
మన దేశంలో చాలామంది సింగర్స్ ఉన్నారు. వాళ్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే గాయకుల లిస్ట్ తీస్తే కచ్చితంగా ఉండే పేరు నేహా కక్కర్. ఇప్పుడు సింగింగ్ షో జడ్జిగా పేరు తెచ్చుకుంది గానీ ఒకప్పుడు పాటలు బాగానే పాడింది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.
(ఇదీ చదవండి: మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్)
నేహా కక్కర్ కు అక్క సోనూ కక్కర్, తమ్ముడు టోనీ కక్కర్ ఉన్నారు. వీళ్లు ముగ్గురు కూడా సింగర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి పాటలు పాడారు. స్టేజీ ఫెర్మార్మెన్స్ లు కూడా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు అక్క సోనూ కక్కర్ షాకింగ్ ట్వీట్ చేసింది.
తాను తమ్ముడు చెల్లి నుంచి విడిపోతున్నానని.. ఇక నుంచి వాళ్లకు తనకు సంబంధం లేదని సోనూ కక్కర్ ట్వీట్ చేసింది. తర్వాత కొన్ని గంటలకే ఈ ట్వీట్ డిలీట్ చేసింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఇదంతా కొత్త ఆల్బమ్ కోసం చేస్తున్న స్టంట్ అని, పీఆర్ స్టంట్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరిగిందనేది కక్కర్ సిస్టర్స్ చెబితే గానీ క్లారిటీ రాదు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
