
2021లో రిలీజై అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇటీవల మరో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్‌కు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సీజన్-2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుసగా రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరో సీజన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్-3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ జూన్ 27న స్క్విడ్ గేమ్-3ని స్ట్రీమింగ్‌కు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. దీంతో ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఇష్టపడే ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..
ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!
జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.
Press ⭕ for the final round.
Watch Squid Game Season 3 on 27 June. #NextOnNetflix pic.twitter.com/SwdBVLB83f— Netflix India (@NetflixIndia) January 30, 2025