
జేడీయూ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
రామనగర: కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కొడుకు, జేడీయూ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిఖిల్‌ను దేవెగౌడ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రామనగర స్థానం నుంచి నిలబెట్టనున్నట్లు జేడీయూ అధిష్టానం ప్రకటించింది.
వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు అభ్యరి్థని ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీగా జేడీయూ నిలిచింది. కుమారస్వామి భార్య అనిత ప్రస్తుతం రామనగర ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇదీ చదవండి: మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ