
‘భూ భారతి’తో రైతులకు ఎంతోమేలు
నకిరేకల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం.. తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేయనుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతి చట్టంపై నకిరేకల్‌లోని సాయి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సుకుక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆమె హాజరై మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రైతులకు భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే సవరించే అవకాశంతోపాటు అప్పీల్ పద్ధతి ఉందని ఈ చట్టంలో ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ అవుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములకు రక్షణ కవచంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టంతో భూముల రికార్డుల నిర్వహణ బాధ్యత, భద్రత రెవెన్యూ శాఖ తీసుకుందన్నారు. తహసీల్దార్ జమీరుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ యానాల అశోక్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ దూలం సోములు, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వేంకటేశ్వరరావు, ఏఓ జానిమియా, ఎంఈఓ మేకల నాగయ్య, ఆర్‌ఐలు చిరంజీవి, బోళ్ల శ్యాంసుందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, కౌన్సిలర్లు గాజుల సుకన్య, కందాల భిక్షంరెడ్డి, పోతుల సునతీరవి, గర్శకోటి సైదులు, యాసారపు లక్ష్మీవెంకన్న, పన్నాల పావనిశ్రీనివాస్‌రెడ్డి, గడ్డం స్వామి, చౌగోని అఖిల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ ఎమ్మెల్యే వీరేశంతో కలిసి నకిరేకల్, చిట్యాలలో సదస్సులకు హాజరు

‘భూ భారతి’తో రైతులకు ఎంతోమేలు