
వయనాడ్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కోజికోడ్ జిల్లాలోని ముక్కమ్‌లో మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నాయి.
కరూలై, వాందూర్, ఎడవాన్నా పట్టణాల్లోనూ ప్రజలను ప్రియాంక, రాహుల్ కలుసుకుంటారని తెలిపాయి. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ హోదాలో తొలిసారిగా వయనాడ్లో పర్యటించబోతున్నారు. తనను గెలిపించినందుకు గాను నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.