
Live Updates:
11.20 AM
► ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్
► చర్చి కాంపౌండ్‌లో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం
► క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌లో కేక్ కట్ చేసిన సీఎం జగన్
9.45 AM
► పులివెందుల భాకరాపురం సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
► క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.
సాక్షి, వైఎస్సార్ కడప: ఉదయం 9.05 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఇడుపుల పాయ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 9.25 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 9.45 నుంచి 11.05 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.15 గంటల వరకు సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పా టు చేసిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. 11.25 గంటలకు విజయా గార్డెన్స్‌కు చేరుకుని సారెడ్డి వరప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. 11.50 నుంచి 12.50 గంటల వరకు భాకరాపురంలోని నివాసంలో గడుపుతారు.1.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని విజయవాడకు వెళతారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
–పులివెందుల