
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ టూటౌన్ : బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం నల్లగొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో బీజేపీ జెండాను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తుందన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, పోతెపాక లింగస్వామి, లోకనబోయిన రమణ, పకీరు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతాం
నల్లగొండ టౌన్ : కష్టజీవులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడతానని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో ఆయనతో కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో పాలు పంచుకుంటున్న మిత్రులు, ఎమ్మెల్సీ సత్యంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో పార్టీ సభ్యులు, మిత్రులు అందించిన సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కుంభం కృష్ణారెడ్డి, కట్టా వెంకట్‌రెడ్డి, గుర్రం వెంకట్‌రెడ్డి, కందుల భిక్షం, నర్సింహాచారి, ప్రద్యుమ్నారెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, బరిగెల నగేష్, లింగారెడ్డి, నర్సింహ, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, పబ్బు వీరస్వామి పాల్గొన్నారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం