
అందాల పోటీలు అనగానే ఏముంటాయి. వారి ఫిట్‌నెస్, విలక్షణమైన ఫ్యాషన్ వంటి పోటీలు నిర్వహిస్తారు. చివరగా వారిలో దాతృత్వం గుణాలు కొద్దిమొత్తంలోనైనా ఉన్నాయా..?. వారి దృష్టిలో అందం అంటే భౌతికమైనదే అనే తరహాలో ముఖాముఖి పరీక్షలు ఉంటాయి. కానీ అందానికి కూడా ఓ పర్పస్ ఉండాలంటూ వినూత్నంగా నిర్వహించేలా సరికొత్త పోటీకి తెరతీసింది ప్రపంచ సుందరీగా టైటిల్‌ని గెలుచుకున్నా మిల్లా మాగీ. ప్రతిసారిలా ఓ మూసధోరణిలో పోటీలు కాకుండా గొప్ప స్కిల్‌తో కూడిన పోటీ ఉండాలంటోంది. అందానికి కూడా ఓ అర్థం, పరమార్థం ఉండాలంటోంది. కేవలం కళ్లప్పగించి చూస్తుండిపోయేలా.. వావ్! అని ఆశ్యర్యచకితులని చేసేది అందం కానే కాదంటోదామె. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..
మిస్‌వరల్డ్ ఇంగ్లాండ్ పోటీలో ఈ సరికొత్త రౌండ్ కాంపిటీషన్‌ని కండక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇది మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ టైటిల్ హోల్డర్ మిల్లా మాగీ ఆలోచన నుంచి వచ్చిందట. పోటీలను అధునికరించేలా ప్రభావవంతమైన నైపుణ్యాలు కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సీపీఆర్ స్కిల్‌ని ప్రవేశ పెట్టారు. అందాల పోటీల్లో సాధారణంగా ఉండే అన్ని రౌండ్ల పోటీలు ఉంటాయి. అయితే చివరి రౌండ్‌లో పోటీదారులకు మాత్రం సీపీఆర్ స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు.
అంతేగాదు మిస్ ఇంగ్లాండ్ పోటీలో సెమీ ఫైనల్‌కు చేరుకున్న పోటీదారులంతా ఇంగ్లాండ్ అంతటా నగరాల్లో సిపిఆర్ ఎలా చేయాలో పిల్లలకు బోంధించే కార్యక్రమాల్లో పాల్గొన్సాల్సి ఉంటుంది. ఫైనల్‌కి చేరుకున్న సుందరీమణులకు స్విమ్ రౌండ్‌లో ఈ సీపీఆర్ టెస్ట్‌ని నిర్వహించడం జరుగుతుంది.
అలాగే మన భారత్‌లోని హైదరాబాద్‌లో జరగనున్న 72వ మిస్ వరల్డ్‌పోటీల్లో కూడా ఈ రౌండ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు మిల్లా మాగీ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది. మాగీ దీన్ని తన బ్యూటీ విత్ పర్పస్ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు.
ఈ పోటీ ఎందుకంటే..
మిల్లా మాగీ తన తాతలు, తండ్రులను ఈ సీపీఆర్ స్కిల్ తెలియకే కాపాడుకోలేకపోయారట. తమ కుటుంబంలో ఎవ్వరికీ దీనిపై అంత అవగాహన గానీ నిర్వహించడం గానీ తెలియకపోవడంతో అంతటి విషాదాన్ని చవిచూడాల్సి రావడంతో ఇలా ప్రాజెక్టు చేపట్టి మరీ అవగాహన కల్పిస్తోందామె. ఒక రకంగా పోటీదారులంతా ఈ కాంపిటీషన్ కోసం అయినా..సీపీఆర్ స్కిల్ గురించి తెలుసుకుంటారు. ఎలా చేయాలో ఆన్‌లైన్ సెషన్‌లు లేదా వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి నేర్చుకునే యత్నం చేస్తారంటోందిఈ బ్యూటీ క్వీన్.
ఇక మాగీ ఇంగ్లాండ్‌లోని పాఠశాలల్లో సిపిఆర్ శిక్షణను తప్పనిసరి చేయాలంటూ పోరాటం చేస్తోంది. "గో విత్ సిపిఆర్" అనే నినాదంతో ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తుల రక్షించడం ఎలా అనేదానిపై విద్యార్థులకు అవగామన కల్పిస్తోంది. ఈ నినాదం ఓ రేంజ్‌లో ఊపందుకుంది. ఎంతలా అంటే.. ప్రిన్స్ విలియం సైతం ఆమెకు మద్దతు తెలిపారు.
తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఇన్ ఇండియా పోటీ డైరెక్టర్ ఎంజీ బిస్లీ కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఓ లేఖను కూడా పంపారు. పైగా ఆమె వల్లే తాను ఈ సీపీఆర్ చేయడం నేర్చుకున్నాని అన్నారు. ఆమె ప్రాజెక్టు వైవిధ్యాన్ని తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులకు తెలియజేస్తానన్నారు. ప్రాణాలను రక్షించే ఈ నైపుణ్యం ఎంత గొప్పదో తెలియజేసే.. స్విమ్‌పోటీకి వారంతా ముందుకొచ్చేలా చేస్తానన్నారు.
అంతేగాదు ఈ ఏడాది అందాల పోటీల్లో ఇదే హైలెట్‌గా ఉంటుందని అన్నారు బీస్లీ. చివరగా మాగీ మాట్లాడుతూ.. అందానికి ఒక ప్రయోజనం ఉండాలని చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంతలా అందర్నీ హత్తుకునేలా ఊపందుకోవడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని అంటోందామె.
(చదవండి: Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..)