
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఫైనల్లో చైర్ అంపైర్ కార్లొస్ రామోస్ పట్ల సెరెనా విలియమ్స్ దురుసు ప్రవర్తన మరింత వివాదాస్పదం అవుతోంది. రామోస్‌ను ‘దొంగ, అబద్ధాల కోరు’గా సెరెనా దూషించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఓ వర్గం అంపైర్లు... క్షమాపణ చెప్పేవరకు ఆమె పాల్గొనే మ్యాచ్‌లను బహిష్కరించే ఆలోచన చేస్తున్నారు. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు సంఘంగా ఏర్పడాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు 47 ఏళ్ల రామోస్ విశేష అనుభవజ్ఞుడు.
పోర్చుగల్‌కు చెందిన ఇతడు పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు, మహిళల విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు అంపైరింగ్ చేశాడు. తాజా వివాదాస్పద యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ రామోస్ నిబంధనలకు కట్టుబడ్డాడని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) కితాబిచ్చింది. వరుస వివాదాల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని సమీక్షించాలని అమెరికన్ టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఏ) భావిస్తోంది.