్ తీసిన ‘రోబో’ ఓ విజువల్ వండర్. దక్షిణాదినే కాకుండా ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనేది శంకర్ కల. ఇప్పటికే కథను కూడా సిద్ధం చేశారని సమాచారం. ఈ రెండో భాగంలో రజనీకాంత్ ఉండరని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే, శంకర్ ఇటీవలే బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌ని కలిసి ఈ కథ వినిపించారట. కథల ఎంపిక విషయంలో అమిత శ్రద్ధ కనబర్చే ఆమిర్ ఈ కథను వినగానే పచ్చజెండా ఊపేశారని సమాచారం. మరి.. ఈ చిత్రంలో రెండు రోబోలు ఉంటాయా? ఒక రోబోగా రజనీ, మరో రోబోగా ఆమిర్ నటిస్తారా? లేక ఒకే ఒక్క పాత్ర ఉంటుందా?... అసలీ సీక్వెల్ నిజంగానే తెరకెక్కుతుందా? తదితర ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement