
సాక్షి, చెన్నై: హైదరాబాద్‌లో వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణపై ఎన్‌జీటీ చెన్నై బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. నాలాలు, చెరువుల దూరాక్రమణల విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చెయాలని తాము చెప్పలేమని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో భారీ వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణకు సంబంధించి జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆక్రమణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కిర్లాస్కర్ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే కమిటీ ప్రతిపాదనలు అమలు కావడం లేదని ఎన్జీటీకి విన్నవించారు. ఈ విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి తాము చెప్పలేమని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. దాంతో పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. (చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్‌జీటీ షాక్)