Kaliyugam
-
2064లో అసలేం జరగనుంది?.. తెలుసుకోవాలంటే ఈ ట్రైలర్ చూసేయండి!
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం 'కలియుగం-2064'. ఈ సినిమాకు ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చేనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్లపై కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తే రాబోయే కాలంలో 2064లో మనుషులు ఎలా ఉంటారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భయంతో, ఆకలితో చద్దామా.. లేదంటే పోరాడి చద్దామా? అనేది మన చేతుల్లో ఉంది అనే డైలాగ్ వింటే మానవుడు తన మనుగడే చేసే పోరాటంగా చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది. 2064లో మనుషులు పరిస్థితి ఏంటనే కోణంలోనే ఈ సినిమాకు రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డాన్ విన్సెంట్ సంగీతమందిస్తున్నారు.Kaliyugam doesn't ask for your attention.It takes it.It burns the screen.It screams through your bones.Witness the world of Kaliyugam on May 9th 2025! Release by @MythriRelease ❤️🔥'Kaliyugam 2064' trailer out now :https://t.co/r3iFWGNqUl#kaliyugam2064… pic.twitter.com/U99L2fLPmH— Mythri Movie Distributors LLP (@MythriRelease) April 25, 2025 -
ఏమవుతుంది?
ప్రపంచ మానవాళికి 2064 సంవత్సరంలో ఏం అవుతుంది? ఏం మార్పులు సంభవిస్తాయి? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘కలియుగం’. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో కేఎస్ రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా ‘కలియుగం’ రూపొందింది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డాన్ విన్సెంట్, కెమెరా: కె. రామ్‌చరణ్. -
Shraddha Srinath: హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కలియుగం మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
ముప్ఫై ఏళ్లు ముందుకు...
2020 నుంచి ఏకంగా ముప్ఫై ఏళ్లు ముందుకు వెళ్లి 2050లోకి అడుగుపెట్టబోతున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఎందుకు అంటే? ఆమె అంగీకరించిన తాజా చిత్రం ‘కలియుగం’ కథ 2050 నేపథ్యంలో సాగుతుంది. ‘జెర్సీ’లో మంచి నటన కనబరచిన శ్రద్ధా ఈ చిత్రకథ వినగానే అంగీకరించారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కేఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రమోద్ సుందర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ – ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాను. అంత గొప్పగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. ‘‘అద్భుతమైన కథతో హారర్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా ఉంటుంది. 2021 జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తాం. 2050 బ్యాక్‌డ్రాప్ కాబట్టి సెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అసిస్టెంట్ రామ్‌చరణ్ సినిమాటోగ్రాఫర్‌గా చేయనున్నారు. -
హరినామ సంకీర్తనం
‘‘మాసానాం మార్గశీర్షోస్మి’’ అనే గీతా సూక్తి మార్గ శీర్ష మాసాన్ని వైష్ణవ మాసంగా పేర్కొంటున్నది. ఈ మాసంలో హరి నామాన్ని నోరారా పలికితే సకల శుభాలు కలుగుతాయని గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో పలుమార్లు పేర్కొన్నది. పోతన ‘‘శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ’’ అంటూ భగవన్నామాన్ని పలుకని నాలుక నాలు కే కాదని, నోరు నొవ్వంగ భగవన్నామాన్ని పలకాలని ఉపదేశించాడు. కలియుగంలో హరినామస్మరణాన్ని మించినది లేదని ‘‘కలౌనామ సంకీర్తనమ్’’ వంటి సూక్తులు ప్రబోధిస్తున్నాయి. కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల వల్ల, ద్వాపర యుగంలో అర్చనల వల్ల ఎటువంటి మహోన్నత ఫలితాలు కలిగినవో, అట్టి మహా ఫలితాలు ఈ కలియుగంలో కేశవుని కీర్తించుట వల్ల కలుగుతాయని ‘‘ధ్యాయన్ కృతే, యజన్యజ్ఞై స్ర్తేతాయామ్ ద్వాపరే ర్చయన్ యథాప్నోతి తదాస్నోతి కలౌ సంకీర్త్య కేశవమ్॥ అనే విష్ణుపురాణ శ్లోకం (వి.6-2-17) ద్వారా తెలియుచున్నది. భగవన్నామ సంకీర్తనకు కఠోర నియమాలేవీ ఉండవు. త్రికరణశుద్ధిగా చేస్తే చాలు. సమయ సందర్భాలు కూడా నామ సంకీర్తనకు వర్తించవని పెద్దల మాట. తెలిసి చేసినా, తెలియక చేసినా పాపాలన్నీ నీటిలో ఉప్పు కరిగినట్లు కరిగిపోతాయని ‘‘జ్ఞానతో జ్ఞానతోవా పి వాసుదేవస్య కీర్తనాత్ కిల్బిషం విలయం యాతి తోయేన లవణం యథా॥’’ అనే శ్లోకం ఉద్బోధిస్తున్నది. నీరు అగ్నిని చల్లార్చు నట్లు, సూర్యకాంతి చీకటిని పోగొట్టునట్లు కలి మాలిన్య మును, పాపరాశినంతటిని భక్తితో చేసే హరినామ సంకీర్తనమొక్కటియే నశింపజేయునని ‘‘శమాయాలం జలం వహ్నేస్తమసో భాస్కరోదయః శాన్తిః కలౌ హ్యఘౌఘస్య నామ సంకీర్తనం హరేః॥ అనే శ్లోకము మనకు ఉద్బోధిస్తున్నది. వేల గంగా స్నానములు, కోటి పుష్కర స్నానముల వల్ల తొలగని పాపములు కూడా హరినామస్మరణ వల్ల నశిస్తాయని, తపస్సు ద్వారా, కర్మానుష్ఠానము ద్వారా చేయు ప్రాయశ్చిత్తములకంటెను శ్రీకృష్ణ నామస్మర ణమే సర్వశ్రేష్ఠమైనదని మన ప్రాచీన వాఙ్మయంలో ఉంది. ఏకాగ్రచిత్తులై మధుసూదనుని స్మరించువారు పుట్టుక, చావు, ముసలితనము అనే మొసళ్లతో కూడిన ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటగలుగుతారని, అందుకు వేరొక సులభోపాయమేదీ లేదని ‘‘ఏకమేకాగ్రచిత్తస్సన్ సంస్మరన్మధుసూదనమ్ జన్మమృత్యుజరాగ్రాహం సంసారాబ్ధిం తరిష్యతి॥ ‘‘నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే’’ వంటి ప్రమాణములు మనకు ఉద్బోధిస్తున్నాయి. శ్రీ రామచంద్రస్వామి కన్న శ్రీరామ నామ మహి మయే గొప్పదని భావించే మనము నోరారా భగవన్నా మాన్ని పాడి సకల శుభాలను సొంతం చేసుకుందాం. - సముద్రాల శఠగోపాచార్యులు