not attend
-
జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా
పాట్నా: సీఎం నితీశ్ కుమార్ సర్కారుపై అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అధికార జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. శనివారం సీఎం నితీశ్ ఇచ్చిన విందుకు కొందరు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఆదివారం మంత్రి విజయ్ కుమార్ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభా పక్షం భేటీకి సైతం కొందరు గైర్హాజరవడం కలకలం రేపింది. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో గైర్హాజరయ్యారని చౌదరి చెప్పారు. తొలుత ఆర్జేడీకి చెందిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం, అనంతరం ప్రభుత్వంపై విశ్వాస పరీక్షలో వారంతా ఓటేస్తారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ జేడీయూ ఎల్పీ భేటీలో పాల్గొనడం విశేషం. సోమవారం వామపక్ష సభ్యులతో కలిసి ఆర్జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని తెలిసింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం పటా్న చేరారు. -
G20 Summit: జిన్‌పింగ్ ఎందుకు రావట్లేదు ?
జీ20 సదస్సుకు కయ్యాలమారి చైనా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదా ?. అందుకే అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు బదులు ప్రధాని లీ కియాంగ్‌ను పంపించారా ?. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తలో విశ్లేషణ చెబుతున్నారు. జీ20 కూటమి ఆవిర్భావం తర్వాత చైనా అధ్యక్షులు ఒకరు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సుకు హాజరుకాకుండా జిన్‌పింగ్ చైనాలోని ఉండి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2020 మే నెల నుంచి భారత్‌తో సరిహద్దు వెంట ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, భారీగా సైన్యం మొహరింపు వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటం వల్లే జిన్‌పింగ్ ఆగ్రహంతో సదస్సుకు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు కారణం అది కాదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదే అదుపు తప్పుతున్న చైనా ఆర్థిక పరిస్థితి. జిన్‌పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అప్పుడే వచ్చిన సాంస్కృతిక విప్లవం ధాటికి ఆయన తండ్రి పేదవాడిగా మిగిలిపోయాడు. దీంతో జిన్‌పింగ్ బాల్యంలో కష్టాలు చూశాడు. పొలంలో సాధారణ కూలీగా పనిచేశాడు. ఆరేళ్లు ఇబ్బందులు పడ్డాడు. అయితే బలీయమైన చైనాకు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే ఆనాటి కష్టాలు గడ్డిపరకతో సమానమే. ‘చైనా రాజ్య విస్తరణ వాదం, దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం, ప్రపంచ వస్తూత్పత్తి మార్కెట్‌కు ఏకైక దిక్కుగా మారాలన్న వ్యూహాలతో చైనా చాలా ప్రపంచ దేశాలకు శత్రువుగా మారింది. ఇలాంటి తరుణంలో చైనాతో కలిసి జీ20 వేదికను కలిసి పంచుకునేందుకు తోటి దేశాలు విముఖత చూపుతున్నాయి’ అని మేథో సంస్థ కార్నీగ్ చైనా డైరెక్టర్ పాల్ హెనెల్ వ్యాఖ్యానించారు. ఆ అప్రతిష్ట పోగొట్టుకునేందుకే ‘ సదస్సు విజయవంతం అవడానికి అందరితో కలిసి పనిచేస్తాం’ అని బీజింగ్ తాజాగా ప్రకటించింది. ‘విదేశీ పర్యటనకు పక్కనబెట్టి స్వదేశ సమస్యలపై జిన్‌పింగ్ దృష్టిపెట్టారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పొరుగు దేశాలతో కయ్యానికి దిగారు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకోవడంతో జిన్‌పింగ్‌కు తలనొప్పి పెరిగింది’ అని సింగపూర్‌లోని నేషనల్ యూనివ ర్సిటీ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వూ వ్యాఖ్యానించారు. దెబ్బకొట్టిన హౌజింగ్ రంగం ఇటీవల దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా పలు సమస్యలు చైనాలో తిష్టవేశాయి. కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నాయి. కర్మాగారాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు ముందుకు రావట్లేదు. ఎగుమతులు దిగజారాయి. ఆగస్టులో ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.8 శాతం తగ్గాయి. దిగుమతులు 7.3 శాతంపెరిగాయి. నిరుద్యోగిత భారీగా పెరగడంతో ప్రభుత్వం తాజా గణాంకాలు బహిర్గతంచేయడం మానేసింది. ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ప్రధాన డెవలపర్లు చేతులెత్తేసి దివాలాను ప్రకటించారు. దీంతో రియల్ ఎసేŠట్ట్ రంగం సంక్షోభంలో చిక్కింది. 40 ఏళ్ల భవిష్యత్ అభివృద్ది మోడల్‌ను ఈ అంశాలు తలకిందులుచేసేలా ఉన్నాయి. ప్రాపర్టీ రంగంపై అతిగా ఆధారపడటం, అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షల విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. రుణాల పునాదిపై నెలకొల్పిన అభివృద్ధి మోడల్ ఈ పరిస్థితికి మరో కారణం. దేశం అప్పులు పెరిగిపోయాయి. 2023 తొలి త్రైమాసికంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి రికార్డు స్థాయిలో 279 శాతంగా నమోదైందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. రుణాలు అతిగా తీసుకొచ్చి మౌలిక వసతులపై ఖర్చుచేసిన పాపం ఇప్పుడు పండిందని మరో వాదన. హౌజింగ్ బుడగ బద్ధలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ 25 శాతం ప్రాపర్టీ మార్కెట్‌పైనే ఆధారపడింది. ఇన్నాళ్లూ కేవలం చైనాపై ఆధారపడిన విదేశీ బ్రాండ్లు ఇప్పుడు చైనాతోసహా ఇతర(చైనా ప్లస్ స్ట్రాటజీ) దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ప్రధానంగా లాభపడేది ఇండియానే. ఆపిల్, టెస్లా మొదలుకొని నైక్ వరకు అన్ని ప్రధాన సంస్థల తయారీకేంద్రాలు చైనాలోనే ఉన్నాయి. కార్మికులకు అధిక జీతభత్యాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ సంస్థలు చైనాకు బదులు వేరే దేశాల వైపు చూస్తున్నాయి. ఆర్మీలో అవిధేయత? చైనా ఆర్మీలో పెరిగిన అవినీతి, పాలక పార్టీ పట్ల తగ్గిన విధేయతపై జిన్‌పింగ్ భయపడుతున్నారని ఆసియా పాలసీ సొసైటీ ఇన్స్టిట్యూట్లో జాతీయ భద్రతా విశ్లేషకుడు లైల్ మోరిస్ చెప్పారు. చైనా సైన్యంలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ విభాగంలోని జనరల్, డెప్యూటీ జనరల్‌లను తొలగించడాన్ని ఆయన ఉటంకించారు. తనకు నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ను జిన్‌పింగ్ తప్పించడంతో పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగింది. జిన్‌పింగ్ పాలనా సామర్థ్యానికి ఈ ఘటనలు మాయని మచ్చలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని పెరిగితే డ్రాగన్ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు తెరపడే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకునే జిన్‌పింగ్ చైనాను వదలి బయటకు రావట్లేదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు!
న్యూఢిల్లీ: జీ20 దేశాల అధినేతల ముఖ్యమైన శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నెల 9, 10న ఢిల్లీలో ఈ సదస్సు జరుగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ సహా వివిధ దేశాదినేతలు హాజరు కానున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం లేదని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. బదులుగా ప్రధానమంత్రి లీ కియాంగ్ రావొచ్చని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ çకూడా సదస్సుకు రావడం లేదు. -
జీ20 సదస్సుకు హాజరు కాలేకపోతున్నా
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే నెలలో జరిగే జీ20 కీలక సదస్సుకు తాను హాజరు కాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సహకారం, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ‘బ్రిక్స్’ సదస్సు ప్రస్తావనకు వచ్చింది. సెపె్టంబర్ 9, 10న జరిగే జీ20 సదస్సుకు హాజరయ్యే విషయంలో తన అశక్తతను పుతిన్ తెలియజేశారు. ఈ సదస్సుకు రష్యా తరఫున తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. జీ20కి సారథ్యంలో భాగంగా భారత్ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు గాను పుతిన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ హాజరు కాలేదు. -
భారత్‌లో జరిగే జీ20 భేటీకి పుతిన్ దూరం
మాస్కో: వచ్చే నెలలో భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ పాల్గొనడం లేదు. ఉక్రెయిన్‌లో ఏడాదికి పైగా కొనసాగుతున్న స్పెషల్ మిలటరీ ఆపరేషన్‌పైనే ఆయన దృష్టంతా ఉందని శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. దీంతోపాటు బిజీ షెడ్యూల్ ఉన్నందున అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొంది. అధ్యక్షుడు పుతిన్ జీ20 సమావేశంలో వర్చువల్‌గా పాల్గొనే విషయం తర్వాత ఖరారవుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 దేశాల నేతల సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. తాజాగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ భేటీకి కూడా పుతిన్ వెళ్లలేదు. -
బీజేపీ సంబరాలకు ఫడ్నవీస్ దూరం
ముంబై: మహారాష్ట్ర సీఎం అవుతారని అంతా భావించగా బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్నారా? ఆయన వ్యవహార శైలి ఈ అనుమానాలను బలపరిచేలానే ఉందంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు శుక్రవారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాలకు ఆయన డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాబోరని సమాచారం. ఆదివారం నుంచి జరిగే రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన చర్చల్లో ఫడ్నవీస్ బిజీగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని ఆయన గురువారం ప్రకటించడం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాన్ని వెంటనే ఖండించడం తెలిసిందే. బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరుతుందని, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అవుతారని నడ్డా ప్రకటించారు. 2014 నుంచి 19 దాకా ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షిండే ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు షిండే మంత్రివర్గంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా చేరాల్సి వచ్చింది! మరోవైపు షిండే ప్రమాణస్వీకారం ముగుస్తూనే ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేతో ఫడ్నవీస్ భేటీ అయినట్టు చెబుతున్నారు. అయితే ఫడ్నవీస్ డిప్యూటీ అవడం అనూహ్యమేమీ కాదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పుకొచ్చారు. ‘‘ఇది చాలా మందికి షాకిచ్చిందని నాకు తెలుసు. కానీ ఇందులో అనూహ్యమేమీ లేదు. హిందూత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షిండేకు సీఎం పోస్టు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కానీ షిండే స్వయంగా ఫడ్నవీస్‌ను తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. దాంతో ఢిల్లీ పెద్దల అనుమతితో ఆయన చేరారు’’ అని చెప్పారు. మనకింద పని చేసిన వ్యక్తి సారథ్యంలో పని చేయాలంటే ఎంతో పెద్ద మనసుండాలన్నారు. -
మీడియాతో మాట్లాడేది లేదు!
ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జపాన్ స్టార్ నవోమీ ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కానని ప్రకటించింది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పింది. గ్రాండ్‌స్లామ్ నిబంధనల ప్రకారం మీడియా సమావేశానికి హాజరు కాకపోతే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉండగా...అందుకు తాను సిద్ధమని ప్రకటించింది. -
కరోనా వ్యాక్సిన్ వచ్చాకే... మైదానాలకు వస్తాం!
న్యూయార్క్: లీగ్‌లు, ఆటలు ప్రస్తుతానికైతే కోవిడ్ –19 వల్ల జరగట్లేదు. ఒకవేళ త్వరలో ఆటలు మొదలైనా కూడా ప్రేక్షకులు కరువయ్యే అవకాశాలున్నాయి. అమెరికా ప్రజల్లో చాలా మంది కరోనాకు మందు, వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాలకు వెళ్లబోమని చెప్పారు. ఇటీవల అక్కడ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 72 శాతం మంది ప్రస్తుతం ఆరోగ్యకర పరిస్థితులేవీ లేవు కాబట్టి ఆటలకు హాజరు కాబోమని చెప్పారు. 12 శాతం ప్రజలు మాత్రం ఆటలు చూసేందుకు ఆసక్తి కనబరిచినప్పటికీ గ్యాలరీలో సామాజిక దూరం పాటిస్తేనే వెళ్తామని చెప్పారు. కేవలం 13 శాతం మంది మాత్రం ఏదేమైనా ప్రత్యక్ష వీక్షణను ఆస్వాదించేందుకు సిద్ధమేనన్నారు. స్టిల్మన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరిధిలో షార్కీ ఇన్స్టిట్యూట్ ఈ నెల 6,7,8 తేదీల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 762 మంది అభిప్రాయాల్ని సేకరించగా... ఇందులో పాల్గొన్న అమెరికన్లు మాత్రం ఇంతకుముందులా ఆటల కోసం ఎగబడి మైదానాలకెళ్లి చూడాలనుకోవడం లేదని... టీవీల్లో చూసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
‘కర్తార్‌పూర్’కు మన్మోహన్ రారు
న్యూఢిల్లీ/లాహోర్: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ యాత్రికుడిలాగా మన్మోహన్ అక్కడికి వెళ్తారని ఆదివారం పేర్కొన్నాయి. కాగా, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలని తాము పంపిన ఆహ్వానాన్ని మన్మోహన్ అంగీకరించారని ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు వెల్లడించాయి. ‘నవంబర్ 9న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్ ఒక ప్రత్యేక అతిథిగా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిగా హాజరవుతారు’ అని అక్కడి స్థానిక వార్తాపత్రిక డాన్ పేర్కొంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని సిక్కు జాతా ప్రతినిధుల బృందంతో పాటు మన్మోహన్ సింగ్ పాల్గొననున్నారు. -
నీతి ఆయోగ్ భేటీ వృథా
కోల్‌కతా: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతిఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగ. ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఈ వ్యవస్థ కంటే అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను బలోపేతం చేయడం అవసరం. లేకుంటే రాష్ట్రాల మధ్య అసమతౌల్యాన్ని తగ్గించేలా నిధులు కేటాయించే అధికారాన్ని నీతి ఆయోగ్‌కు ఇవ్వాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కూడా సుప్రీంకోర్టులోని కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘జడ్జీల ఎంపిక కోసం సుప్రీంకోర్టులో కొలీజియం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఎన్నికల సంఘంలో కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలి’ అని అన్నారు. -
రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ దూరం
-
డ్రైవర్లు, అటెండర్లు రారు.. ఉద్యోగానికి వచ్చేదెలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుండటంతో స్త్రఫఋ సచివాలయంలో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లు విధులకు సెలవుపెట్టాలని నిర్ణయించుకున్నారు. సచివాలయంతో పాటు పలు విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా మంగళవారం సాధారణ సెలవు పెడుతున్నారు. ఏపీకి చెందిన ఉద్యోగులైనప్పటికీ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నందున పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం ఇంటి చిరునామా తదితర సర్టిఫికెట్లు కావాలంటే సర్వేకు వివరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది ఏపీకి చెందిన ఉద్యోగులకు కూడా మంగళవారం సెలవు పెడుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సెలవు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న డ్రైవర్లు, అటెండర్లు అత్యధికులు తెలంగాణకు చెందిన వారే కావటంతో వారు సర్వేకు వివరాలు అందించేందుకు ఇంటి దగ్గరే ఉండాలని భావిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వారి వాదనతో ఏకీభవిస్తున్నారు. అయితే.. డ్రైవర్లు, అటెండర్లు రారు.. ఆఫీస్‌కు వచ్చేదెలా..? అని ఏపీ సచివాలయంలో ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. నాల్గో తరగతి ఉద్యోగ సంఘం ధర్నా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం జరగనున్న సమగ్ర సర్వేకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సెలవు ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం (నాల్గవ తరగతి ఉద్యోగులు) డిమాండ్ చేసింది. సచివాలయం ఎల్ బ్లాక్ ముందు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. -
వేళలకు మంగళం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో అమలులోకి వచ్చిన నూతన వేళలకు కార్యకర్తలు తొలిరోజే మంగళం పాడారు. పారితోషికంతోపాటు పనిగంటలు పెంచుతూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. ఒంగోలు నగరంలో తొంభై శాతానికిపైగా అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్నం రెండుగంటల్లోపే మూతపడ్డాయి. దానికితోడు అంగన్వాడీ కేంద్రాలకు సెక్టార్ మీటింగ్‌లు నిర్వహించడంతో కేంద్రాల్లో చిన్నారులు లేక బోసిపోయాయి. నవంబర్ 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల పనివేళలను పెంచుతూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తూ వచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలు స్వల్పంగా పెంచుతూ కేంద్రాలను సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 4093 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. దాదాపు అన్ని కేంద్రాలకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తకు నెలకు రూ 3700, ఆయాకు రూ 1950 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కేంద్రాల వేళలతోపాటు కార్యకర్తకు రూ 500, ఆయాకు రూ 250 పెంచారు. కార్యకర్తకు 4200, ఆయాకు రూ 2,200 వేతనంగా నిర్ణయించారు. పెదవి విరుస్తున్న అంగన్వాడీలు: వేతనాలు స్వల్పంగా పెంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాలను నిర్వహించడంపై అంగన్వాడీలు పెదవి విరుస్తున్నారు. అన్ని గంటలపాటు చిన్నారులను కేంద్రాల్లో కూర్చోబెట్టుకోవడం కష్టంగా ఉంటుందని వాపోతున్నారు. కేంద్రానికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం వరకు ఉండటమే గగనమైన నేపథ్యంలో సాయంత్రం వరకు ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా తాము కేంద్రాలను నిర్వహిస్తే వారికందించే సౌకర్యాలు తమకు వర్తింప చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నెలరోజులకు పైగా కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిందని, తాజాగా కోడిగుడ్లను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడం తప్పితే వాటిని సరఫరా చేయలేదన్నారు. ఒకవైపు హక్కుదారులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సమాధానాలు చెప్పుకోలేక, ఇంకోవైపు ఏడుగంటలపాటు కేంద్రాలను నిర్వహించలేక అంగన్వాడీలు సతమతమవుతున్నారు. వేళల పెంపుపై నిరసనలు తెలిపేందుకు అంగన్వాడీలు సిద్ధమవుతున్నారు.