మూగవేదన..తీరని రోదన | - | Sakshi
Sakshi News home page

మూగవేదన..తీరని రోదన

Published Sat, Apr 26 2025 12:28 AM | Last Updated on Sat, Apr 26 2025 12:28 AM

మూగవే

మూగవేదన..తీరని రోదన

● నేడు వరల్డ్‌ వెటర్నరీ డే..

జిల్లా సమాచారం..

జిల్లా పశువుల ఆస్పత్రి – 1

ఏరియా పశు వైద్యశాలలు – 14

వెటర్నరీ డిస్సెన్సరీ వైద్యశాలలు – 68

రూరల్‌ లైఫ్‌స్టాక్‌ యూనిట్లు – 75

రైతు భరోసా కేంద్రాలు – 297

పాడి ఆవులు – 4,67,507,

గేదెలు – 1,036

మేకలు – 13,80,063

గొర్రెలు – 4,38,362

పందులు – 359

కుక్కలు, కోళ్లు – 5,08,808

చాప్‌కటర్‌ పంపిణీ వివరాలు..

2021–22 670

2022–23 365

2023–24 1800

మొత్తం 2,835

చిన్న జబ్బు చేసినా మనం ఆస్పత్రికి ఉరుకులు..పరుగులు తీస్తాం. మూగ జీవాల పరిస్థితి వేరు. ప్రభుత్వ పశువైద్యశాలలు తప్ప గ్రామాల్లో వీటికి ప్రత్యేక ఆస్పత్రులు లేవు. ఉన్న వైద్యశాలల్లో సిబ్బంది లేరు.. మందులు లేక వెలవెలబోతున్నాయి. దీనికితోడు గత సర్కారు హయాంలో అమలవుతున్న పథకాలు ఆగిపోయాయి. వెరసి మూగవేదన తీరని రోదనగా మారింది. పశువైద్యం గాలిలో దీపం అన్న చందమైంది.

కాణిపాకం: కూటమి పాలనలో పశువైద్యం పడకేసింది. అత్యవసర సేవలు అటకెక్కాయి. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో పాడి పరిశ్రమ పరుగులు పెట్టింది. అప్పటి ప్రభుత్వం పాడి వృద్ధి, మెరుగైన పశు వైద్యానికి కృషి చేసింది. పలు పథకాలు అమలు చేస్తూ పాడి రైతులను ప్రోత్సాహించింది. క్షేత్రస్థాయిలో పశువులు, జీవాలకు తక్షణ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాడి పథకాలు నీరుగారాయి. వైద్య సేవలు కుంటుపడ్డాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే పశు సంవర్థక సహాయకులు సర్వేలకు పరిమితమయ్యారు. దీంతో పల్లెల్లో పశు వైద్యం అందని ద్రాక్షలా మారింది. నేడు వరల్డ్‌ వెటర్నరీ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

వరల్డ్‌ వెటర్నరీ డే చరిత్ర...

ఏటా ఏప్రిల్‌ చివరి శనివారం రోజు వరల్డ్‌ వెటర్నరీ డే జరుపుకుంటున్నారు. జంతువుల ఆరోగ్యం, సంరక్షణ, జంతు హింసను నిరోధించడానికి తీసుకోవాల్సిన ప్రయత్నాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఇందుకు తగ్గట్టు జిల్లాలో పశు వైద్య సేవలు అమలు కాలేదు.

వేధిస్తున్న సమస్యలివీ..

పశు వైద్యశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో పశు వైద్యం మరుగున పడింది. మందుల, మాత్రల కొరత వేధిస్తోంది. డాక్టర్లు విధుల్లో ఉండడం లేదు. చాలా చోట్ల మధ్యాహ్ననానికే డుమ్మా కొడుతున్నారు. జిల్లా పశు వైద్యశాలలో టైపిస్ట్‌ 1, రేడియోగ్రాఫర్‌ 1, అటెండర్లు –2, వెటర్నరీ అసిస్టెంట్‌ –1తోపాటు పలు పోస్టులు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తోంది. అలాగే మండలాల్లోని పశు వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కూడా పలు పోస్టులు ఖాళీలున్నాయి. ఇక ఉన్న సిబ్బంది కూడా సర్వేలకు పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో మూగజీవులు అనారోగ్య బారిన పడితే ప్రైవేటు వైద్యులే దిక్కుగా మారుతున్నారు. ఈ కారణంగా పశు వైద్యం మూగబోయి మూగజీవులు మృత్యువాత పడుతున్నాయి.

పశువైద్యానికి ఇబ్బందిగా ఉంది

ముందు పశువైద్యానికి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. ఫోన్‌ చేస్తే ఎక్కడున్న వైద్య సిబ్బంది వచ్చి వైద్యం చేస్తున్నారు. టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేస్తే బండి ఇంటికాడికి వచ్చేది. ఇప్పుడు పశువులకు వైద్యం చేయించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు సిబ్బందికి ఫోన్‌ చేస్తే సర్వేలంటున్నారు. వాళ్లకు కూడా సర్వేలు ఇస్తే మూగ జీవాలు ఏమైపోవాలి. వారి సేవలు గ్రామాల్లో అవసరం. మనిషికి ఏ రకంగా తక్షణ వైద్యం అవసరమో..ఆ రకంగా జీవాలకు తక్షణ వైద్యం అవసరం. అధికారులు దీనినిగుర్తించాలి.

– రాజేంద్ర, శ్రీరంగరాజుపురం

ప్రస్తుత ప్రభుత్వ పాలనలో..

పశు సంచార పశు ఆరోగ్య సేవలు ఆపివేసింది.

అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు జరగడం లేదు.

రాయితీ పాడి పరికరాల అందజేతకు స్వస్తి పలికింది.

బల్క్‌ మిల్క్‌ సెంటర్లను మూయించింది.

మందులు, మాత్రల కొరత వేధిస్తోంది.

ఉచిత బీమాకు, పశు నష్ట పరిహారానికి మంగళం పాడింది.

గత ఐదేళ్ల పాలనలో..

గత ఐదేళ్ల పాలనలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పశు వైద్య సేవలకు ప్రాధాన్యత ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పలు పథకాలను అమలు చేసింది. మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చింది.

పశుసంవర్థక సహాయకుల నియామకం.

వైఎస్సార్‌ పశునష్ట పరిహారం..ఉచిత బీమా

పశు హెల్త్‌ కార్డులు

వైఎస్సార్‌ చేయూత ద్వారా పశువుల కొనుగోలు

1962 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవలు

రాయితీ ద్వారా పశువులకు అవసరమైన మొక్క జొన్నలు, చాప్‌కటర్‌, మినరల్‌ మిక్చర్‌, పశువుల దాణా సరఫరా.

సీజనల్‌ వ్యాధుల కట్టడికి ముందస్తు చర్యలు. పశువులు, జీవాలకు టీకాలు, పురుగుల మందులు పంపిణీ.

వారానికొకసారి రైతులతో పశు సంవర్థక అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు.

గ్రామంలో బల్క్‌మిల్క్‌ సెంటర్‌లు ఏర్పాటు

చిత్తూరు నగరంలో మూతపడిన విజయ డెయిరీకి పునర్జీవనం పోసింది. అమూల్‌ డెయిరీకి అప్పగించి, అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. ఈ ఫలితంగా జిల్లాలో పాడి పరిశ్రమ పుంజకుంది. చాలా మంది ఇతరాత్ర పనులను వదిలి పాడి ఆవులతో పాల ఉత్పత్తిని పెంచుకుంటూ జీవనం చేసేందుకు అడుగులు వేశారు.

మూగవేదన..తీరని రోదన1
1/1

మూగవేదన..తీరని రోదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement