ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు
జేసీ సత్యనారాయణ
కాకినాడ సిటీ :
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డయల్ యువర్ జేసీ కార్యక్రమాన్ని శనివారం ఆయన నిర్వహించారు. సుమారు 17 ఫో¯ŒSకాల్స్ రాగా వాటిలో భూ సర్వే, రేష¯ŒS కార్డులు, బ్యాంక్ రుణాలు తదితర అంశాలు ఉన్నాయి. సర్వే నంబర్ 55/5ఏ–ఇలో తనకు 55 సెంట్ల భూమి ఉంటే రికార్డుల్లో 25 సెంట్లే చూపిస్తున్నారని కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన బాదంపూడి పుల్లయ్య తెలిపారు. దీన్ని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. గ్యాస్ సిలెండర్ డెలివరీకి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని అంబాజీపేట మండలం నుంచి వెంకటరావు, రామచంద్రపురంలోని 10వ నంబర్ రేష¯ŒS షాపు డీలర్ సక్రమంగా సరుకులు ఇవ్వడం లేదని, బియ్యం రైస్ మిల్లుకు అమ్మేస్తున్నారని పి.రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డీఎస్ఓను ఆదేశించారు. జీఎస్ఎల్ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతున్న తన కుమార్తె బి.చందనకు మొదటి సంవత్సరం ఉపకార వేతనం వచ్చిందని, రెండో సంవత్సరానికి వచ్చినా ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్లో జమ కాలేదని, సోషల్ వెల్ఫేర్ అధికారులను కలుస్తున్న సమస్య పరిష్కారం కాలేదని రాజమహేంద్రవరానికి చెందిన వీరకుమారి ఫిర్యాదు చేశారు. దీనిపై జేసీ స్పందిస్తూ సంబంధిత శాఖ జేడీతో మాట్లాడి చర్యలకు ఆదేశిస్తామన్నారు. వివిధ అంశాలపై వచ్చిన ఫో¯ŒSకాల్స్‌కు జేసీ సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వి.రవికిరణ్, డీఎం ఎ.కృష్ణారావు, కలెక్టరేట్ ఏఓ తేజేశ్వరరావు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.