దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా? | Indian Richest Singer Tulsi Kumar Net Worth Detail | Sakshi
Sakshi News home page

Indian Richest Singer: పాడితే లక్షలు.. ఆదాయం కోట్లు.. ఆస్తి వందల కోట్లు!

Published Tue, Oct 17 2023 5:01 PM | Last Updated on Tue, Oct 17 2023 6:29 PM

Indian Richest Singer Tulsi Kumar Net Worth Detail - Sakshi

మన సినిమాల్లో పాటలు ఎంత ముఖ్యమో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటివల్ల మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఫేమస్ అవుతారు. సంపాదన విషయానికొచ్చేసరికి మాత్రం సింగర్స్‌కి వచ్చేది నామమాత్రమే అని చెప్పొచ్చు. స్టార్ సింగర్స్‌కి తప్పితే మిగతా వాళ్లందరికీ వేలల్లోనే ఇస్తుంటారు. అలాంటిది మన దేశంలోనే రిచెస్ట్ సింగర్ ఒకరున్నారు. ఆమె ఆస్తే వందల కోట్లు ఉంటుందని మీకు తెలుసా?

అవును పైన చెప్పింది కరెక్టే. భారతీయ సినిమాల్లో పాటలు పాడే ఓ లేడీ సింగర్ ఆస్తి అక్షరాలా రూ.200 కోట్లు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే ఈమె మీరనుకున్నట్లు అత్యంత ధనిక సింగర్ శ్రేయా ఘోషల్, నేహా కక్కర్, ఆశా భోంస్లే కాదు తులసి కుమార్. ఈమె ఎవరబ్బా? ఎప్పుడు పేరే వినలేదు అనుకుంటున్నారు కదా! అవును ఎక్కువగా హిందీ పాటలే పాడుతూ బాలీవుడ్ లో ఉండటం వల్ల ఈమె దక్షిణాది సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం లేదు.

(ఇదీ చదవండి: ట్రాక్ తప్పుతున్న రైతుబిడ్డ.. నామినేషన్స్‌లో ఒక్క పాయింట్ తిన్నగా లేదు!)

అయితే ఈమె పాటలు మాత్రం మీరు కచ్చితంగా వినే ఉంటారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌కి ఈమె స్వయానా చెల్లెలు అవుతుంది. 2009లో 'లవ్ హో జాయేగా' ఆల్బమ్‌తో గాయని కెరీర్ ప్రారంభించిన తులసి కుమార్. ఆ తర్వాత అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్,  సల్మాన్ ఖాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో పాడింది. 'ఆషికి 2'లోని హమ్ మర్ జాయేంగే, పియా ఆయేనా లాంటి పాటలతో పాటు బోలెడన్ని సాంగ్స్ ఈమె పాడింది.

ఒక్కో పాటకు రూ.35 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్న తులసి కుమార్.. ఓ సినిమాకు గానూ రూ.80 లక్షలు అందుకుంటోంది. బ్రాండ్స్, లైవ్ షోలు, యాడ్స్ ఇవన్నీ అదనం. అలా ప్రతి ఏడాది ఆదాయంతో పాటు ఆస్తిని పెంచుకుంటున్న తులసి కుమార్‌కి ప్రస్తుతం రూ.200 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె తర్వాత ఎక్కువ ఆస్తి ఉన్న సింగర్స్‌లో స్థానాల్లో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, ఆశా భోంస్లే, నేహా కక్కర్ ఉంటారు.

(ఇదీ చదవండి: జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త చరిత్ర)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement