
రేవంత్ భాషలో మార్పు లేదు
సూర్యాపేటటౌన్ : సీఎం రేవంత్‌రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని, సీఎం అనే సోయి లేకుండా హుజూర్‌నగర్ సభలో దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా.. కేసీఆర్ మాట లేకుండా సీఎం సభ సాగట్లేదన్నారు. సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు ఓటేశారు తప్ప రేవంత్‌రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ఎలాంటి స్పందన లేదన్నారు. మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని, పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. కడుపుమండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి, రేవంత్‌కు శాపనార్ధాలు పెడుతున్నారని అన్నారు. హుజూర్‌నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శించారన్నారు. సీఎం పద్ధతి, భాష మార్చుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని.. ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు చేయలేదని, అసలు కొనుగోలు చేస్తారా లేదా తెలియదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయిలేదన్నారు.
ఫ హుజూర్‌నగర్ సభలో అజ్ఞానాన్ని ప్రదర్శించారు
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శ