బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్‌: ఆర్కే రోజా | YSRCP RK Roja Serious Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్‌: ఆర్కే రోజా

Published Mon, Mar 31 2025 11:46 AM | Last Updated on Mon, Mar 31 2025 2:06 PM

YSRCP RK Roja Serious Comments On Chandrababu

సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది! అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమలలో స్వామి వారి దర్శనానికి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. భగవంతుడికి విశ్రాంతి సమయం కూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది!. సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు.

వైఎస్‌ జగన్‌ పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి. కానీ, ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? పవన్‌, బీజేపీ. ఇది చంద్రబాబు నమూనా ప్రక్షాళన?. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!! అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement