సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుండటంతో స్త్రఫఋ సచివాలయంలో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లు విధులకు సెలవుపెట్టాలని నిర్ణయించుకున్నారు. సచివాలయంతో పాటు పలు విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా మంగళవారం సాధారణ సెలవు పెడుతున్నారు. ఏపీకి చెందిన ఉద్యోగులైనప్పటికీ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నందున పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం ఇంటి చిరునామా తదితర సర్టిఫికెట్లు కావాలంటే సర్వేకు వివరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది ఏపీకి చెందిన ఉద్యోగులకు కూడా మంగళవారం సెలవు పెడుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సెలవు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న డ్రైవర్లు, అటెండర్లు అత్యధికులు తెలంగాణకు చెందిన వారే కావటంతో వారు సర్వేకు వివరాలు అందించేందుకు ఇంటి దగ్గరే ఉండాలని భావిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వారి వాదనతో ఏకీభవిస్తున్నారు. అయితే.. డ్రైవర్లు, అటెండర్లు రారు.. ఆఫీస్‌కు వచ్చేదెలా..? అని ఏపీ సచివాలయంలో ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.
నాల్గో తరగతి ఉద్యోగ సంఘం ధర్నా
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం జరగనున్న సమగ్ర సర్వేకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సెలవు ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం (నాల్గవ తరగతి ఉద్యోగులు) డిమాండ్ చేసింది. సచివాలయం ఎల్ బ్లాక్ ముందు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు.
డ్రైవర్లు, అటెండర్లు రారు.. ఉద్యోగానికి వచ్చేదెలా?
Published Tue, Aug 19 2014 1:51 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement