
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా ముడుపుల కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీని 24వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తీహార్ జైల్లో తనకు ప్రత్యేక గది, బాత్‌రూమ్ ఇవ్వాలన్న కార్తీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. జైల్లో తనకు ఇంటి భోజనం తినడానికి అవకాశం ఇవ్వాలని, అలంకార వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతించాలని కార్తీ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 15న విచారించనున్నారు.