
హిందువులపై దాడులు తిప్పికొట్టాలి
భైంసాటౌన్: హిందువులపై దాడులను ఐకమత్యంతో తిప్పికొట్టాలని వీహెచ్‌పీ మాతృశక్తి సంయోజక్ పద్మశ్రీ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఫులేనగర్ శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో అభ్యాస వర్గ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందువులంతా ఐక్యంగా ఉంటేనే ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఇందుకుగాను ప్రతిరోజూ మందిరకేంద్రంగా సత్సంగ్ నిర్వహించుకోవాలని, తద్వారా హిందూసమాజం జాగృతం కావాలని సూచించారు. కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, ప్రాంత మాతృశక్తి సహ సంయోజక్ శ్రీవాణి, జిల్లా అధ్యక్షుడు జాదవ్ విఠల్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, కార్యదర్శి మూర్తి ప్రభు, సహ కార్యదర్శి నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.