Tirupati: భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి
తిరుపతి: నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్న హెచ్ఐజీ భవనం పైనుంచి కిందపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు.