
లండన్, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలపై టీడీపీ సాగిస్తున్న అరాచకాలను వైఎస్సార్‌సీపీ యూకే కమిటీ ఖండించింది. ఇలా హత్యా రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారని చంద్రబాబుపై పార్టీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపోటములు సహజమని.. రాష్ట్ర ప్రజలందరినీ సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హితవు పలికారు.
ఏపీలో టీడీపీ అరాచక పాలనను ఖండిస్తూ ఆదివారం లండన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో గెలిచిన పార్టీ నాయకులు.. ఓడిన పార్టీ వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడమేంటి? వీటిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి ఏ మాత్రం ఆమోదనీయం కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏపీలో శాంతిభద్రతలు నెలకొల్పాలి. దాడులు చేస్తున్న వారిని జైలుకు పంపాలి..
ఏపీలో జరుగుతున్న ఆటవిక పాలనపై లండన్‌లో ప్రవాసాంధ్రులు నిరసన
టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాల నుంచి ప్రజలను రక్షించాలని అక్కడ గాంధీజీ విగ్రహం వద్ద ఆందోళనలు
ఏపీలో హింసను ఆపాలని డిమాండ్#SaveAPFromTDP pic.twitter.com/hPpZuRxzHP— YSR Congress Party (@YSRCParty) July 28, 2024
.. ప్రజాస్వామ్యం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రవాసాంధ్రులంతా ఏకమై వైఎస్ జగన్‌కు తోడుగా నిలవాలని నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం హింసాకాండను ఆపకపోతే ప్రపంచం మొత్తానికి ఏపీలో జరుగుతున్న దురాగతాలను తెలియజేస్తాం’ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఓబుల్‌రెడ్డి పాతకోట, మలిరెడ్డి కిశోర్‌రెడ్డి, అనంత్ పరదేశి, సురేందర్ అలవల, వీరా పులపకూర, సుమన్ కోడూరు, పాలెం క్రాంతి కుమార్ రెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, వెంకట్, సాయితేజ, చలపతి గుర్రం, సాయికృష్ణ, ప్రణయ్ ధీరజ్, నరేందర్, నవీన్ దొడ్డ, కరుణాకర్ రెడ్డి మొండెద్దు, వినయ్ కంభంపాటి, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
