ఆనంద్‌కు మూడో స్థానం | Viswanathan Anand ties for third in Zurich blitz; loses to Magnus Carlsen | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మూడో స్థానం

Jan 31 2014 1:11 AM | Updated on Sep 2 2017 3:11 AM

ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో విశ్వనాథన్ ఆనంద్‌కు మరోసారి ఓటమి ఎదురైంది.

జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో విశ్వనాథన్ ఆనంద్‌కు మరోసారి ఓటమి ఎదురైంది. జ్యూరిచ్ చెస్ క్లాసిక్‌లో భాగంగా గురువారం ఐదు రౌండ్ల పాటు జరిగిన బ్లిట్జ్ టోర్నీలో ఆనంద్ రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.
 
 ఆర్మేనియాకు చెందిన లెవోన్ అరోనియన్‌తో జరిగిన తొలి రౌండ్‌లో ఆనంద్ ఓడిపోగా, అనంతరం కరువానాను ఓడించాడు. ఆ తర్వాత నకమురాతో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకోగా, కార్ల్‌సన్‌తో 21వ ఎత్తు దగ్గర ఓడిపోయాడు. ఐదో రౌండ్‌లో గెల్ఫాండ్‌పై గెలిచాడు. అటు ప్రపంచ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన కార్ల్‌సన్‌కు తొలి రౌండ్‌లో ఓటమి ఎదురైంది. ఇటలీకి చెందిన కరువానా నల్ల పావులతో అతడిని మట్టికరిపించాడు. ఈ ఫలితాలతో క్లాసికల్ టోర్నీకి డ్రా కూడా ఖరారైంది. దీంట్లో ఆనంద్ మరోసారి తొలి రౌండ్‌లో ఆరోనియన్‌నే ఎదుర్కోనున్నాడు. చివరి రౌండ్‌లో కార్ల్‌సన్‌తో ఆడతాడు. ప్రపంచ అగ్రశ్రేణి పది మంది ఆటగాళ్లలో ఆరుగురి మధ్య ఐదు రౌండ్ల పాటు గేమ్స్ జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement