prevent illegal downloads
-
వాట్సప్ యూజర్లే లక్ష్యంగా కొత్త మోసం!
దేశంలోని వాట్సప్ వినియోగదారులపై ‘ఫ్యాట్ బాయ్ పానెల్’ అనే కొత్త మాల్వేర్ దాడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది 2.5 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ పరికరాలను ప్రమాదంలోకి నెడుతోందని చెబుతున్నారు. వాట్సప్‌లో షేర్ అయ్యే ఫేక్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా యూజర్ల బ్యాంక్ అకౌంట్ల నుంచి నేరుగా డబ్బులు దొంగిలించేందుకు ఈ మాల్వేర్ను రూపొందించినట్లు తెలిపారు. దీన్ని గతంలో కంటే అధునాతన సైబర్ మోసంగా నిపుణులు చెబుతున్నారు. ఇది భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలను పోలి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.మోసం చేశారిలా..తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, ధారశివ్ అనే ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల డెయిరీ వ్యాపారికి బ్యాంకు అధికారిగా నటిస్తూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే బ్యాంక్ యాప్‌ను అప్డేట్ చేయకపోతే ఆ వ్యక్తి అకౌంట్ బ్లాక్ అవుతుందని పేర్కొన్నాడు. భయాందోళనకు గురైన ఆ వ్యక్తి వాట్సప్ ద్వారా పంపిన బ్యాంకింగ్ యాప్ లింక్‌ను ఇన్స్టాల్ చేయడానికి అనుమతించాడు. దీన్ని ఇన్స్టాల్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 26 అనధికారిక లావాదేవీల నుంచి అకౌంట్ బ్యాలెన్స్ దొంగలించారు. అయితే మోసగాళ్లు వాట్సప్‌లో పంపుతున్న లింక్‌లో ఫ్యాట్ బాయ్ పానెల్ ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫ్యాట్ బాయ్ పానెల్ అంటే ఏమిటి?సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపిరియం తెలిపిన వివరాల ప్రకారం ఫ్యాట్ బాయ్ ప్యానెల్ అనేది మొబైల్ ఫస్ట్ బ్యాంకింగ్ ట్రోజన్‌గా పని చేస్తుంది. ఇది దాదాపు 900 నకిలీ యాప్‌లలో దాగి ఉందని కనుగొన్నారు. ఎక్కువగా ఏపీకే ఫైల్స్ ద్వారానే ఇది వ్యాపిస్తుంది. గూగుల్ అధికారిక ప్లే స్టోర్‌లో కాకుండా నేరుగా ప్రత్యేక ఫైల్ ద్వారానే దీన్ని ఇన్స్టాల్ చేయిస్తారు. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మాల్వేర్ గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను నిలిపివేస్తుంది. ఎస్ఎంఎస్లను సొంతంగా చదవడానికి అనుమతిని పొందుతుంది. ఓటీపీలను (వన్-టైమ్ పాస్ వర్ట్‌లు) అడ్డుకుంటుంది. దాంతో యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేయడానికి వీలవుతుంది.ఎందుకు అంత ప్రమాదకరం?తక్కువ స్థాయిలో పనిచేసే పాత మాల్వేర్ మాదిరిగా కాకుండా ఫ్యాట్ బాయ్ ప్యానెల్ చాలా సమన్వయంతో ఉంటుంది.. ఇది సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పని చేస్తుంది. ఈ మాల్వేర్ బహుళ వెర్షన్లను ఏక కాలంలో నిర్వహిస్తుంది. దీన్ని కట్టడి చేయడం కష్టతరం. ఇది ఇప్పటికే 25 మిలియన్లకు పైగా పరికరాల నుంచి డేటాను సేకరించిందని జింపిరియం చీఫ్ సైంటిస్ట్ తెలిపారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. సాంప్రదాయ భద్రతా సాధనాలతో దీన్ని గుర్తించడం కష్టమని తెలిపారు.ఇదీ చదవండి: రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!ఎలా రక్షించుకోవాలి?యాప్‌లను ప్లేస్టోర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా డౌన్లోడ్ చేయవద్దు.అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవాలి.ఆటోమేటిక్ స్కానింగ్ కోసం గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎనేబుల్ చేసుకోవాలి.రియల్ టైమ్ ప్రొటెక్షన్‌తో కూడిన లైసెన్స్ వర్షన్ మొబైల్ సెక్యూరిటీ యాప్‌ను ఉపయోగించాలి.ముఖ్యంగా వాట్సప్‌లో తెలియని లింక్‌ను క్లిక్ చేయకూడదు.అప్లికేషన్ పర్మిషన్లను జాగ్రత్తగా సమీక్షించాలి.పూర్తిగా అవసరమైతే తప్ప ఎస్ఎంఎస్ లేదా కాల్ యాక్సెస్ ఓకే చేయవద్దు. -
కబాలి నిర్మాత హైకోర్టులో పిటిషన్
తమిళసినిమా: కబాలి చిత్రాన్ని ఇంటర్నెట్లో ప్రసారం నిషేధించాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను గురువారం చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకెళితే రజనీకాంత్ కథానాయకుడిగా యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ భారీ అంచనాల మధ్య త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితితుల్లో ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను గురువారం మదాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంటూ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిత్రం విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఇంటర్నెట్లలో అనధికారంగా ప్రసారం అవుతున్నాయన్నారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే పైరసీ సీడీలు వెలువడుతున్నాయని తెలిపారు. అందువల్ల భారీ వ్యయంతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారన్నారు. పైరసీని అరికట్టడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నా, కఠిన చర్యలు చేపట్టడం లేదన్నారు. మన దేశంలో 169 ఇంటర్నెట్ ప్రసార నిర్వాహకాలు ఉన్నాయని తెలిపారు. అందులో పని చేసే వారే పైరసీకి పాల్పడుతున్నారని అన్నారు. ఈ ఇంటర్నెట్లపై కఠిన చర్యలు తీసుకుంటే పైరసీని అరికట్టవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.ఇంతకు ముందు ఇందియావిన్ మగళ్ అనే చిత్రాన్ని ఇంటర్నెట్లో ప్రసారం చేసినందుకు ఆ ఇంటర్నెట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే చర్యలు చేపడతాయని ప్రకటించిందన్నారు. దీంతో వెంటనే ఆ చిత్రాన్ని ఆ ఇంటర్నెట్నుంచి తొలగించారన్నారు.కాబట్టి కొత్త చిత్రాలను ఇంటర్నెట్లో ప్రచారం చేస్తే వారి గుర్తుంపును రద్దు చేయాలని కేంద్రప్రభుత్వానికి ఆదేశించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.ఆ కేసు న్యాయమూర్తి కృపాకరన్ సమక్షంలో గురువారం సాయంత్రం విచారణకు వచ్చింది.