
బుల్లితెరపై రియాల్టిషోలకు క్రేజ్ పెరిగిపోతోంది. దీనిపై సెలబ్రెటీలకు కూడా మక్కువ పెరుగుతోంది. పెద్ద స్టార్స్ చేత ఈ షోలను నిర్వహించడంతో జనాల్లో ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్‌లో బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికే 11 సీజన్లను పూర్తిచేసుకుంది. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో బిగ్‌బాస్ షోను నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడం, మళయాలం, మరాఠి, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్ షోను నిర్వహిస్తున్నారు.
తెలుగు, తమిళ, కన్నడంలో ఈ షో ఇప్పటికే పాపులర్ అయ్యింది. తెలుగులో మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్వహించగా, రెండో సీజన్‌కు నేచురల్‌స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తమిళ్ బిగ్‌బాస్ షోకు కమల్‌హాసన్, కన్నడకు షోకు సుదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మళయాల బిగ్‌బాస్‌కు మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోన్నారు. 15 మంది సెలబ్రెటీలను వంద రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం మాలీవుడ్‌లో జూన్ 24నుంచి ప్రసారం కానుంది.
Bigg Boss From June 24th Onwards #Biggbossmalayalam https://t.co/0nbyCr08ss
— Asianet (@asianet) June 3, 2018