NRI
-
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
కెనడాలో ఓ భారతీయ విద్యార్థి(Indian Student)ని అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న టైంలో ఎక్కడి నుంచో ఆమెపైకి ఓ తూటా దూసుకొచ్చి ఛాతిలో దిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన భారతీయ కాన్సులేట్ జనరల్.. ఎక్స్ ద్వారా వివరాలు తెలియజేసింది.హోమిల్టన్లోని మోహాక్ కాలేజీలో చదువుతున్న హర్సిమ్రత్ రంధవా(21).. బుధవారం సాయంత్రం 7.30గం. ప్రాంతంలో బస్టాప్‌లో వేచి ఉంది. ఆ సమయంలో అక్కడికి కాస్త దూరంలో రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఉన్నట్లుండి వాటిల్లో ఉన్న వ్యక్తులు తుపాకులతో పరస్పరం కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ తుటా హర్సిమ్రత్ రంధవా(Harsimrat Randhawa) శరీరంలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే.. We are deeply saddened by the tragic death of Indian student Harsimrat Randhawa in Hamilton, Ontario. As per local police, she was an innocent victim, fatally struck by a stray bullet during a shooting incident involving two vehicles. A homicide investigation is currently…— IndiainToronto (@IndiainToronto) April 18, 2025ఛాతీలో బుల్లెట్ దిగడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆస్పత్రికి తరలించేలోపే ఆమె కన్నుమూసిందని వైద్యులు వెల్లడించారు. కాల్పుల సమయంలో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం జరగలేదని హామిల్టన్ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వివరాలు సేకరించిన అధికారులు.. దర్యాప్తునకు సహకరించాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు. -
దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు. -
భారత సంతతి వైద్యురాలు ముంతాజ్ పటేల్‌కి అరుదైన గౌరవం
లండన్: ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్సీపీ) 124వ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. యూకే వైద్య నిపుణుల సంఘంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులుగా పేరున్న 40 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు.ఇక, ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌లో డాక్టర్ పటేల్ జన్మించారు. ఈమె తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు. మాంచెస్టర్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా డాక్టర్ ముంతాజ్ పనిచేస్తున్నారు. ఆర్సీపీకు మొట్టమొదటి ఇండో–ఆసియన్ ముస్లిం ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. 16వ శతాబ్దంలో ఆర్సీపీ ఏర్పాటయ్యాక ఐదో మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ పటేల్ నిలిచారు. సోమవారం ముగిసిన ఎన్నికలో డాక్టర్ ముంతాజ్ గెలుపొందారు. నాలుగేళ్ల పదవీకాలం ప్రారంభం ఖరారు కావాల్సి ఉంది. ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్(ఎడ్యుకేషన్–ట్రెయినింగ్)గా, తాత్కాలిక ప్రెసిడెంట్‌గా 2024 జూన్ నుంచి కొనసాగుతున్నారు. ఆర్సీపీ ప్రెసిడెంట్‌గా కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలుగా ఉంటారు. -
సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది. -
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది. -
పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
చంపేస్తా.. దిక్కున్న చోట చెప్పుకోండి..!
రైల్వేకోడూరు అర్బన్/ఓబులవారిపల్లె: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ ఒక జనసేన నాయకుడు ఎన్ఆర్ఐ దంపతులపై దాడి చేసిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, చెన్నరాజుపోటులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, బుధవారం రాత్రి గ్రామంలో శ్రీ సీతారాముల గ్రామోత్సవాన్ని నిర్వహించారు.ఒంటిగంట సమయంలో దేవుడి ఊరేగింపు ఎన్నారై పత్తి సుబ్బరాయుడు ఇంటి వద్దకు చేరుకుంది.ఆరోజే కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన, భార్య రాజేశ్వరితో కలిసి బయటకు వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటుండగా, మాజీ సర్పంచ్, జనసేన పార్టీ రాయలసీమ జోనల్ కన్వీనర్ జోగినేని చిన్నమణి ఇనుపరాడ్‌తో ఇరువురిపై దాడిచేసి, చంపేస్తానంటూ బెదిరించాడు.డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్, జిల్లా ఎస్పీ అందరూ తెలిసిన వారేనని పేర్కొంటూ, మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ వెళ్లిపోయాడు. బాధిత దంపతులు రైల్వేకోడూరు సీఐ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ, గతంలో గ్రామంలో పొలాల వద్ద చిన్నమణికి తమకు విభేదాలు ఉన్నాయని, అవి మనసులో పెట్టుకొని తమపై కక్షపెట్టుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని అన్నారు. దీనిపై సీఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు. -
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
వాషింగ్టన్: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్‌తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్‌చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్‌కు చేరుకున్నాక ‘ఎక్స్’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్‌చేశారు.పవర్ బ్యాంక్‌పై అనుమానంతో.. ‘‘ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు నా హ్యాండ్‌బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్ పవర్‌బ్యాంక్ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్‌కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు. నా ఖరీదైన లగేజీ బ్యాగ్‌ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్‌కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పోస్ట్‌ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. ‘ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్‌పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025 -
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
ఢిల్లీ: అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా((తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)) పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిటబుల్ డొనేషన్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. విరాళాలిచ్చినట్లు పత్రాలు సృష్టించి...దానికి సమానమైన నిధులను కంపెనీ నుంచి కాజేశరని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. -
న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు) -
హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
ఎవర్ని వదిలిపెట్టం..మా స్థలాలు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు
-
కెనడాలో భారతీయుడి దారుణ హత్య
ఒట్టావా: కెనడాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు దుండగులు కత్తితో పొడిచి భారతీయుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారతీయుడి హత్యపై విచారణ వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. కెనడా రాజధాని ఒట్టావా సమీపంలోని రాక్లాండ్లో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. కత్తితో పొడిచి అతడిని హత్య చేశారు. ఈ ఘటనపై కెనడాలో భారత రాయబార కార్యాలయం స్పందించింది. హత్య ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కెనడా పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ఇక, ఈ ఘటనలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. We are deeply saddened by the tragic death of an Indian national in Rockland near Ottawa, due to stabbing. Police has stated a suspect has been taken into custody. We are in close contact through a local community association to provide all possible assistance to the bereaved…— India in Canada (@HCI_Ottawa) April 5, 2025 -
రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు. -
డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు. -
30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India- -
నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్‌తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. -
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్‌లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
ఏపీ మరో బిహార్‌లా..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: మీరు విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులా.. అయితే, ఖచ్చితంగా మీ భూములకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ భూములు భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. ఎందుకంటే.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ఆర్ఐలకు చెందిన రూ.కోట్లు విలువైన స్థలాలను యథేచ్ఛగా కబ్జాచేసే ముఠాల ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రత్యేకించి పోలీసులతో కుమ్మక్కయి మరీ ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈ విషయంలో ఒక ఎన్ఆర్ఐ పడుతున్న ఆవేదన ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది. ఏపీ మరో బిహార్‌లా మారిందంటూ తిరుపతికి చెందిన ఎన్ఆర్ఐ బొర్రా రాజేంద్రప్రసాద్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. అందులో ఆయన ఏమన్నారంటే..ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో తిరుచానూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 298/4లో 120 అంకణాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు కొందరు దానిని కబ్జాచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నిజానికి.. కిందటేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన ఎన్ఆర్ఐ విభాగం తరఫున ఆస్ట్రేలియాలో చురుగ్గా పనిచేశాను. మా నాన్న బొర్రా వెంకటరమణ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా రిటైరయ్యారు. ఆయన కూడా జనసేన నుంచి తిరుపతికి పోటీచేసిన ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి నుంచి పోటీచేసిన పులివర్తి నానిల గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. కూటమి ప్రభుత్వం కోసం కష్టపడినందుకు ఇదేనా మాకు దక్కుతున్న న్యాయం? మా నాన్న నాలుగుసార్లు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో, తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదుచేస్తే పట్టించుకోలేదు. ఏపీ మరో బిహార్‌లా తయారైంది. నాలాంటి ఎన్ఆర్ఐలు చాలామంది బాధితులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు ఎన్నడూ జరగలేదు. నిజానికి.. ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. ఈ సమస్యను ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందనలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం కోసం కష్టపడ్డా.. కానీ ఇప్పుడు సిగ్గేస్తోంది. ఇదిలా ఉంటే.. తిరుచానూరు పరిసరాల్లో ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలను ఎంచుకుని కబ్జా రాయుళ్లు వాటిల్లోకి వాలిపోతున్నారని.. వీరికి పోలీసుల సహకారం ఉండటంతో ఎన్ఆర్ఐలు ఏమీ చేయలేకపోతున్నారని బొర్రా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. చివరికి.. తమ స్థలం విషయంలో పోలీసులు ప్రత్యర్థులతో సెటిల్ చేసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారని మండిపడ్డారు. -
ఎన్ఆన్ఐలకు చెందిన స్థలాలపై కబ్జారాయుళ్ల దృష్టి
-
ఎన్ఆర్ఐల భూములపై పాగా.. రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు
సాక్షి, తిరుపతి: తిరుచానూరులో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలపై కబ్జా రాయుళ్ల కన్నుపడింది. తిరుచానూరులో కోట్ల విలువైన భూములపై పాగా వేశారు. సెటిల్మెంట్ చేసుకొని పక్షంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏపీ లో బీహార్ రాష్ట్ర తరహా ఘోరాలు జరుగుతున్నాయంటూ ఎన్ఆర్ఐ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తిరుచానూరులో కోట్లు విలువ చేసే తన భూమిని కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. తన తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండ్‌గా పనిచేసిన వ్యక్తి అని.. ఆయన నాలుగు సార్లు ఎస్పీని కలిసిన తిరుచానూరు సీఐ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎన్ఆర్టీ ద్వారా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసు నమోదు చేశారన్నారు.ఏపీలో మరో బీహర్ తరహా దోపిడీ ఘోరాలు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఎన్ఆర్ఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రవాస ఆంధ్రుల భూములకు రక్షణ కరువైందన్నారు. ఎన్నికలు సమయంలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసినందుకు బాధపడుతున్నామని ఆయన చెప్పారు. -
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
తెర్లాం(విజయనగరం): అమెరికా మెచ్చిన అందం మన తెర్లాం మండలం సోమిదవలసకు చెందిన యువతి చందక సాయిసాత్విక(Sai Satwika) సొంతం. ఓ వైపు చదువు.. మరోవైపు అందంతో అందరినీ ఆకర్షిస్తోంది. ఎమ్మెస్సీ చదువుకోసం అమెరికా(Dallas) వెళ్లిన యువతి డల్లాస్‌లో తెలుగు అసోసియేషన్(Telugu Association) ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘మిస్ యూఎస్ఏ–2025’ పోటీల్లో తలపడి తుదిపోటీలకు ఎంపిక కావడం తెర్లాం మండలం సోమిదవలస వాసుల్లో ఆనందం నింపింది. మే 25న జరగనున్న ఫైనల్ పోటీల్లో తలపడనుంది. తను విజయం సాధించడానికి భారతీయులంతా తనకు ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తిచేస్తోంది. సాయిసాత్విక తండ్రి చందక సూర్యకుమార్ మెకానికల్ ఇంజినీరు కాగా, తల్లి సబిత రేషన్ డీలర్. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాజాంలోని సెంట్ఆన్స్ పాఠశాలలో, బీఎస్సీ అగ్రికల్చర్ బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో చదువుకుంది. డేటా ఎనలైటికల్ కోర్సులో ఎమ్మెస్సీ చదవడం కోసం అమెరికా వెళ్లింది. అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్ట్రిన్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న అక్క సాయిసుస్మిత, బావ వద్ద ఉంటూ మిస్ తెలుగు యుఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 300 మంది తెలుగు అమ్మాయిలు పాల్గొన్న పోటీల్లో ఫైనల్‌కు చేరుకుంది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కావాలన్నది సాయిసాత్విక కోరికని, చిన్నతనం నుంచి వ్యాసరచన పోటీల్లో తలపడి బహుమతులు గెలుచుకుందని తల్లి సబిత తెలిపారు. అమెరికా తెలుగు అమ్మాయిల పోటీల్లో కుమార్తె విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ ఓటుతో మద్దతు తెలపాలని కోరారు. -
డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి -
గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు -
అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
అమెరికాలో దారుణం.. కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రీకూతురు మృతి
వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వర్జీనియాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రీ, కూతురు చనిపోయారు. వీరిని గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్, ఉర్మిగా గుర్తించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ (44)ను వర్జీనియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ప్రదీప్ పటేల్, ఆయన కూతురు ఉర్మి.. గురువారం రోజున వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్మెంటల్ స్టోర్‌కి వెళ్లారు. వారు స్టోర్‌లో ఉన్న సమయంలో నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ అక్కడికి వెళ్లాడు. తనకు మందు కావాలని అడగడంతో స్టోర్ సిబ్బందికి, అతడికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, స్టోర్‌లో ఉన్న వర్కర్లపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పలు జరిపాడు. కాల్పుల్లో ప్రదీప్ కుమార్, ఉర్మి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రదీప్ కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. ఉర్మి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, కాల్పులు జరిపిన ఫ్రేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని మెహసనా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్.. తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువులకు చెందిన డిపార్ట్మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. మృతుడు ప్రదీప్ కుమార్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ప్రదీప్, ఉర్మి మృతితో కుటుంట సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.🚨 Gujarati father, daughter shot dead in US store in Virginia.Pradeep Patel, 56, was shot dead on the spot, while his 24-year-old daughter, Urmi, succumbed to her injuries two days later. pic.twitter.com/RtU2VYqAmv— The Tradesman (@The_Tradesman1) March 23, 2025 -
సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్!
భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరేబియన్ దేశానికి విహారయాత్ర కోసం వెళ్లి, కనిపించ కుండా పోయిన సుదీక్ష ఆచూకీ ఇంకా మిస్టరీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తప్పిపోయిన తమ కుమార్తె సుదీక్ష చనిపోయినట్లు ప్రకటించమని కోరినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోది. ఈ మేరకు సుదీక్ష కుటుంబం డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసులకు లేఖ రాసింది.అమెరికాలో శాశ్వత నివాసి వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష చివరిసారిగా మార్చి 6న పుంటా కానా పట్టణంలోని రియు రిపబ్లిక్ రిసార్ట్‌లో కనిపించింది. మెడిసన్ చదవాలని కలలు కన్న ఆమె, వెకేషన్లో భాగంగా ఐదుగురు స్నేహితులతో కలిసి డొమినికా రిపబ్లిక్ దేశానికి వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్‌కు వెళ్లిపోయారు. కానీ సుదీక్ష ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికినా, ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినా ఆమె ఆచూకీ లభించలేదు. View this post on Instagram A post shared by De Último Minuto (@deultimominutomedia)మరోవైపు తమ కుమార్తె అదృశ్యమై 12 రోజులు కావొస్తున్నా ఎలాంటి ఆచూకీ లభ్యం కాని నేపథ్యంలో ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసు ప్రతినిధి డియాగో పెస్క్వేరా మాటలను ఉటంకిస్తూ NBC న్యూస్ మంగళవారం నివేదించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ‘సుదీక్ష కోణంకి అదృశ్యం విషాదకరం, ఆమె కుటుంబం అనుభవిస్తున్న దుఃఖాన్ని ఊహించలేం.. సుదీక్ష మునిగిపోయి ఉంటుందనే అభిప్రాయాన్ని ఆమె ఫ్యామిలీ వ్యక్తం చేసింది. అటువంటి ప్రకటన చేయాలనే తుది నిర్ణయం డొమినికన్ రిపబ్లిక్ అధికారులదే అయినప్పటికీ, తాము బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని’ అధికారులు ప్రకటించారు. ఇది మిస్సింగ్ కేసు తప్ప, క్రిమినల్ విషయం కాదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే ఆమె మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్నిచట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. సుదీక్ష అదృశ్యంలో ఎవరినీ అనుమానితులుగా పరిగణించలేదని డొమినికన్ రిపబ్లిక్ అధికారులు తెలిపారు.కాగా సుదీక్ష ఆచూకో కోసం అక్కడి పోలీసులు అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో గాలించారు. కిడ్నాప్‌కు గురైందేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఈక్రమంలోనే బీచ్ వద్ద ఆమె బట్టలు, చెప్పులు దొరకాయి. వాటిని సుదీక్ష స్నేహితులు గుర్తించారు కూడ . సుదీక్షతో కలిసిచివరిసారి కనిపించిన 24 ఏళ్ల జాషువా స్టీవెన్ రిబెత్ అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే మార్చి 6వ తేదీ రోజు తామిద్దరం కలిసే బీచ్‌కు వెళ్లామని,సుదీక్షతో పాటు తాను కూడా ఉన్నట్లు రిబె అంగీకరించాడు. ఒక పెద్ద అల వారిని బలంగా తాకిందని, దాంతో తాను స్పృహ తప్పి పడిపోయానని, అలల తాకిడికి గురైన ఆమెను రక్షించలేక పోయానన్నరిబె మాటలను విశ్వసింఇన పోలీసులు అతనిపై ఎలాంటి ఆరోపణలు నమోదు చేయలేదు. కానీ అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్ కో
అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్ అండ్ కోదివి నుంచి భూమికి సేఫ్‌గా అడుగు పెట్టిన సునీతా విలియమ్స్ఫ్లోరిడా తీరం సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకఅత్యంత ఉత్కంటగా సాగిన చివరి 7 నిమిషాలుఈ రోజు ఉ.3.27 గంటలకు భూమికి చేరిన సునీతాక్రూ డ్రాగన్ వ్యోమనౌక దగ్గరకు వచ్చిన నాసా శాస్త్రవేత్తలుక్రూ డ్రాగన్ సేఫ్ ల్యాండిగ్తో నాసా శాస్త్రవేత్తల సంబరాలుల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారుఅక్కడే వారికి కొన్ని రోజులు పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులుసుదీర్గకాలం స్పేస్‌లో ఉండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలుఆరోగ్య సమస్యలను ఎప్పటకప్పుడు పరీక్షించనున్న వైద్యులుదీంతో తన మూడో అంతరిక్ష యాత్రను సైతం విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్గతంలో 2006,2012లలో రెండు సార్లు అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్ Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu— NASA (@NASA) March 18, 2025కాసేపట్లో భూమి మీదకు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్ రాక.సునీతా విలియమ్స్ కోసం వేచి చూస్తున్న యావత్ ప్రపంచం17 గంటల ప్రయాణం తరువాత భూమిపైకి చేరుకోనున్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకభూమి మీదకు చేరగానే వ్యోమగాములకు వైద్య పరీక్షలు8 రోజుల మిషన్.. 9 నెలల హైటెన్షన్ అనుక్షణం ఒక అద్భుతం.. ప్రతీ క్షణం ప్రమాదంతో సహవాసం నిజానికవి 9 నెలలు కాదు..ఒక్కో క్షణం ఒక్కో యుగం అంతులేని ఒత్తిడిలోనూ అంతరిక్షాన్ని జయించిన సునీత.. ధీర వనిత అనుక్షణం ఒక అద్భుతం..👉మరికొద్ది గంటల్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్ రాకలైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసాభారత కాలమానం ప్రకారం.. 2.15గం. ప్రారంభం కానున్న లైవ్నాసా క్రూ 9 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్(ISS)కు వెళ్లిన సునీత, విల్మోర్290 రోజులపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన ఇరువురు నాసా వ్యోమగాములుభూమి యొక్క ఉపరితలం నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మహిళ(59 వ్యోమగామిగా సునీతా విలియమ్స్ రికార్డు సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు!సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లతో పాటు భూమ్మీదకు రానున్న నిక్ హేగ్(నాసా), అలెగ్జాండర్ గుర్బునోవ్(రష్యా వ్యోమగామి)క్రూ-9లో భాగంగా కిందటి ఏడాది సెప్టెంబర్‌లో అక్కడికి వెళ్లిన హేగ్, గుర్బునోవ్సునీత, బచ్‌ల కోసం కావాల్సినవి అందించడంతో పాటు వాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేసిన ఈ ఇద్దరు స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ రానున్న మొత్తం నలుగురుకిందటి ఏడాది జూన్‌లో.. మానవ సహిత బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్న ఇద్దరు స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చిక్కుకుపోయిన ఇద్దరు ఇదీ చదవండి: అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..ఇండియన్ డాటర్‌కు స్వాగతంభారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్సునీత సాహసయాత్రపై భారత్‌లో అభినందనల వెల్లువత్వరలో భారత్‌కు రావాలంటూ లేఖ రాసిన ప్రధాని మోదీ క్షేమంగా రావాలంటూ గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో పూజలు, యాగాలు 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి క్రూ డ్రాగన్ వ్యోమనౌక తిరుగు పయనం ఇలా.. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత: మంగళవారం ఉదయం 8.15కు మొదలుఅంతరిక్ష కేంద్రం నుంచి విడిపోవడం: ఉదయం 10.15 గంటలకు ప్రారంభం. భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ఆన్: బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు. సాగర జలాల్లో ల్యాండింగ్: తెల్లవారుజామున 3.27 గంటలకు.సహాయ బృందాలు రంగంలోకి దిగి.. స్పేస్ఎక్స్ క్యాపూల్స్ క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్షయాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు.ఇదీ చదవండి: Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్.. ఆమె జీతం ఎంతో తెలుసా ? -
తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది. జులై4,5,6 తేదీల్లో టంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలను జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడుకి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానంఅమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరుతూ నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాట్స్ బృందం కలిసింది. అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తమ ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.ముఖ్యమంత్రులను కలిసిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు
ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర యూనివర్సీటీ పూర్వ విద్యార్థి తాళ్లూరి పూర్ణ చంద్రరావుల ఆర్ధిక సహకారంతో మంచాలను విరాళంగా ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సీటీలో కొత్తగా నిర్మించిన విశ్వేశ్వరయ్య వసతి గృహానికి కూడా ఆర్థిక చేయూతను అందించారు. మరిన్ని NRI వార్తలకోం ఇక్కడ క్లిక్ చేయండి!విద్యార్ధులకు నిద్రకు ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో తయారుచేసిన 432 మంచాలను తయారు చేయించి ఏయూ హాస్టల్‌కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ బోర్డు మాజీ ఈసీ సభ్యులు, శ్రీనివాస్ బొల్లు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ అరసడ,నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, గ్లో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించింది. హైదరాబాద్‌లో తొలుత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును కలిసి నాట్స్ 8 వ అమెరికా తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.నాట్స్ సంబరాలకు ముఖ్య అతిధిగా రాఘవేంద్రరావును కోరింది. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్‌ను కలిసి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ని కూడా నాట్స్ బృందం కలిసి సంబరాలకు ఆహ్వానించింది. జూలై 4, 5, 6 తేదీల్లో టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని కోరింది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ను కూడా నాట్స్ బృందం కలిసింది. నాట్స్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా థమన్ కూడా గుర్తు చేసుకున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు థమన్ తప్పనిసరిగా రావాలని నాట్స్ ఆహ్వానించింది.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!సినీ దర్శకులు హరీశ్ శంకర్, మోహర్ రమేశ్‌లను కూడా కలిసి నాట్స్ ఆహ్వాన పత్రికలు అందించింది. సినీ ప్రముఖుల ఆహ్వానాలు అందించే కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు తదితరులు పాల్గొన్నారు. -
పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది. -
Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు. -
ప్రవాస భారతీయ కుటుంబంలో విషాదం
తెనాలి: అమెరికా నార్త్ కెరోలినాలో తుపాను కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దీంతో తెనాలి అయితానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తెనాలికి చెందిన బిషప్ గడ్డం థామస్ కుమార్తె షారోన్ నథానియేల్‌కు, అమెరికాకు చెందిన నథానియేల్ లివిస్కాతో 2007లో వివాహమైంది. వారు అమెరికాలోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో సంభవించిన తుపానుకు భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడింది. ప్రమాదంలో ఇల్లు పాక్షికంగా కూలడంతో బెడ్రూమ్లో నిద్రిస్తున్న షారోన్ కుమారులు సాధు జోషయ్య(13), జాషువా అషె్వల్(11) ప్రాణాలు విడిచారు. సమాచారం తెలియగానే షారోన్ తల్లి మేరీగ్రేస్, సోదరుడు సాధు థామస్ అమెరికాకు పయనమయ్యారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి
కొందుర్గు/ సిద్దిపేట అర్బన్: అమెరికాలోని ఫ్లోరిడా లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృత్యు వాత పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను పురుమాండ్ల సునీత (56), ఆమె కోడలు ప్రగతిరెడ్డి (35), మనవడు హర్వీన్‌రెడ్డి (6)గా గుర్తించారు. బాధిత కుటుంబానికి చెందినవారు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల దుర్గా రెడ్డి, భార్య సునీతతో కలిసి 40 సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఉగాండాలో ఉంటున్నారు. వీరి కుమారుడు రోహిత్‌రెడ్డి వివా హం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకుల పల్లి గ్రామానికి చెందిన పవిత్ర, మోహన్‌రెడ్డి దంపతుల కుమార్తె ప్రగతి రెడ్డితో జరిగింది. రోహి త్, ప్రగతి ఫ్లోరిడాలోని హర్లాండోలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తు న్నారు. వీరికి హర్వీన్ (6)తో పాటు 8 నెలల వయస్సు గల మరో కుమారుడు ఉన్నారు. భార్య సునీతతో కలిసి ఇటీవల ఫ్లోరిడా వచ్చిన దుర్గారెడ్డి తిరిగి ఉగాండా వెళ్లిపోగా సునీత అక్కడే ఉండిపోయారు. కాగా ప్రగతిరెడ్డి అక్క ప్రియాంక రెడ్డి కూడా భర్త నవీన్‌రెడ్డి, కుమారుడు, కుమార్తెతో కలిసి ఫ్లోరిడాలోనే జాక్సన్ విల్లేలో ఉంటున్నారు. రెండు నగరాల మధ్య దూరం సుమారు 200 కి.మీ కాగా వారాంతంలో రెండు కుటుంబాలు కలిసి రెండు కార్లలో టూర్‌కు వెళ్లాయి. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా..రోహిత్‌రెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రగతిరెడ్డి, హర్వీన్, సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోహిత్, బాబు మాత్రం ప్రమాదం నుంచి బయట పడ్డారని, అయితే బాలుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాగా మృతుల అంత్యక్రియలు ఫ్లోరిడాలోనే నిర్వహించనున్నట్లు తెలిసింది. సిద్దిపేటలో నివాసం ఉంటున్న దుర్గారెడ్డి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు హుటాహుటిన అమెరికాకు ప్రయాణమయ్యారు.10 నిమిషాల ముందే ఆ కారెక్కిన హర్వీన్హర్వీన్ తిరుగు ప్రయాణంలో తొలుత తమ పెద్దమ్మ వాళ్ల కారు ఎక్కాడు. ప్రమాదం జరగడానికి పది నిమిషాల ముందే అమ్మానాన్న ప్రయాణిస్తున్న కారులోకి వచ్చాడని, అంతలోనే దుర్ఘటన చోటు చేసుకుందని తెలిసింది. ప్రమాద వార్త తెలియడంతో ఇటు టేకులపల్లిలో, అటు బక్రిచెప్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మూడు రోజుల క్రితమే మాట్లాడింది..తన కూతురు మూడురోజుల క్రితమే ఫోన్లో మాట్లాడిందని, ఇంతలోనే మృత్యు ఒడికి చేరిందంటూ ప్రగతి తల్లి పవిత్ర విలపించారు. అమెరికా వెళ్లిన తాము గత డిసెంబర్ 3న తిరిగి వచ్చామని, తాము వచ్చే ముందే చిన్నబాబును చూసుకోవడానికి సునీత అమెరికా వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు ప్రగతిరెడ్డి తల్లిదండ్రులను పరామర్శించారు. -
కెనడా కొత్త కేబినెట్లో ఇద్దరు భారతీయులు
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలు ఇకపై కెనడా మంత్రులుగా కొనసాగారు. కెనడా పార్లమెంట్‌కు ఎన్నికైన అతి పిన్న వయస్సులైన మహిళల్లో కమల్ ఖేరా సైతం ఉన్నారు. 58 ఏళ్ల అనితా ఆనంద్‌కు ఆవిష్కరణలు, శాస్త్ర, వాణిజ్య శాఖలకు మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. 36 ఏళ్ల కమల్ ఖేరాను ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.కాగా, ఢిల్లీలో పాఠశాల విద్యనభ్యసిస్తున్న కాలంలో కమల్ కుటుంబం కెనడాకు తరలిపోయారు. టొరంటోలో యార్క్ వర్సిటీలో కమల్ సైన్స్ డిగ్రీ సాధించారు. నర్సుగా, కమ్యూనిటీ వలంటీర్‌గా, రాజకీయ కార్యకర్తగా మొదలెట్టి చివరకు మంత్రిస్థాయికి కమల్ ఎదిగారు. నోవా స్కాటియాలో పుట్టిన అనిత 1985లో ఒంటారియోకు వలసవచ్చారు. లాయర్, పరిశోధకురాలు, అధ్యాపకురాలు అయిన అనిత 2019లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. గతంలో ట్రెజరీ బోర్డ్ అధ్యక్షురాలిగా, రక్షణ మంత్రిగా, ప్రజాసేవలు, సేకరణ మంత్రిగా సేవలందించారు. Diversity in leadership! Indo-Canadian Anita Anand and Delhi-born Kamal Khera have joined Canadian Prime Minister Mark Carney's cabinet. It is a proud moment for representation and inclusion in Canadian politics. 🇨🇦 #Canada #Cabinet #AnitaAnand #KamalKhera #MarkCarney pic.twitter.com/PU3KOU0WaW— Dr. Prosenjit Nath (@prosenjitnth) March 15, 2025 -
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు కాస్తా గురి తప్పి బెడిసికొట్టాయి. మిషిగాన్‌లో ఒక కార్యక్రమానికి ఆయన భార్యాసమేతంగా హాజరయ్యారు. తన భార్య అమెరికా సెకండ్ లేడీగా గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తోందంటూ పొగడ్తలు కురిపించారు. పనిలో పనిగా..‘అయితే ఒక్కటి మాత్రం నిజం. నేనెంత అర్థంపర్థం లేని మాటలు మాట్లాడినా ఆమె నవ్వాల్సిందే పాపం! ఎందుకంటే చుట్టూ కెమెరాలుంటాయి! నవ్వుతూ నాతో శ్రుతి కలపాలి. మరో దారి లేదు’ అంటూ చెణుకులు విసిరారు.అయితే, ఆయన కామెంట్లు విమర్శలకు దారితీశాయి. తనకు సెన్సాఫ్ హ్యూమర్ అస్సలు లేదని వాన్స్ మరోసారి నిరూపించుకున్నారంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. చౌకబారు వ్యాఖ్యలతో భార్యను చీర్‌లీడర్‌గా చిత్రించారంటూ తూర్పారబడుతున్నారు. హాస్యం అనుకుని వాన్స్ చేసే కామెంట్లు ఎప్పుడూ ఇలాగే గురి తప్పుతూ ఉంటాయంటూ ఎద్దేవా చేశారు.Vance: Here's the thing. The cameras are all on; anything I say, no matter how crazy, she has to smile, laugh, and celebrate it. pic.twitter.com/KO36G1D7ju— Acyn (@Acyn) March 14, 2025ఇక, వాన్స్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా ఉష ఎప్పట్లాగే ఆయన వెనకాల నుంచుని నవ్వుతూ చూస్తుండిపోవడం విశేషం! గత ఉపాధ్యక్షునిగా వాన్స్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయనకేసి ఉష ఆప్యాయంగా, గర్వంగా, చిరునవ్వుతో చూస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. తెలుగు మూలాలున్న ఉష 2014లో వాన్స్‌ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వాన్స్ దంపతులు ఈ నెలాఖర్లో భారత్ రానున్నారు. సెకండ్ లేడీ హోదాలో ఉషకు ఇది తొలి భారత పర్యటన. Usha's gaze of pure admiration for her husband - her smile hasn't faded, and she's absolutely glowing! 💖 pic.twitter.com/kOW3xtyyte— 𝕍𝕚𝕠𝕝𝕒 𝕃𝕖𝕚𝕘𝕙 𝔹𝕝𝕦𝕖𝕤 (@ViolaLeighBlues) January 20, 2025 -
అమెరికాలో రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు.. కారణం ఇదే..
వాషింగ్టన్: భారత్‌కు చెందిన రంజనీ శ్రీనివాసన్‌కు వీసా రద్దు కావడంతో ఆమె తనంతట తానుగా అమెరికాను వీడారు. పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల చేసిందుకు అక్కడి అధికారులు.. ఆమె వీసాను రద్దు చేశారు. దీంతో, రంజనీ శ్రీనివాస్ స్వదేశానికి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది.భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. అయితే, రంజనీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు. ఇక, 2025 మార్చి 5న విదేశాంగ శాఖ ఆమె వీసాను రద్దు చేసినట్టు ప్రకటనలో ఉంది. ఈ క్రమంలో ఆమె అమెరికాను వీడుతున్న వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో లాగార్డియా విమానాశ్రయంలో ఆమె తన లగేజీతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.NEW: Columbia rioter Ranjani Srinivasan self deported after her student visa was revoked pic.twitter.com/Fnneiko5qs— End Wokeness (@EndWokeness) March 14, 2025విశ్వవిద్యాలయంపై ఒత్తిడి..ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం కష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరిశోధనల కోసమే ఉంది. పాలస్తీనాకు సంబంధించిన నిరసనల సమయంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విద్యార్థులు, అధ్యాపకులపై యూనివర్శిటీ కఠినంగా చర్యలు తీసుకోకపోవడానికి శిక్షగా ఈ ఒప్పందాలను రద్దుచేసింది. -
టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది -
విశాఖలో NRI మహిళ మృతి కేసులో అనేక ట్విస్టులు
-
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతి క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో ఎట్టకేలకు మృతురాలి స్నేహితుడు, నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎన్ఆర్ఐ మహిళ రోజాకు.. డాక్టర్ శ్రీధర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. రోజా హోటల్‌కు వచ్చిన రెండు గంటల్లో అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు శ్రీధర్‌ను కలిసేందుకు మేఘాలయ హోటల్లోని రూం నంబర్ 229కి రోజా వెళ్లింది. 3.35 గంటల తరువాత ఆమె బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉందని శ్రీధర్ హోటల్ సిబ్బందికి చెప్పాడు. హత్యా? ఆత్మహత్యా? రెండు గంటల వ్యవధిలో రోజా అనుమానాస్పదంగా మృతి చెందడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు గంటలు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఈ సమయంలో రోజా–శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగిందా?.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడా? అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడా?.. మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాతే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి రోజాను ఆత్మహత్య చేసుకునేలా అమెరికాలో ఉన్నప్పటి నుంచే శ్రీధర్ ప్రేరేపిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలినట్లు తెలిసింది. ఒకవేళ రోజాది ఆత్మహత్య కాకపోతే అదే రూమ్‌లో ఉన్న శ్రీధర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిజనిజాలు బయట పడే అవకాశం లేదు. ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చలేదెందుకు? ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. డాక్టర్ శ్రీధర్‌ను కేసు నుంచి తప్పించేయత్నం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసు తేలిపోయేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకే గదిలో రోజా–శ్రీధర్ ఉన్న సమయంలో.. రోజా అనుమానాస్పదంగా మృతి చెందితే ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? డాక్టర్ శ్రీధర్ వెనుక ఎవరున్నారు? పోలీసులపై ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి. ఈ కేసు విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో పట్టణ పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆర్ధరాత్రి ప్రకటించారు. అన్ని వేళ్లూ పోలీసులవైపే.. ఎన్ఆర్ఐ మహిళా అనుమానాస్పద మృతిపై పోలీసులు చర్యలు విమర్శలకు తావిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజనిజాలు బయటపడేవి. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు అన్ని వేళ్లు వారివైపే చూపించేలా వ్యవహరించారు. 6వ తేదీన రోజా మృతి చెందినప్పటికీ 8వ తేదీ వరకు అటువంటి ఘటన జరగలేదు అన్నట్లు వ్యవహరించారు. పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తప్పు చేస్తే వెనకేసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఎవరైనా తప్పు చేస్తే మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకునే పోలీసులు ఈ కేసు విషయంలో పాటిస్తున్న గోప్యత అనుమానాలకు తావిస్తోంది. -
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. -
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు. -
డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. -
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?
వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి(20) మిస్సింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఓ బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. అక్కడే పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ఆమె చదువుకుంటున్నారు. అయితే, గత వారం ఆమె తన స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లారు. ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్రముఖ పర్యటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చి ఆరో తేదీన స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ కనిపించారు. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులను సంప్రదించారు.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సముద్ర తీరం వద్ద, సముద్రం లోపల డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆచూకీ లభించకపోవడంతో బహుశా ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు.. సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో ఆమె పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.Urgent missing college student on Spring Break in the Dominican Republic - Sudiksha Konanki - last seen in brown bikini in picture below 👇 pic.twitter.com/AMdYPngwVK— Glenda (@Glendaragnarson) March 10, 2025ఈ సందర్బంగా ఆమె తండ్రి కోణంకి సుబ్బరాయుడు తాజాగా మాట్లాడుతూ..‘తప్పిపోయిన సుదీక్ష కోసం పోలీసులు గాలిస్తున్నారు. రిసార్ట్ పరిసరాలు, సముద్రం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కిడ్నాప్, మానవ అక్రమ రవాణా వంటి అవకాశాలను కూడా పరిశీలించాలని పోలీసులను కోరాం’ అని చెప్పుకొచ్చారు. La Defensa Civil y otras instituciones, continúan en la búsqueda de Sudiksha Konanki, la joven de nacionalidad india, quien desapareció la madrugada del jueves 6 de marzo mientras caminaba en una playa de Punta Cana, provincia de La Altagracia.Informan que también fueron… pic.twitter.com/ntQQxC738S— Noticias Telemicro (@NTelemicro5) March 9, 2025 -
న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. -
ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నేరానికి గాను భారతీయ ప్రముఖుడు ఒకరికి న్యాయస్థానం 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల వరకు ఎలాంటి పెరోల్‌కు అవకాశం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. బాలేశ్ ధన్‌ఖడ్(43) మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియా మహిళలను ఆకర్షించి ప్రణాళిక ప్రకారం వారిని సిడ్నీలోని తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారికి డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని డౌనింగ్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది. తీర్పు వెలువడిన సమయంలో ధన్‌ఖడ్ కోర్టులోనే ఉన్నాడు. భవిష్యత్ లైంగిక సంతృప్తి కోసం అతను తన నేరాలను రికార్డు చేసి, వీడియోల రూపంలో భద్రపర్చు కోవడాన్ని జడ్జి మైకేల్ కింగ్ ప్రస్తావించారు.ఇక, బాధితులంతా 21–27 ఏళ్ల మధ్య వయ స్కులైన కొరియా మహిళలు. ఒక్కొక్కరికి వారి తెలివితేటలు, అందాన్ని బట్టి వేరుగా మార్కులు కూడా వేసేవాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళలతో జరిపిన చర్చలను సైతం రికార్డు చేశాడు. వారికి ఉద్యోగం అవసరం ఎంతుందనే దాన్ని బట్టి కుట్రను అమలు చేసేవాడు. చివరికి ఐదో బాధితురాలు 2018 అక్టోబర్‌లో ఫిర్యాదు చేయడంతో ఇతడి నేరాలకు పుల్‌స్టాప్ పడింది.పోలీసులు సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఇతడి కార్యాలయంపై దాడి చేసి డ్రగ్స్‌తోపాటు టేబుల్ క్లాక్ మాదిరిగా ఉన్న వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసు కున్నారు. అందులోనే అత్యాచారాల క్రమ మంతా నిక్షిప్తమై ఉండటం గమనార్హం. విచారణ జరిపిన కోర్టు ధన్‌ఖడ్ 39 నేరాలకు పాల్పడినట్లు గుర్తించింది. ఇందులో లైంగిక దాడికి సంబంధించిన నేరాలు 13 వరకు ఉన్నాయి. కోర్టు విధించిన జైలు శిక్షలో పెరోల్‌కు వీలులేని 30 ఏళ్ల కాలం 2053తో ముగియనుంది. మొత్తం 40 ఏళ్ల జైలు శిక్ష పూర్తయ్యే సరికి ధన్‌ఖడ్‌కు 83 ఏళ్లొస్తాయి.విద్యార్థిగా వెళ్లి...2006లో చదువుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ధన్‌ఖడ్ భారతీయ ఆస్ట్రేలియన్లలో పేరున్న నాయకుడి స్థాయికి ఎదిగారు. భారతీయ జనతా పార్టీ అనే గ్రూపును నెలకొల్పారు. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధిగా 2018లో అరెస్టయ్యే వరకు వ్యవహరించారు. ఏబీసీ, బ్రిటిష్ అమెరికన్ టొబాకో, టొయోటా, సిడ్నీ ట్రెయిన్స్ కంపెనీలకు డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్‌గా సేవలందించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.Indian community leader Balesh Dhankhar sentenced to 40 years in Australia for sexually assaulting five Korean women. Dhankhar lured victims with fake job ads, drugged and raped them and kept kept horrific spreadsheet detailing his crimes. Non-parole period set at 30 years.… pic.twitter.com/NcA4TUU3cq— Benefit News (@BenefitNews24) March 8, 2025 -
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు. -
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న వార్తలు ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు భాను బి. ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు ఈ ఇమ్మిగ్రేషన్ సెమీనార్‌కు ముఖ్యవక్తలుగా విచ్చేసి అనేక కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జన్మత:పౌరసత్వం, హెచ్ ఒన్ బీ నుంచి గ్రీన్ కార్డు వరకు అనుసరించాల్సిన మార్గాలు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్4 వీసా ఇలాంటి ఇమ్మిగ్రేషన్ అంశాలపై భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సెమీనర్లో పాల్గొన్న వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. అమెరికాలో ఉండే తెలుగు వారు ఇమ్మిగ్రేషన్ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి ఆందోళన తగ్గించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెమీనార్ నిర్వహించామని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. ఈ సెమీనార్ నిర్వహణ కోసం నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీపీరావు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల కృషి చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సెమీనార్‌కు విచ్చేసిన భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలకు నాట్స్ నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ సెమీనార్ విజయవంతం కావడంలో శ్రీకాంత్ పొనకల, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్లా, బ్రహ్మానందం పుసులూరి, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, కృష్ణ గోపాల్ నెక్కింటి, శ్రీనివాస్ చెన్నూరు, సాయిలీల మగులూరి కీలక పాత్రలు పోషించారు. తెలుగు వారికి ఎంతో ఉపయుక్తమైన ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ టీంను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు. -
మిసెస్ ఇండియా పోటీలకు తెలుగు ఎన్ఆర్ఐ
సాక్షి, సిటీబ్యూరో: లండన్ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో కార్పొరేట్ లీడ్ రోల్ నిర్వహిస్తున్న తెలుగు వనిత బిందు ప్రియ.. త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా 2025 పోటీల్లో ఎన్ఆర్ఐ విభాగంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని నిజామాబాద్ జిల్లాకు చెందిన బిందు ప్రియ తెలిపారు. బిందు ప్రియా జైస్వాల్ మిసెస్ ఇండియా తెలంగాణా 2025 క్లాసిక్ NRI కేటగిరీలో విజేతగా నిలిచింది. 2025 ప్రారంభంలో ఎన్ఆర్ఐ విభాగంలో మిసెస్ ఇండియా తెలంగాణ–2025 కిరీటాన్ని గెలుచుకుని త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బిందు బహుముఖ ప్రజ్ఞాశాలి. వర్క్‌లైఫ్, ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఐటీలో కార్పొరేట్ లీడర్ , గ్లోబల్ బ్యాంకింగ్ నిపుణురాలు. ఉన్నత విద్యావంతురాలు. ఆరోగ్యం & ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. తన తల్లి బోధించిన గీత పాఠాలే స్ఫూర్తి అని చెబతారు. కథక్, తెలుగు, హిందీ సంగీతం, గిటార్, పియానో వంటి సంగీత వాయిద్యాల్లో బిందుకు ప్రావీణ్యం ఉంది. అలాగే యూకేలోని ప్రసిద్ధ వేదికలపైన నృత్య ప్రదర్శనలివ్వడం విశేషం. సేవా (ఎస్ఈడబ్ల్యూఏ) సభ్యురాలిగా నిరుపేద విద్యార్థుల విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. -
టంపా వేదికగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి టంపా వేదికగా జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా నిర్వహిస్తున్నట్టు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లోరిడా రాష్ట్రం టంపాలోని టంపా కన్వెన్షన్ సెంటరు వేదికగా జరగనున్న ఈ తెలుగు సంబరాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా నలుమూలల నుండి పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని, తెలుగువారి సాంస్కృతిక వైభవానికి పట్టం కట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇప్పటికే ఏడు సార్లు ప్రతి రెండేళ్లకు అమెరికా సంబరాలను అద్భుతంగా నిర్వహించిందని.. ఈ సారి 8వ అమెరికా తెలుగు సంబరాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని పేర్కొన్నారు. అమెరికాలో ఉండే తెలుగు వారంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. తెలుగు వారిని అలరించే ఎన్నో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోదాల సమాహారాలు ఈ సంబరాల్లో ఉంటాయని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. సంబరాల నిర్వహణ కమిటీ లను ఎంపిక చేశామని, 3లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్ సెంటరులో ఈ సంబరాల నిర్వహణ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని నాట్స్ పేర్కొంది. రోజుకి 10 వేలకు పైగా ప్రవాస అతిథులు ఈ వేడుకల్లో పాల్గొంటారనే అంచనాలతో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కోసం ఆ స్థాయిలో విజయవంతానికి నాట్స్ సంబరాల కమిటీ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది.(చదవండి: జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం) -
జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం
ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీనిహల్ తమ్మనకు మరో అరుదైన గౌరవం లభించింది. బ్యాటరీ రీసైక్లింగ్‌తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్ధి శ్రీనిహాల్ తమ్మన విజయ ప్రస్థానాన్ని జర్మనీ పాఠ్యాంశాల్లో భాగంగా చేశారు. విద్యార్ధుల్లో పర్యావరణంపై స్ఫూర్తి నింపేందుకు జర్మనీ ప్రభుత్వం శ్రీనిహాల్ పర్యావరణం కోసం చేస్తున్న కృషిని పాఠ్యాంశంగా మార్చి విద్యార్ధులకు బోధిస్తుంది. ఇంతటి అరుదైన ఘనత సాధించిన శ్రీనిహాల్ మన తెలుగు వాడు కావటం నిజంగా యావత్ తెలుగుజాతి అంతా గర్వించదగ్గ విషయం. ఇప్పటికే శ్రీ నిహాల్ తాను స్థాపించిన రీ సైక్లింగ్ మై బ్యాటరీ కు అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. రీసైకిల్ మై బ్యాటరీ సంస్థ ద్వారా నిహాల్ అతని బృందం సభ్యులు ఏకథాటిగా ఒక్కరోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై నిహాల్ దృష్టిపదేళ్ల ఏళ్ల వయస్సులోనే నిహాల్ పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీనిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పించడమే గాక వివరిస్తున్నాడు. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ-సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్ కు పంపిస్తున్నాడు. రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది..2019 లో రీసైకిల్ మై బ్యాటరీ(ఆర్.ఎం.బి) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 900 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు ఆరు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు నాలుగు కోట్ల మందికి బ్యాటరీల రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్.ఎం.బీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది. బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్‌కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది. ఈ రోజు వరకూ తొమ్మిది వందల మంది విద్యార్థులు శ్రీ నిహాల్ తో చేతులు కలిపి ఈ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు. 600,000 పైగా బ్యాటరీలను ఇప్పటివరకూ రీసైకిల్ చేసి 39 మిలియన్లకు పైగా ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఇంకా, శ్రీనిహాల్ ఇటీవలే స్కూల్ బ్యాటరీ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. ఇందులో ప్రతి పాఠశాలలోని తరగతులు ఒకదానితో ఒకటి పోటీపడి, ఎవరు ఎక్కువ బ్యాటరీలను రీసైకిల్ చేస్తారో ఆ తరగతి పిజ్జా పార్టీని గెలుచుకుంటుంది. ఇప్పటి వరకు ఛాలెంజ్ ద్వారా రెండు నెలల్లో, వారు మూడు పాఠశాలల నుండి 30,000 బ్యాటరీలను రీసైకిల్ చేశారు. నిహాల్ ఈ ఛాలెంజ్‌ని 30 పాఠశాలలకు విస్తరించాడు. మూడు లక్షల బ్యాటరీలను రీసైకిల్ చేయాలనే లక్ష్యంతో మొత్తం రీసైకిల్ చేయబడిన బ్యాటరీలను వన్ మిలియన్ అంటే పది లక్షలకు పెంచాడు.(చదవండి: అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్) -
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం
గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్‌లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని వారికి భరోసా ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు స్పందించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 94 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా సొమ్ము వారి ఖాతాలకు ఈనెల ఒకటిన జమ చేయించారని అనిల్ ఈరవత్రి తెలిపారు. గల్ఫ్ కార్మికులు ఆయురారోగ్యాలతో, క్షేమంగా మాతృభూమికి తిరిగి రావాలని కాంగ్రేస్ ప్రభుత్వం ఆశిస్తున్నది. కానీ... దురదృష్ట వశాత్తు గల్ఫ్ దేశాలలో అకాల మరణం చెందిన మన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!భారత దేశ సరిహద్దులు దాటి ఎడారి దేశాలలో పనిచేస్తూ మృతి చెందిన కార్మికులు సైనికుల లాంటి వారని, విదేశీ మారక ద్రవ్యం పంపిస్తూ ఆర్థిక జవాన్లుగా సేవలందించిన వారిని 'గల్ఫ్ అమరులు' గా స్మరించుకొని వారిని గౌరవించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ 'గల్ఫ్ భరోసా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అనిల్ ఈరవత్రి తెలిపారు. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడోసారి జరిగింది. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ యాత్రలో సింగపూర్‌లో ఉన్న 11-12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు. సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీంతోప్రముఖ దేవాలయాలు భక్తుల భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి.ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీకి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, శివ రామ్ ప్రసాద్, కిరణ్ కైలాసపు, లక్ష్మణ్ రాజు కల్వ , అందరికి కృతజ్ణతలు తెలియజేశారు.మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లోనే ఉండి జాగారం, ఉపవాసం చేసే భక్తుల కోసం హార్ట్ఫుల్నెస్ సింగపూర్ సహకారంతో, జూమ్ ద్వారా ఉచిత మెడిటేషన్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి,నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్ తదితర యాత్రను విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న ఈ భక్తి కార్యక్రమానికి సింగపూర్‌లో పని రోజు అయినప్పటికీ భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులకు, స్పాన్సర్స్ కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. ఎమర్జెన్సీ వీసాకు లైన్ క్లియర్
వాషింగ్టన్: ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలో ఉన్న విద్యార్థిని నీలం షిండేని కలిసేందుకు ఆమె తండ్రి తానాజీ షిండేకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ వీసా ఇచ్చేలా శుక్రవారం ఉదయం 9 గంటలకు అమెరికా ఎంబసీ (U.S. Embassy) కార్యాలయం ఇంటర్వ్యూ చేయనుంది. ఇందుకోసం షెడ్యూల్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే(35) తీవ్రంగా గాయపడింది. అనంతరం, కోమాలోకి వెళ్లడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా లభించడం లేదని నీలం తండ్రి తానాజీ షిండే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే కేంద్రాన్ని కోరారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నీలం షిండే (35) గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ ఏడాదితో చదువు పూర్తి కానుంది. అయితే, ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం కారణంగా బాధితురాలి కాళ్లు, చేతులు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తలకు గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో, ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న ప్రమాదం జరిగినట్లుగా తమకు తెలిసిందని తండ్రి తనాజీ షిండే పేర్కొన్నారు. అప్పటి నుంచి అత్యవసర వీసా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా లభించడం లేదన్నారు.Neelam Shinde, 35, a resident of Maharashtra's Satara district, was allegedly hit by a car on February 14. She is currently in the ICU. pic.twitter.com/7O2X0dYO8W— The Brief (@thebriefworld) February 27, 2025ఈ వీసా విషయం ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే దృష్టికి రావడంతో ఆమె తాజాగా స్పందించారు. వీసా ఇప్పించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరినట్లు తెలిపారు. ఈ సమస్యను త్వరగా కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని, తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.Student Neelam Shinde has met with an accident in the USA and is hospitalized in a local hospital. Her father, Tanaji Shinde, from Satara, Maharashtra, India, urgently needs to visit his daughter due to a medical emergency. Tanaji Shinde has applied for an urgent visa to the USA…— Supriya Sule (@supriya_sule) February 26, 2025ఈ నేపథ్యంలో భారత్.. తానాజీ షిండేకి వీసా మంజూరు చేయాలని కేంద్రం.. అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. భారత్ విజ్ఞప్తి మేరకు అమెరికా తానాజీ షిండేకి ఎమర్జెన్సీ వీసా ఇవ్వనుంది. -
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగిన - 77వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21)’ సందర్భంగా “నా భాషే నా శ్వాస” (పసిప్రాయంనుండే పిల్లలకు దేశ, విదేశాలలో తల్లిభాష ఎలా నేర్పుతున్నారు?) అనే కార్యక్రమం విజయవంతంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అతిథులందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సభను ప్రారంభించారు. సభకు అధ్యక్షతవహించిన తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – అప్పటి తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) లో ‘బెంగాలీభాష’ అధికార గుర్తింపు కోసం 1952లో ఫిబ్రవరి 21న పాకిస్తాన్ ప్రభుత్వ తూటాలకు బలిఅయిన వారి స్మారకంగా ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించిందని గుర్తుచేశారు. మాతృభాషలో సరైన పునాదిఏర్పడిన తర్వాతే ఆంగ్లం లేదా ఇతర భాషలను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి వీలు కల్గుతుందనే వాస్తవాన్ని విస్మరించకూడదని, ఆంగ్లభాష మోజులోపడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదని, ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.”ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెన్నం ఉమ మాట్లాడుతూ – “పిల్లలు పసివయస్సులో తన తల్లి, కుటుంబసభ్యుల వాతావరణంలో మాతృభాషను వినికిడి ద్వారా, అనుకరణ ద్వారా, గమనించడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని ఆ పరిస్థితులను కల్పించవలసిన బాధ్యత పెద్దలమీదేఎక్కువగా ఉంటుంది అన్నారు. చాలా అర్ధవంతమైన, అవసరమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులకు, పాల్గొన్న విశిష్టఅతిథులకు అభినందనలు తెలియజేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండివిశిష్టఅతిథులుగా-శ్రీ పరవస్తు ఫణి శయన సూరి, ‘తెలుగుదండు’-విశాఖపట్నం; శ్రీ మణికొండ వేదకుమార్, ‘బాలచెలిమి’, ‘దక్కన్ లాండ్’–హైదరాబాద్; శ్రీ ఏనుగు అంకమ నాయుడు, ‘సాహిత్యాభిలాషి’, ‘సంఘసేవకులు’–తిరుపతి; డా. మురహరరావు ఉమాగాంధీ, ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారగ్రహీత, విశాఖపట్నం; శ్రీమతి జ్యోతిర్మయి కొత్త, ‘పాఠశాల’-షార్లెట్, నార్త్ కరోలినా, అమెరికా; శ్రీ ఫణి డొక్కా, ‘అంతర్జాతీయ తెలుగుబడి’-అట్లాంటా, జార్జియా, అమెరికా; శ్రీ వెంకట రామారావు పాలూరి, సిలికానాంధ్ర ‘మనబడి’-డాలస్, టెక్సస్, అమెరికా; శ్రీ రవిశంకర్ విన్నకోట, ‘పాఠశాల’-కొలంబియా, సౌత్ కరోలినా, అమెరికా; శ్రీ భానుప్రకాష్ మాగులూరి, తానా ‘పాఠశాల’-వర్జీనియా, అమెరికా; మరియు శ్రీమతి ఇందిర చెరువు, తెలుగు సాంస్కృతిక సమితి ‘తెలుగుబడి’-హ్యూస్టన్, టెక్సస్, అమెరికా పాల్గొని పిల్లలకు తెలుగుభాషను నేర్పడంలో వారు అనుసరిస్తున్న వినూత్న విధానాలను, సాధిస్తున్న ఫలితాలను సోదాహరణం గా వివరిస్తూ, తల్లిభాషను భావితరాలకు అందించడంలో తల్లిదండ్రుల శ్రద్ధ, ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో అవసరం అన్నారు.తానా సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన కార్యకర్తలకు, ప్రసారమాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. Watch Video: https://www.youtube.com/watch?v=-s2aegzZi14Watch Video: https://youtu.be/7sDprKwN53Q -
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ కర్ణాటక సంగీత ఆలాపనా విధానాలపై విశ్లేషణాత్మక ప్రసంగాన్ని ప్రత్యేకించి అందించారు."ఎప్పుడూ వివిధ శాస్త్రీయ, సినీ సంగీత కార్యక్రమాలను సింగపూర్‌లో ఏర్పాటు చేస్తూనే ఉంటామని, కానీ తొలిసారి ఈ విధంగా వర్ధమాన గాయనీ గాయకులకు ఉపయోగపడే విధంగా శాస్త్రీయ సంగీత ఆలాపనా విధానాలపై మరింత అవగాహనను పెంచే విధంగా మెళకువలను నేర్పే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని" శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్య సంగీతం, స్వరలయ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి విద్య సంగీతం నుంచి విద్యాధరి కాపవరపు, ఆదివారం జరిగిన కార్యక్రమానికి స్వరలయ సంస్థ నుంచి శేషు యడవల్లి, కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చేపట్టారు.శాస్త్రీయ సంగీతానికి ఆయువుపట్టైన భావప్రకటన యొక్క ప్రాధాన్యతను గురించి లోకనాథశర్మ వర్ణించారు. కచేరీలలో కేవలం తమ పాండిత్య ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా గాయనీగాయకులు పాటల సాహిత్యంపై భావంపై దృష్టి పెట్టాలన్నారు. కీర్తనలలో హస్వాక్షరాలను రాగాలాపన కోసం సాగదీస్తే అర్థవంతంగా ఉండదన్నారు. గాత్ర సౌలభ్యం కోసం పదాలను నచ్చిన విధంగా విడదీయడం సబబు కాదన్నారు. మహా భక్తులైన త్యాగరాజు అన్నమయ్య రామదాసు కీర్తనల విషయంలో భక్తిరసాత్మకంగా మాత్రమే ఆలపించా లన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సోదాహరణ ఉదాహారణలతో సందేహ నివృత్తి చేసారు.సింగపూర్‌లో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునే విద్యార్థులు, గాయనీ గాయకులు, సంగీత పాఠశాలలు నడిపే గురువులు, శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి ఉన్న తెలుగువారు తమ సందేహనివృత్తి చేసుకున్నారు. అనంతరం సంస్థ సభ్యులందరూ కలిసి లోకనాథ శర్మను సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం' కూడా కావడంతో వారాంతంలో ఇటువంటి ఉపయోగాత్మక కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాగవత ప్రచార సమితి సింగపూర్ శాఖ అధ్యక్షులు ఊలపల్లి భాస్కర్, ఇండియా శాఖ అధ్యక్షులు ఊలపల్లి సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం అందరూ కలిసి భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి కార్యవర్గ సభ్యులు పాతూరి రాంబాబు మరియు శ్రీధర్ భరద్వాజ్ దగ్గరుండి భోజనఏర్పాట్లు సమకూర్చారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలందరికి పేరు పేరున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేసారు.రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయనీ గణేశ్న, సుబ్బు వి పాలకుర్తి సాంకేతిక సహకారంఅందించగా, ఈ కార్యక్రమం ప్రపంచంలోని సంగీతాభిమానులందరికీ కోసం శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారమైంది. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆందోళన కొనసాగు తుండగానే కెనడా ప్రభ్తుత్వం కూడా షాకిస్తోంది. స్టడీ, వర్క్ వీసాలపై కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది.. ఇటీవల తమ దేశంలోని ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన అమెరికా బాటలోనే కెనడా కూడా నడుస్తోంది.కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఒక పీడకలగా మారవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చాయి . ఉద్యోగులు, వలసదారుల వీసా స్థితిని ఎప్పుడైనా మార్చడానికి కెనడియన్ సరిహద్దు అధికారులకు విచక్షణాధికారాలను ఇస్తున్నాయి.జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయితే, పర్మిట్లు, వీసాలను తిరస్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. బస గడువు ముగిసిన తర్వాత వ్యక్తి కెనడాను విడిచిపెడతారని నమ్మకం లేకపోతే, గడువు ఉన్నప్పటికీ ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు లేదా వారి అనుమతిని రద్దు చేయవచ్చు. తాజా చర్యలు భారతదేశం నుండి వచ్చిన వారితో సహా పదివేల మంది విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతులు రద్దైన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ(ఎయిర్‌పోర్టు) నుంచే వెనక్కు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయులను ఎక్కువగా వెళుతున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి ట్రంప్ ఆంక్షల తరువాత కెనడాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం కెనడాలో సుమారు 4.2లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యనభ్యిస్తున్నారు.ఇక భారతీయ టూరిస్టుల విషయానికి వస్తే 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. మూడు నెలల క్రితమే (2024 నవంబర్), కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా SDS వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన విషయం విదితమే. -
మాట నూతన కార్యవర్గం ఏర్పాటు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్-మాట బోర్డు మీటింగ్ డల్లాస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట 2025-26 పదవీకాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మాట అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దగి బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ గూడూరు, సెక్రటరీగా విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్ గా శ్రీధర్ గూడాల నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ మెంబెర్ జితేందర్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ బోర్డు మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, సలహా మండలి, బోర్డు, గౌరవ సలహాదారులు సహా 250 మందికి పైగా మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలను నూతన అధ్యక్షుడు వెల్లడించారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలుగా మాట సంస్థ ఏర్పడిందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా మాట తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన అడ్వైజరీ కౌన్సిల్ , న్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరక్టర్స్, స్టాడింగ్ కమిటీ మెంబర్స్, RVP’s, RC’s గౌరవ సలహాదారులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.మరిన్ని NRIవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: -
న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పాటు పలు ఆల్బమ్ లో నటించి.. తన అందం, అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తోంది అందాల బ్యూటీ అంకితా జాదవ్. 2024 లో రిలీజ్ అయినా ఇంద్రాణి మూవీలో నటుడు అజయ్ సరసన నటించి.. యాక్టింగ్ లో మంచి మార్కులు కొట్టేసింది. ఇంద్రాణి సినిమాలో ఛాలెంజింగ్ సాంగ్ చేసి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హిందీలో ఐదు ఆల్బమ్ సాంగ్స్ చేసి.. యాక్టింగ్ తో పాటు డ్యాన్సులు కూడా ఇరగదీస్తుందనే పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన తెలుగు మూవీ 2025 లో రిలీజ్ కానుంది. ఓ లవ్ స్టోరీ ఆధారంగా ప్రముఖ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే ఆమె నటించిన హిందీ మూవీ కూడా 2025 లో రిలీజ్ కానుంది. తన ఫిట్నెస్ , అందంతో ఒక వైపు నటిగా, డ్యాన్సర్‌గా అలరిస్తూ.. మరోవైపు ఎన్జీఓతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. విదేశాల్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఓ సెలబ్రెటీ పాల్గొనాలంటే రెమ్యూనేరషన్ తో పాటు జర్నీ ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. కానీ అంకిత మాత్రం స్వచ్ఛధంగా NGO కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం.మరిన్ని NRI వార్తలకోసం క్లిక్ చేయండిఇటీవల అమెరికాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకర్షించింది. అందాల తార శ్రీదేవి నటించిన చిత్రాలు, పాటలను గుర్తుకు తెచ్చేలా ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన డాన్స్ కార్యక్రమంలో.. అంకిత తన ఫెర్మామెన్స్ తో అదరగొట్టింది. సత్య మాస్టర్, అంకిత జోడిగా సాగిన ఈ డాన్స్ ప్రోగ్రాంకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్ వచ్చింది. ఇటీవల విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ వద్ద జరిగిన ఈవెంట్ లో దిల్ రాజుతో కలిసి అంకిత పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా న్యూయార్క్, చికాగోలో అంకిత మ్యూజిక్ ఆల్బమ్ షూట్ చేసింది. అలాగే స్విట్జర్లాండ్ , వెనిస్ లోని అందమైన లొకేషన్లలో రెండు సాంగ్స్ షూట్ కంప్లిట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకులు, హాలీవుడ్ వీడియోగ్రాఫర్ లతో కలిసి ఆమె వర్క్ చేసింది. అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా త్వరలో రిలీజ్ కానున్నాయి. -
గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్
గుంటూరు: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా గుంటూరులో మహిళా సాధికారత కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే గత శుక్రవారం నాట్స్ ఆధ్వర్యంలో నెహ్రు యువక కేంద్రంలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ కుట్టుశిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణి చేశారు. పేద మహిళలు స్వశక్తితో నిలబడేలా.. సాధికారత సాధించేలా చేసేందుకు నాట్స్ తన వంతు సహకారం అందిస్తుందని నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కో ఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే వారి కుటుంబాలు ఆర్ధిక స్థిరత్వం సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్‌తో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్‌కు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు
న్యూజెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ న్యూజెర్సీ, శనివారం నాడు ఆర్ధిక అవగాహన సదస్సు నిర్వహించింది. న్యూజెర్సీలో ఉండే తెలుగు వారికి ఆర్ధిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏజీ ఫిన్ టాక్స్ సీఈఓ అనిల్ గ్రంధి తెలుగువారికి ఎన్నో విలువైన ఆర్ధిక సూచనలు చేశారు. అమెరికాలో పన్నులు, ఉద్యోగం చేసే వారికి ఎలాంటి పన్ను మినహాయింపులు ఉన్నాయి.? అకౌంటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక పన్నుల నుంచి తప్పించుకోవచ్చు..? వ్యాపారాలు చేసే వారు పన్నుల విషయంలో ఎలా వ్యవహారించాలి ఇలాంటి అంశాలను అనిల్ గ్రంధి చక్కగా వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ ఆర్ధిక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడంలో నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీహరి మందాడి కీలక పాత్ర పోషించారు. తెలుగువారికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నాట్స్ చేపడుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా నాట్స్ విద్య, వైద్యం, ఆర్ధికం, క్రీడలు ఇలా ఎన్నో అంశాలపై కార్యక్రమాలు చేపట్టనుందని శ్రీహరి మందాడి వివరించారు.నాట్స్ బోర్డు డైరెక్టర్ బిందు ఎలమంచిలి, vice ప్రెసిడెంట్(ఆపరేషన్స్) శ్రీనివాస్ భీమినేని, నేషనల్ కోఆర్డినేటర్M(మార్కెటింగ్) కిరణ్ మందాడి, zonal వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, న్యూ జెర్సీ చాప్టర్ నుండి మోహన్ కుమార్ వెనిగళ్ల, శ్రీకాంత్ పొనకాల,వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు , కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్ల , బ్రహ్మనందం పుసులూరి, బినీత్ చంద్ర పెరుమాళ్ళ, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేశ్ బేతపూడి, గోపాల్ రావు చంద్ర పలు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (NRI వార్తల కోసం క్లిక్ చేయండి) -
జేఈఈ టాపర్ గుత్తికొండ మనోజ్ఞకు నాట్స్ అభినందనలు
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జేఈఈ పరీక్షలో 100 శాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అభినందించింది. అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఒత్తిడి తట్టుకుని నూటికి నూరు శాతం సాధించిన మనోజ్ఞ తెలుగు విద్యార్ధులందరికి ఆదర్శంగా నిలిచారని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టుదల.. ఏకాగ్రత ఉంటే ఎంతటి కష్టమైన పరీక్షలనైనా గట్టెక్కవచ్చనేది మనోజ్ఞ నిరూపించిందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. మనోజ్ఞ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.జేఈఈ మెయిన్ ఫలితాలలో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సాయి మనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థినిగా నిలిచింది. 14 మందికి మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. గుంటూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో మనోజ్ఞ చదువుతోంది. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి: -
ఉగాది సాహిత్య సమ్మేళనం, ఎంట్రీలకు ఆహ్వానం!
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆధ్వర్యంలో..విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగాఉగాది సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం ఉచితమని తెలిపారు. ‘విశ్వాససు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.తేదీ: ఏప్రిల్ 13, 2025, ఆదివారంసమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకావేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.సంగ్రహ కార్యక్రమం ప్రారంభ సభకవి సమ్మేళనంమహిళా పృఛ్ఛకులతో అష్టావధానం - ‘ద్విశతావధాని’ డా బులుసు అపర్ణనూతన పుస్తకావిష్కరణ సభ-2025కవి సమ్మేళనం నమోదు వివరాలుభారత దేశం, సింగపూర్, అమెరికా దేశ సంస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహిత్య సమ్మేళనం లో పాల్గొని తమ స్వీయ కవితలని సభా ముఖంగా వినిపించే ఆసక్తి ఉన్నవారు సకాలంలో ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.నమోదు పత్రంhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSc8fSIPdScAsrz89h6Q9rAWNIqazuTtUeWPgpIpew93Wv3qEQ/viewformనమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025• నమోదు పత్రం లో అందిన కవితలు మాత్రమే పరిశీలించబడతాయి.• కవిత వ్యవధి 3 నిమిషాలు (25 వాక్యాలు) దాటరాదు.• కవిత ఏదైనా సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశంపై రాయవచ్చు. మత కుల రాజకీయ ప్రసక్తి లేకుండా కవిత శుభసూచకంగా ఉండాలి.• స్థానికులకి తగిన గుర్తింపు, బయట ప్రాంతాలనుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.• కవితల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే.నూతన పుస్తకావిష్కరణలునమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025 (ఉగాది)‘విశ్వావసు’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనంలో తమ నూతన గ్రంధాలు సభా ముఖంగా ఆవిష్కరించ దలచుకున్న వారు వివరాలతో సంప్రదించాలని, కేవలం 2025 లో ప్రచురించబడిన కొత్త పుస్తకాలు మాత్రమే ఆవిష్కరణకి పరిశీలిస్తామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.వివరాలకోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లుప్రధాన సమన్వయ కర్త: రాధిక మంగిపూడి (+91 9029409696)రత్న కుమార్ కవుటూరు +65 91735360 (సింగపూర్)డా. వంశీ రామరాజు +91 9849023852 (హైదరాబాద్)డా. వంగూరి చిట్టెన్ రాజు +1 8325949054 (హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా) మరిన్ని NRI వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి: -
తెలుగమ్మాయికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు..!
ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనిక అక్కినేని అబుదాబికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘జాయేద్ సస్టైన్ బిలిటీ ప్రైజ్’ను గెలుచుకుంది. చిన్నప్పుడు జానపద కథల్లో రాక్షసుల గురించి విన్నదో లేదోగానీ కాలుష్యకారక రాక్షసుల గురించి విన్నది మోనిక. భూతాపం పెంచే ఎన్నో భూతాల గురించి విన్నది. అలా వింటున్న క్రమంలో కర్బన ఉద్గారాల కట్టడికి తన వంతుగా ఏదైనా చేయాలనుకునేది. ఆవిష్కరణకు ముందు అధ్యయనం ముఖ్యం కదా!క్లైమెట్ ట్రాన్స్‌పరేన్సీ రిపోర్ట్లు చదవడం నుంచి కార్బన్ కాప్చర్ స్టోరేజీ(సీసీఎస్) తెలుసుకోవడం వరకు ఎన్నో చేసింది.... ఏలూరు నగరానికి చెందిన భూపేష్ రఘు అక్కినేని, స్వీటీ దంపతులు అబుదాబీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె మోనిక అక్కినేని అబుదాబీలోని మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టులపై గత రెండేళ్ళుగా మోనిక ఆసక్తి పెంచుకుని సహ విద్యార్థి ముస్కాన్ తో కలిసి పనిచేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఎయిర్ క్వాలిటీ పెంచే బయో డీగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీపై పరిశోధనలు ప్రారంభించింది. సముద్ర గర్భంలో ఉండే నాచు, కొబ్బరిపీచులు, వైబర్ (ఇండస్ట్రియల్ సిమెంట్)తోపాటు మరికొన్ని రసాయనాలు వాడి చిన్నపాటి ప్లేట్లను సిద్ధం చేసింది. మోనిక పూర్తి చేసిన ప్రాజెక్టును స్కూల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక ఫ్యాక్టరీలో ప్రాజెక్టు పనితీరును అధ్యయనం చేసి మేరీల్యాండ్స్ స్కూల్ ప్రాజెక్టును ఎంపిక చేసింది. ప్రతి ఏటా అబుదాబీ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం పేరుతో ‘జాయేద్ సస్టైన్బిలిటీ ప్రైజ్‌లను 11 విభాగాల్లో అందిస్తుంటారు. ఆరోగ్యం, ఆహారం, ఎనర్జీ, నీరు, వాతావరణంలో మార్పులపై అధ్యయనం... ఇలా పదకొండు విభాగాలకు ఆన్‌న్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ ఏడాది 5,500 దరఖాస్తులు అందాయి. మోనిక ఈ అవార్డుకు దరఖాస్తు చేసింది. పదకొండు విభాగాల్లో 33 మందిని షార్ట్‌లిస్ట్ చేసి పదకొండు మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఎయిర్ క్వాలిటీ పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనికకు ప్రైజ్ దక్కింది. మోనిక రూపొందించిన ఫార్ములా గురించి చెప్పుకోవాలంటే... 1,100 పీఎస్ఐ కార్బన్ డయాక్సైడ్ విడుదలైతే మూడు గంటల వ్యవధిలో 300 పీఎస్ఐ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆడిటోరియాలు, జనాలు అధికంగా ఉండే భవనాలు, పాఠశాల తరగతి గదుల్లో గోడలకు ఈ టైల్స్‌ను అతికిస్తే దీర్ఘకాలం పనిచేస్తాయి. ప్రత్యేకంగా స్కూల్ గదుల్లో ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ టైల్స్‌ను వినియోగించడం ద్వారా గాలిలోని కర్బన ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యత పెంచవచ్చు. అవార్డుతోపాటు మౌనిక అక్కినేనికి లక్షన్నర డాలర్ల గ్రాంటును మంజూరు చేశారు. భవిష్యత్‌లో ఈప్రాజెక్టు తోపాటు సరికొత్త ఆవిష్కరణలకు గ్రాంటును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు.మరిన్ని ఆవిష్కరణలు...మా పేరెంట్స్, స్కూల్లో టీచర్ల ద్వారా పర్యావరణానికి జరుగుతున్న ముప్పు గురించి ఎన్నో సార్లు విన్నాను. బాధగా అనిపించేది. బాధ పడడం కంటే ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించడం ముఖ్యం అనిపించింది. ఉపాధ్యాయులు, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను. పర్యావరణానికి ఉపయోగపడేలా మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నాను. మెడిసిన్ చేయాలనేది నా లక్ష్యం అంటోంది మోనిక అక్కినేని ఆక్సిజెమ్ – కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, ఏలూరు(చదవండి: ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
ఫినిక్స్‌లో సేంద్రీయ వ్యవసాయంపై నాట్స్ అవగాహన
ఫినిక్స్ : అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు వారి కోసం సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫినిక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను ఈ సదస్సులో నాట్స్ నాయకులు వివరించారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల నేలతల్లికి కూడా మేలు చేసినట్టవుతుందని ప్రముఖ పర్యావరణ ప్రేమికులు ప్రవీణ్ వర్మ అన్నారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను, ఆరోగ్యానికి జరిగే మేలును ఆయన వివరించారు. ఇదే కార్యక్రమంలో ఇంటి ఆవరణలోనే పండించిన సేంద్రీయ ఉత్పత్తులను రైతు బజార్ తరహాలో పెట్టి విక్రయించారు. తాము ఎలా సేంద్రీయ పద్దతుల్లో ఆకుకూరలు పండించింది కూడా పండించిన వారు ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేసిన నాట్స్ ఫినిక్స్ సభ్యులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలోని సెయింట్ లూయిస్ మహాత్మ గాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. నాట్స్ సలహా మండలి సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. స్థానికంగా ఉండే తెలుగు వారు ఈ వైద్య శిబిరానికి వచ్చి ఉచిత వైద్య సేవలు పొందారు. డాక్టర్లను అడిగి తమ అనారోగ్యాలకు గల కారణాలను, నివారణ మార్గాలను తెలుసుకున్నారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, నాట్స్ మిస్సోరీ నాయకులు నాగ శ్రీనివాస్ శిష్ట్ల మధుసూదన్ దడ్డలతో పాటు పలువురు నాట్స్ వాలంటీర్లు ఈ ఉచిత వైద్య శిబిరం దిగ్విజయం చేయడంలో కృషి చేశారు. సెయింట్ లూయిస్‌లో తెలుగువారి కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించిన మిస్సోరీ చాప్టర్ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
ట్రంప్ మరో సంచలనం.. గుజరాతీ కాష్ పటేల్‌కు కీలక బాధ్యతలు
వాషింగ్టన్: భారత సంతతి వ్యక్తి కాష్ పటేల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలను అప్పగించారు. అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు పటేల్ నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. అయితే, ఇలాంటి పదవుల విషయంలో సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో కాష్ పటేల్‌కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ధ్రువీకరించారు. అయితే, రిపబ్లికన్లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మైనే, అలస్కా సేనేటర్లు సుశాన్ కొలిన్స్, లీసా ముర్కోస్కీలు పటేల్ నియమాకాన్ని వ్యతిరేకించారు. ఇక, ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఆయన నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది.ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియామకం అనంతరం కాష్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా క్వాష్ పటేల్.. అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్‌బీఐని తీర్చిదిద్దుతాను. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే అంతు చూస్తాం. అలాంటి వారు ఈ గ్రహంలో ఏ మూలన ఉన్నా వెంటాడుతామని హెచ్చరించారు. అలాగే, అమెరికానే ఫస్ట్.. మిషన్ ఫస్ట్‌గా పనిచేద్దాం. డైరెక్టర్‌గా నా లక్ష్యం స్పష్టంగా ఉంది అని చెప్పుకొచ్చారు.I am honored to be confirmed as the ninth Director of the Federal Bureau of Investigation.Thank you to President Trump and Attorney General Bondi for your unwavering confidence and support.The FBI has a storied legacy—from the “G-Men” to safeguarding our nation in the wake of…— FBI Director Kash Patel (@FBIDirectorKash) February 20, 2025ఇదిలా ఉండగా.. కాష్ పటేల్ ప్రవాస భారతీయుడు. ఆయన కుటుంబం గుజరాత్‌కు చెందినవారు. పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. పటేల్.. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించారు. లాంగ్ ఐలండ్లోని గార్డెన్ సిటీ హైస్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుంచి ఇంటర్నేషనల్ లా అభ్యసించారు. ట్రంప్ తొలి హయాంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కౌంటర్ టెర్రరిజం విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. రెండో టర్మ్‌లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. Washington: US President Donald Trump has officially signed the commission to confirm Kash Patel as the Ninth Director of the Federal Bureau of Investigation.Source: Dan Scavino, Assistant to the President & White House Deputy Chief of Staff/ 'X' pic.twitter.com/cbWmFa0cpB— ANI (@ANI) February 21, 2025 -
పనామా నిర్బంధ కేంద్రంలో భారతీయులు.. స్పందించిన ఎంబసీ
పనామా సిటీ: భారతీయులు సహా సుమారు 300 మంది అక్రమ వలసదారుల్ని లాటిన్ అమెరికా దేశం పనామాలో ఉంచింది అమెరికా. అయితే.. నిర్బంధ కేంద్రంలో వాళ్లంతా దయనీయమైన స్థితిలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమకు సాయం అందించాలని కొందరు ఫ్లకార్డులను ప్రదర్శించడమే అందుకు కారణం. అయితే పనామాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ అంశంపై స్పందించింది.పనామా(Panama)లోని ఓ హోటల్లో వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించింది. వాళ్లకు అవసరమైనవన్నీ ఇక్కడి అధికారులు అందిస్తున్నారని, వాళ్ల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ ఎక్స్ ద్వారా తెలిపింది.Panamanian authorities have informed us that a group of Indians have reached Panama from US They are safe and secure at a Hotel with all essential facilitiesEmbassy team has obtained consular accessWe are working closely with the host Government to ensure their wellbeing pic.twitter.com/fdFT82YVhS— India in Panama, Nicaragua, Costa Rica (@IndiainPanama) February 20, 2025భారత్,ఇరాన్, నేపాల్,శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనాకు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పనామాకు తరలించారు అధికారులు. హోటల్ అయిన ఆ నిర్బంధ కేంద్రం చుట్టూ తుపాకులతో సిబ్బంది ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే టైంలో.. వలసదారుల్లో కొందరు సాయం కావాలని, తాము తమ దేశంలో సురక్షితంగా ఉండలేమంటూ హోటల్ అద్దాల గదుల నుంచి ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆందోళన మొదలైంది.అయితే అక్రమ వలసదారుల్ని(Illegal Migrants) నేరుగా స్వస్థలాలకు పంపడంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే పనామాను వారధిగా(ట్రాన్సిట్ కంట్రీ) ఉపయోగించుకుంటోంది. ఇక వలసదారుల ఆందోళనలను పనామా తోసిపుచ్చుతోంది. అమెరికాతో ఉన్న వలసదారుల ఒప్పందం మేరకు..వాళ్లను ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని పనామా సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అబ్రెగో వెల్లడించారు. వాళ్లకు సకాలంలో ఆహారం, మందులు..ఇతర సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారాయన. అయితే..వాళ్లలో చాలామంది హోటల్ దాటే ప్రయత్నాలు చేశారని, అందుకే కాపలా ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.బుధవారం చైనాకు చెందిన ఓ మహిళ పారిపోయే ప్రయత్నంలో పట్టుబడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అక్రమ వలసదారుల్ని ఇక్కడి(పనామా) నుంచే స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారాయన.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్‌కు 332 మంది అక్రమ వలసదారుల్ని పంపించి వేసింది. ఈ మేరకు మూడు దఫాలుగా అమృత్‌సర్‌లో అమెరికా యుద్ధ విమానం వలసదారుల్ని తీసుకొచ్చింది. -
MATA అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA)' నూతన అధ్యక్షునిగా రమణ కృష్ణకిరణ్ దుద్దాగి ప్రమాణ స్వీకారం చేశారు. డల్లాస్‌లో జరిగిన 'మాటా' నూతన బోర్డు సమావేశంలో రమణ కృష్ణకిరణ్ దుద్దాగి బాధ్యతలు స్వీకరించారు. 2025-2026 వ్యవధికి రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి అధ్యక్షునిగా కొనసాగుతారు.ఈ సందర్భంగా 'మాటా' వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని సలహా మండలి సభ్యుడిగా (Advisory Council Member) బాధ్యతలు స్వీకరించారు. MATA అభివృద్ధి, లక్ష్యాల సాధన కోసం శ్రీనివాస్ గనగోని అనుభవం, మార్గదర్శకత్వం కొనసాగతుందని ఈ సందర్భంగా నూతన బోర్డు తెలిపింది. తెలుగు సమాజ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మాటా సంఘం నూతన నాయకత్వ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తన పదవీకాలంలో MATA అనూహ్యమైన అభివృద్ధి సాధించి, అనేక సమాజాలకు చేరుకుని అవిస్మరణీయమైన ప్రభావాన్ని చూపిందని ఆయన గుర్తుచేశారు. శ్రీనివాస్ గనగోని సలహా మండలి సభ్యులుగా(Advisory Council Member) బాధ్యతలు స్వీకరించి, MATA భవిష్యత్తును మరింత ముందుకు నడిపేందుకు తన అనుభవాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించనున్నారు. 'ది ల్యాండ్' మ్యాగజైన్ (The Land Magazine) వారి 2024-25 "Person of the Year" టైటిల్‌కు ఎంపికై, సత్య నాదెళ్ల, పవన్ కళ్యాణ్ వంటి మహోన్నత వ్యక్తులతో పాటు పురస్కారాన్ని అందుకోవడం, సమాజంపై ఆయన చేసిన గొప్ప ప్రభావానికి ఘనత చాటి చెబుతోంది.అనంతరం వ్యవస్థాపకులు, సలహా మండలి సభ్యులు ప్రదీప్ సమల, జితేందర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. వారు మాటా పాటించే ముఖ్యమైన విలువలను గురించి తెలుపుతూ, సమాజ సేవ, నాయకత్వంలోని సవాళ్లు, అవకాశాలను వివరించారు. జితేందర్ రెడ్డి 'మాటా' భవిష్యత్ మార్గాన్ని స్పష్టం చేస్తూ, కొత్త నాయకత్వ బృందాన్ని మరింత ముందుకు సాగమని ప్రోత్సహించారు.సేవ, సంస్కృతి, సమానత్వంపై దృష్టిఅధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి భవిష్యత్ కార్యాచరణ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఈ పదవీకాలంలో కీలకమైన ఐదు లక్ష్యాలపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. సేవ: అమెరికాలోని అన్ని తెలుగు కుటుంబాలకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలను విస్తరించడం. సంస్కృతి: తెలుగు వారసత్వాన్ని కాపాడుతూ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం. సమనత్వం: కొత్త ఛాప్టర్లను ప్రారంభించి, సభ్యులకు సమాన అవకాశాలను కల్పించడం.యువశక్తి: యువ నాయకత్వానికి సరైన వేదికలను అందించడం.మహిళా నాయకత్వం: మాటాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం.ఈ కార్యక్రమంలో 'మాటా' 2026 మహాసభ (MATA Convention) నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇది తెలుగు సంస్కృతి, వ్యాపారం, యువజన నాయకత్వం, మహిళా సాధికారత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రాముఖ్యత కలిగిన సమ్మేళనం కానుంది. అలాగే, ఇదే వేదికపై 'మాటా ముచ్చట' అనే త్రైమాసిక వార్తా పత్రిక ప్రారంభించారు. ఇది సంస్థ విజయాలను, భవిష్యత్తు కార్యక్రమాలను సభ్యులకు తెలియజేస్తుంది.ఎగ్జిక్యూటివ్ కమిటీ: ప్రెసిడెంట్: రమణ కృష్ణ కిరణ్ దుద్దగి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: ప్రవీణ్ గూడూరు, సెక్రటరీ: విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్: శ్రీధర్ గూడాల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నగేష్ చిలకపాటి, నేషనల్ కోఆర్డినేటర్: టోనీ జన్ను, జాయింట్ సెక్రటరీ: రాజ్ ఆనందేషి, కోమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్: స్వాతి కళ్యాణ రెడ్డి, ప్రోగ్రామ్స్ & ఈవెంట్స్ డైరెక్టర్ బెల్లంకొండ, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్: మహేందర్ నరాల, అడిషనల్ సెక్రటరీ: శ్రీధర్ పెంట్యాల, స్పిరిచువల్ & మెంబర్షిప్ డైరెక్టర్: శిరీషా గుండపనేని, హెల్త్ & వెల్నెస్ డైరెక్టర్: డా. సరస్వతి లక్కసాని, పబ్లిసిటీ పీఆర్ మీడియా: ప్రశాంత్ శ్రీపేరంబుదురు, స్పోర్ట్స్ డైరెక్టర్: సురేష్ ఖజానీ, ఇండియా కోఆర్డినేటర్: డాక్టర్ విజయ్భాకర్ బొలగాం.బోర్డు అఫ్ డైరెక్టర్స్: మల్లిక్ బొల్లా, శ్రీనివాస్ తాటిపాముల, శ్రీనివాస్ గండె, ప్రసాద్ వావిలాల, విజయ్ గడ్డం, రామ్ మోహన్ చిన్నాల, బిందు గొంగటి, హరికృష్ణ నరుకుళ్లపాటి, జ్యోతి బాబు అవుల (జేబీ), బాబా సొంటియాన, రంగ సూరా రెడ్డి, మహేంద్ర గజేంద్ర.హానోరారి అడ్విసోర్స్: డాక్టర్ స్టాన్లీ రెడ్డి, దాము గేదెల, ప్రసాద్ కునిశెట్టి, పవన్ దర్శి, జైదీప్ రెడ్డి, శేఖర్ వెంపరాల, డాక్టర్ హరి ఎప్పనపల్లి, ప్రేమ రొద్దం, బాబురావు సామల, వెంకటేష్ ముత్యాల, నందు బలిజ, డాక్టర్ సునీల్ పారిఖ్, అనిల్ గ్రాంధి, బాలాజీ జిల్లా, రఘు వీరమల్లు, గంగాధర్ వుప్పల. తదితరులు బాధ్యతలు స్వీకరించారు.ఈ వేడుకలో 250 మందికి పైగా సభ్యులు పాల్గొని కొత్త నాయకత్వ బృందానికి మద్దతు తెలిపారు. 'మాటా' వ్యవస్థాపకులు, సలహా మండలి, గౌరవ సలహాదారులు, కార్యవర్గం, బోర్డు సభ్యులు, ప్రాంతీయ ప్రతినిధులు, ఇతర నాయకులు ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా 'మాటా' కొత్త బోర్డు సభ్యులు.. "మనం కలిసే ఎదుగుదాం, మనం కలిసి మార్పు తీసుకువద్దాం..! జయహో మాటా..!" అంటూ నినదించారు. 'మాటా' సేవ, సంస్కృతి, సమానత్వం అనే ప్రధాన విలువలను పాటిస్తూ, అమెరికాలోని తెలుగు సమాజానికి మరింత మద్దతుగా నిలిచేందుకు కృషి చేస్తోంది. -
ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు
ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్‌కామ్ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్ (Israel) నిర్మాణ రంగంలో ఉపాధి కోసం వెళ్లిన నిరుద్యోగులు.. అక్కడ పనులు దొరక్క తీవ్రఇక్కట్లు పడుతున్నారు. ఇజ్రాయెల్ లోని నిర్మాణరంగంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు చైనాకు చెందినవారు కావడంతో భారతీయ కార్మికులు అనగానే పనులు లేవంటూ తిప్పి పంపుతున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాణ రంగంలో మల్టిపుల్ నైపుణ్యాలు (Multiple Skills) లేని కారణంగానే వారికి పనులు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్య తీవ్రతను ఇజ్రాయెల్‌లోని భారత రాయబార సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు కూడా చేతులు ఎత్తేసినట్టు సమాచారం.తాము పని కల్పించలేమంటూ కార్మికులే పని వెతుక్కోవాలని వారు సూచిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. కార్మికులు వెళ్లిన కన్స్ట్రక్షన్ కంపెనీ పరిధిలో పనులు దొరకని పక్షంలో ఆ కంపెనీని వదిలి బయటకు వెళ్లి రెఫ్యూజీలుగా (Refugees) పని చేసుకుందామంటే ఇజ్రాయెల్ దేశ చట్టాలు కఠినంగా ఉన్నాయి. దీంతో ఆ అవకాశమే లేకుండా పోయింది.పాలస్తీనాకు బ్రేక్ వేయడంతో... ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందినవారు అధిక సంఖ్యలో ఉపాధి పొందేవారు. అయితే ఈ రెండు దేశాల మధ్య పోరు కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్.. పాలస్తీనా వలస కార్మికుల రాకపోకలకు బ్రేక్ వేసింది. ఫలితంగా ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు ఎక్కువగా ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. దీంతో ఆ దేశంలో కార్మికులుగా పనిచేసేందుకు పరాయి దేశస్తుల అవసరం ఎంతో ఉంది.ఈ నేపథ్యంలో వలస కార్మికులకు దండిగా వీసాలను జారీ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇజ్రాయెల్‌లో వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆ దేశం జారీ చేస్తున్న వీసాల ప్రక్రియలో దళారుల జోక్యాన్ని నివారిస్తూ టామ్ కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్) చర్యలు తీసుకుంది. టామ్‌కామ్ ఇజ్రాయెల్ వీసాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించి తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు వీసాలు కేటాయించి ఇజ్రాయెల్‌కు పంపించారు. నిర్మాణ రంగంలో అనుభవం లేని కార్మికులు హైదరాబాద్‌లోనే టామ్‌కామ్, న్యాక్ (నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్) సంస్థల ఆధ్వర్యంలో వలస కార్మికుల రిక్రూట్ చేపట్టారు. అయితే ఈ కార్మికులకు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం పెద్దగా లేని కారణంగా ఇజ్రా యెల్లో కాంట్రాక్టర్లు వారిని నిరాకరిస్తున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన కార్మికులు సివిల్, కరెంట్, టైల్స్, ప్లంబింగ్ లాంటి మల్టిపుల్ పనులు చేయడంలో నిష్ణాతులుగా ఉండటంతో అక్కడి కాంట్రాక్టర్లు వారికే ప్రాధాన్యం ఇస్తూ భారతీయ కార్మికులకు పనిఇవ్వడం లేదని తెలుస్తోంది.చదవండి: ‘అనాబ్ – ఎ–షాహి’ ఎక్కడోయి ?పరిస్థితి ఇలాగే ఉంటే కుటుంబపోషణ కోసం అప్పులు చేసి దేశం కాని దేశంలో తాము ఇక్కట్లు పడటమే కాకుండా తమ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు తెచ్చినట్టు అవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇజ్రాయెల్‌లోని రాయబార సంస్థ అధికారులతో మాట్లాడి తమకు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
ఫ్రాన్స్ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్త
పారిస్: మూడు రోజుల ఫ్రెంచ్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడంతో ఇప్పుడు అందరి దృష్టి పారిస్ వైపు మళ్లింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. అధ్యక్షుడు మాక్రాన్‌తో కీలక రక్షణ, అణు ఇంధన ఒప్పందాలపై సంతకాలు చేసి భారత్ –ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి అనుకూలమైన విద్యార్థి వీసా, వర్క్ పర్మిట్లను పారిస్ ప్రకటిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.ఇంతకుముందు బిగ్ ఫోర్‌గా పేరుగాంచిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా దేశాలు భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తొలు నాలుగు గమ్యస్థానాలుగా ఉండేవి. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మారింది. యూరప్ దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్ భారతీయ విద్యార్థులకు టాప్ చాయిస్‌గా మారింది. హెచ్ఈసీ పారిస్ బిజినెస్ స్కూల్, సోర్బోన్ విశ్వవిద్యాలయం, ఎకోల్ పాలిటెక్నిక్ వంటి 75 కి పైగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, వ్యాపారం, కళలు, సాంకేతికత, శాస్త్రాలలో అగ్రశ్రేణి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య పట్ల భారతీయ విద్యార్థులకు మక్కువ ఎక్కువైంది.2023–24 విద్యా సంవత్సరంలో 7,344 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లోని విద్యాసంస్థల్లో చేరారు. 2030 నాటికి ఈ సంఖ్య 200 శాతం పెరుగుతుందని అంచనా. 2024 జనవరిలో రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతీయ విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. 2030 నాటికి భారత్ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించడమే తమ దేశ లక్ష్యమని ఆనాడు మాక్రాన్ తన మనసులో మాట చెప్పారు. ఇటీవల వేలాది మంది భారతీయ విద్యార్థులతో అభిప్రాయాలతో రూపొందిన క్యూఎస్ నివేదిక ప్రకారం ఫ్రాన్స్ తమ ఇష్టమైన గమ్యస్థానమని 31 శాతం మంది భారతీయ విద్యార్థులు చెప్పడం విశేషం. భారతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది ఫ్రాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 21 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు.ఫ్రెంచ్ నేర్చుకుంటే.. ట్రంప్ రాకతో మారిన అమెరికా విధానాలు, నిజ్జర్ ఉదంతంతో భారత్–కెనడా మధ్య సత్సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ తన వీసా ప్రక్రియలను సరళతరం చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఫ్రెంచ్‌తోపాటు ఇంగ్లీష్ భాషలోనూ కోర్సులను అందిస్తోంది. అంతర్జాతీయ తరగతుల ద్వారా ఫ్రెంచ్ బోధిస్తూ అది పూర్తి చేసిన వారికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు అనుమతిస్తోంది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ఫ్రెంచ్ భాషలో బోధించే 200కి పైగా విద్యా కార్యక్రమాల్లో అవకాశం లభిస్తుంది. అనేక ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండి, ఫ్రాన్స్‌లో ఒక సెమిస్టర్ చదివిన భారతీయ విద్యార్థులు ఐదేళ్ల షార్ట్–స్టే స్కెంజెన్ వీసా పొందేందుకు అర్హులు అవుతారు. ఫ్రెంచ్ మాస్టర్స్ డిగ్రీతో పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పోస్ట్–స్టడీ వర్క్ వీసాను కూడా ఫ్రాన్స్ అందిస్తుంది. ఈ వీసాను మొత్తం రెండేళ్లపాటు జారీ చేస్తారు. దీంతో భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.ఖర్చు తక్కువ..భారతీయ విద్యార్థులను ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాల వైపు నడిపించిన అంశాలు అనేకం ఉన్నాయి. ఫ్రెంచ్ ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయి. బిజినెస్, డేటా అనలిటిక్స్, ఫ్యాషన్‌తోపాటు విస్తృతమైన కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య ఖర్చు మిగతా బిగ్‌ఫోర్ దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉంటాయి. చార్పాక్, ఈఫిల్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ వంటి అనేక ఆర్థిక సహాయ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు. భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 15 కోట్ల రూపాయలకు పైగా ఉపకార వేతనాలను ఫ్రాన్స్ అందిస్తోంది. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం కూడా తక్కువే. పారిస్‌లో నెలకు సగటున రూ.1.54 లక్షలు, లియోన్‌లో రూ.1.01 లక్షలు వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇతర నగరాల్లో సగటు జీవన వ్యయం నెలకు లక్ష రూపాయల కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాలు చాలా మంచి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. -
Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్‌ను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాల అమలుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.ట్రంప్ బాధ్యతలు చేపట్టి, తొలి రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్‌మన్ బుధవారం తీర్పు ఇచ్చారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రణాళికలకు ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.కాగా బర్త్‌రేట్ సిటిజిన్ షిప్ ఆర్డర్ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.Birthright Citizenship అంటే ఏంటి?అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్‌లు పడినట్టే.ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికేH-1B (వర్క్ వీసాలు)H-4 (డిపెండెంట్ వీసాలు)L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)F (స్టూడెంట్ వీసాలు) ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ -
ఆకాశ్ బొబ్బ.. వీడు మాములోడు కాదు!
ఆకాశ్ బొబ్బ.. ఎవరీ కుర్రాడు? ఇప్పుడు ఇంటర్నెట్ అంతా అతని గురించే వెతికే పనిలో ఉంది. ఇలాన్ మస్క్ నేతృత్వంలో నడవబోయే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) విభాగంలో ఈ భారత సంతతికి చెందిన కుర్రాడికి చోటు దక్కింది. అందుకే అతని గురించి ఆరా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు.అకాశ్ బొబ్బ(Akash Bobba).. 22 ఏళ్ల యువ ఇంజినీర్. డోజ్ నిర్వహణ కోసం మస్క్ ఆరుగురు యువ ఇంజినీర్లను ఎంచుకోగా.. అందులో ఆకాశ్ ఒకడు. అయితే డోజ్‌కు ఇతన్ని మస్క్ ఎంచుకున్నాడని తెలియగానే.. లింక్డిన్ సహా ఎక్కడా అతని గురించి సమాచారం లేకుండా చేశారు. కానీ, ఈలోపే సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలతో అతని ప్రయాణం గురించి బయటకు వచ్చేసింది.కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్, ఎంట్రాప్రెన్యూర్షిప్, టెక్నాలజీ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ చేశాడు ఆకాశ్. ఆపై మెటాలో ఏఐ మీద, పలాన్టిర్లో డాటా అనలైటిక్స్ మీద, బ్రిడ్జ్‌వాటర్ అసోషియేట్స్లో ఫైనాన్షియల్ మోడలింగ్ మీద ఇంటర్న్ చేశాడు. అయితే అతని పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్నా.. ఆ మాజీ క్లాస్మేట్ ఒకరు పంచుకున్న విషయం ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. కాలేజీ రోజుల్లో బృందంలోని సభ్యుడి తప్పిదంతో ప్రాజెక్టు మొత్తం డిలీట్ అయ్యిందట. సమయం పెద్దగా లేకపోవడంతో బృందం మొత్తం కంగారుపడుతోందంట. ఆ టైంలో .. ఆ రాత్రి రాత్రే సోర్స్ కోడ్‌ను ఉపయోగించకుండానే తిరిగి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని .. అంతకు ముందు కంటే బెటర్‌గా రూపొందించాడు ఆకాశ్. ఆ టైంలో అతని కోడింగ్ సామర్థ్యం చర్చనీయాంశమైందని అతని స్నేహితుడు చెబుతున్నారు . Let me tell you something about Akash. During a project at Berkeley, I accidentally deleted our entire codebase 2 days before the deadline. I panicked. Akash just stared at the screen, shrugged, and rewrote everything from scratch in one night—better than before. We submitted…— Charis Zhang (@gmchariszhang) February 3, 2025ప్రభుత్వ ఖర్చులున గణనీయంగా తగ్గించేందుకు ఇలాన్ మస్క్(Elon Musk) సారథ్యంలో ఏర్పాటైందీ విభాగం. డోజ్‌లో కీలక బాధ్యతల కోసం ఆకాశ్‌తో ఆరుగురిని మస్క్ ఎంచుకున్నాడు. అయితే ఆకాశ్ తల్లిదండ్రులెవరు? భారతీయ మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాళ్లంతా 19-24 ఏళ్లలోపు కుర్రాళ్లే. అందులో ఓ విద్యార్థి సైతం ఉన్నాడు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం.. అందునా కీలకమైన బాధ్యతలకు ఏమాత్రం అనుభవం లేనివాళ్లను ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. యూఎస్ ఎయిడ్ నుంచి కీలక సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేశారంటూ డోజ్ సిబ్బందిపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక.. ఇలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలు అంతిమం కాదని, వాటికి తమ అనుమతి తప్పనిసరి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది. -
US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ జెట్, యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారిలో భారతీయు యువతి ఉండటం విషాదాన్ని నింపింది. 2001 తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో భావిస్తున్న ఈ ఉదంతంలో 67 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అమెరికా రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన26 ఏళ్ల అష్రాహుస్సేన్ రజా (Ashra Hussain Raja) కూడా చనిపోయారు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె భర్త, హమాద్ స్నేహితుల మధ్య శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ విమానం అవుతుందనగా ఈ ఘోరం జరిగింది.భారతీయ వలసదారుల కుమార్తె అయిన హుస్సేన్ రజా 2020లో ఇండియానా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది .ఆగస్టు 2023లో స్నేహితుడు హమాద్ను ప్రేమ వివాహం చేసుకుంది. వాషింగ్టన్ డీసీలో కన్సల్టెంట్‌గా (consultant in Washington, DC)ఉద్యోగం చేస్తున్నారని ఆమె మరణం తమకు తీరని లోటని ఆమె మామ డాక్టర్ హాషిమ్ రాజా(Dr.Hashim Raja) విషాద వదనంతో చెప్పారు. విద్యాపరంగా చాలా తెలివైనది. అద్భతుంగా వంట చేస్తుంది. నా కొడుకుకు ప్రాణ స్నేహితురాలు" అని అస్రా హుస్సేన్ మామ హషీమ్ రజా అన్నారు. వైద్యుడిగా చాలామందికి వైద్యం చేశాను, సలహాలిచ్చాను చాలా మరణాలను చూశాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఆమె అక్కడ ఒక ఆసుపత్రి కోసం టర్నరౌండ్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి నెలకు రెండుసార్లు విచితకు ప్రయాణించిందని చెప్పారు. తన కెరీర్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నైట్ షిప్ట్‌లలో మేల్కొని ఉండేందుకు తరచుగా తనకి ఫోన్ చేసేదని, అందరి కోసం ఆలోచించేదని .ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించేది” అని ఆయన తెలిపారు. మరోవైపు భార్య అష్రా తనకు పంపిన మెసేజ్‌ను తలుచుకుంటూ భర్త హమాద్ రాజా కన్నీరు మున్నీరవుతున్నారు. “మేం 20 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాం” అని ఆమె మెసేజ్ చేసిందని, ఆమె కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు చూస్తుండగానే అంతా జరిగిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇదంతా ఒక పీడకలలా ఉంది” అంటూ హమాద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిజానికి ఒక రోజు ఆమె రావాల్సి ఉంది.. కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. ఇందుకేనేమో అంటూ కంటతడిపెట్టుకన్నారు. ఇలాంటి ప్రమాదాల గురించి వినడమేగానీ,తమ జీవితాల్లో ఇంత విషాదం ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ విలపించారు. -
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో వాసవీ మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆర్తజన బాంధవి, ఆశ్రీతకల్పవల్లి, లలితా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘ శుద్ధ విదియ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.వందమందికి పైగా వాసవి మాత భక్తులు ,కార్యక్రమ నిర్వాహక సభ్యులు, స్థానిక VHCCI ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా విశ్వశాంతి కొరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమము, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. వివిధరకాల పుష్పాలతో అమ్మవార్ని అలంకరించారు. పల్లకి సేవ అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజలు, అష్టోత్తరం, లలిత సహస్రనామ పఠనము, సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు.హాజరైన భక్తులందరికీ ఆంధ్రాభవన్, ఇండియన్ వైబ్, తాలి రెస్టారెంట్, రుచి రెస్టారెంట్స్ నుండి రుచికరమైన నోరూరించే వంటకాలతో అందరికి బోజనాలను వడ్డించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు శ్రీనివాస్ వెచ్చ, శిరీష, సంతోష్ కుమార్ పారేపల్లి, శ్రీనివాస్ సూడా, శృతి ముత్తుకుమార్, బాలాజీ జ్యోత్స్నా, రేణుక దినేష్, నితేశ్ గుప్తా, రఘు వల్లంకొండ, ప్రవీణ్ మదిరే, వెంకట్ జూలూరి లకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు, కార్యక్రమ పురోహితులు సాయి ప్రజ్వల్ ద్వారా సత్కరించి అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. తరువాత అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో కావ్య , దివ్య , లావణ్య, , రేణుక మరియు శిరీష తదితరులకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.తరువాత కార్యక్రమంలో నిర్వాహక సభ్యులైన నవీన్ సంతోష్, నరేంద్ర, భార్గవ్, శ్రీనివాస్ వెచ్చ మరియు మాణిక్ అందరు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరగాలని కోరుకున్నారు. చివరిగా ఆలయ సభ్యులైన రమణ, సాగర్ తదితరులకు సభ్యులందరు కృతఙ్ఞతలు తెలియజేసారు, నిర్వాహక సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా సంతోష్, సాయి తేజ, సందీప్, ప్రఫుల్ల, సుధీర్, సంపత్ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ యువకుడు మృతి
ఖైరతాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్ వాజిద్ దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో నివసించే మహ్మద్ అజీజ్ జలమండలి ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు మహ్మద్ వాజిద్ (28) 2021లో ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. వాజిద్ తమ్ముడు మహ్మద్ మాజిద్ కూడా అక్కడే ఎంఎస్ చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మాజిద్ అనారోగ్యం బారిన పడటంతో మందులు తీసుకువచ్చేందుకు వాజిద్ కారులో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కారును ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి చేసే యోచనలో ఉండగానే.. మహ్మద్ వాజిద్‌కు ఈ ఏడాది డిసెంబర్లో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉండగానే.. అతని మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను అమెరికా రావాలంటూ వాజిద్ వారం రోజుల క్రితం వీసా కూడా పంపించినట్లు సమాచారం. వారు రెండు మూడు రోజుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే కుమారుడి మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలోనే వాజిద్ అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మహ్మద్ వాజిద్ గతంలో ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ లీడర్‌గా పని చేశాడని, ప్రస్తుతం అమెరికాలో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. ఎంఎస్ మక్తాలోని వాజిద్ కుటుంబ సభ్యులను ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పరామర్శించారు. -
డల్లాస్‌లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సాస్, అమెరికా: అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన వందలాదిమంది ప్రవాసభారతీయుల ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగాయి.మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల హాజరైన వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ “చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయలకు కృతజ్ఞతలు అన్నారు. అవతారిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, మొత్తం 251 పేజీలఉన్న రాజ్యాంగం భారతదేశ పరిపాలనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం అని దీనిలో ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వసంస్థల విధులు, పౌర హక్కులు వివరంగా పేర్కొనబడి ఉన్నాయన్నారు. 1950లో జనవరి 26న అమలులోకి వచ్చిన ఈ రాజ్యంగ రచన వెనుక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించిన బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా పనిచేసిన సర్ బెనెగళ్ నర్సింగరావు (బి.ఎన్ రావు) కృషి, ముసాయిదా కమిటీకు చైర్మన్ గా విశేష సేవలందించిన బీ.ఆర్ అంబేడ్కర్ మరియు వారి కమిటీ సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, కే.ఎం మున్షి, మహ్మద్ సాదుల్లా, బీ.ఎల్ మిట్టర్, డీ.పీ ఖైతాన్ లు అభినందనీయులు అన్నారు.ప్రధాని నెహ్రు అభ్యర్ధన మేరకు ప్రముఖ చేతివ్రాత నిపుణుడు ‘ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా’ తన సొంత దస్తూరితో ఆరునెలల పాటు శ్రమించి హిందీ, ఆంగ్ల భాషలలో వ్రాసిన మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, దీని అసలు ప్రతిని ఇప్పటికీ పార్లమెంట్ గ్రంథాలయంలో అందరూ చూడవచ్చు అని అన్నారు.”ఎంతో కోలాహలంగా మాతృదేశభక్తి స్ఫూర్తి తో జరిగిన ఈ వేడుకలలో మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కో-ఛైర్మన్ తయాబ్ కుండావాలా, రాజీవ్ కామత్, కార్యదర్శి రావు కల్వాల, బోర్డ్ సభ్యులు బి.యెన్. రావు, మహేంద్ర రావు, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకలు, వివిధ సంఘాల ప్రతినిధులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు తొలి షాక్ తగిలింది. ఆయన జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు విషయంలో చుక్కెదురైంది. జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది. దీంతో జన్మతః పౌరసత్వం చట్ట రద్దుతో బెంబేలెత్తుతున్న భారతీయులకు (NRI) భారీ ఊరట లభించింది. జన్మహక్కు పౌరసత్వాన్ని (birthright citizenship) రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును గురువారం యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నిలిపివేశారు. "ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు" అని న్యాయమూర్తి జాన్ కఫ్నౌర్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ దీనిపై "అప్పీల్" చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ట్రంప్ ఉత్తర్వు ఎవరికి వర్తిస్తుంది?ఫిబ్రవరి 19 తర్వాత ఆ ఉత్తర్వు తేదీ నుండి 30 రోజుల తర్వాత యుఎస్‌లో జన్మించిన వ్యక్తులకు మాత్రమే 14వ సవరణ యొక్క ఈ కొత్త వివరణ వర్తిస్తుంది.ట్రంప్ ఆదేశంఅమలులోకి వస్తే ఏటా 1.5 లక్షలకు పైగా నవజాత శిశువులకు పౌరసత్వం నిరాకరించబడుతుందని డెమొక్రాటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు నివేదించాయని రాయిటర్స్ తెలిపింది.ఇది భారతీయులను ఎలా ప్రభావితం చేస్తుంది?అమెరికా పౌరసత్వం పొందడానికి మార్గంగా ఉపయోగించే బర్త్‌రైట్ సిటిజెన్షిప్ రద్దు భారతీయ కుటుంబాలపై చాలా ప్రభావం పడుతుంది. ట్రంప్ ఆదేశం అమల్లోకి వస్తే, ఎన్ఆర్ఐ పిల్లలు అమెరికాలో ఉండేందుకు వేరే మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దాదాపు 5.2 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్లు రెండో అతిపెద్ద వలసదారుల గ్రూప్‌గా ఉన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గత సంవత్సరం ప్రచురించిన మరో నివేదిక ప్రకారం 2022 నాటికి అమెరికాలో 2.2 లక్షల మంది అనధికార భారతీయ వలసదారులు నివసిస్తున్నారని అంచనా వేసింది. ఇది 2018లో 4.8 లక్షలలో సగం కంటే తక్కువ.జనవరి 20న, 47వ యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులతీసుకొస్తానన్న వాగ్దానం చేసిన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వు ప్రకారం, పత్రాలు లేని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్ పౌరసత్వానికి అర్హులు కారు.కాగా 1868 నుంచేఅమెరికాలో ఈ చట్టం అమల్లో ఉంది.దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్ధుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. -
USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
వాషింగ్టన్: మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది బాధ్యతలు స్వీకరించారు. 2025–2026 సంవత్సరాల పదవీకాలానికి కొత్తగా ఎన్నికైన బోర్డ్ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, సలహా మండలి చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో-ఛైర్మన్ డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోల్ల, సభ్యుడు భరత్ రెడ్డి మాదాది, అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.బోర్డ్ సభ్యులుగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది, డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, కవితా రెడ్డి, సహోదర్ పెద్దిరెడ్డి, డా. దివాకర్ జంధ్యం, శివారెడ్డి కొల్ల, మనోహర్ బొడ్కె, ప్రదీప్ మెట్టు, సురేశ్ రెడ్డి వెంకన్నగరి, నిశాంత్ సిరికొండ, అమిత్ రెడ్డి సురకంటి, గణేశ్ మాధవ్ వీరమనేని, స్వాతి చెన్నూరి, ఉషారెడ్డి మన్నం, సంతోష్ గంటారం, నరసింహ పెరుక, కార్తిక్ నిమ్మల, శ్రీకాంత్ రెడ్డి గాలి, అభిలాష్ రెడ్డి ముదిరెడ్డి, మయూర్ బండారు, రంజిత్ క్యాతం, అరుణ్ రెడ్డి అర్కల, రఘునందన్ రెడ్డి అలుగుబెల్లి, దిలీప్ వాస, ప్రదీప్ బొద్దు, ప్రభాకర్ మదుపాటి, నరేంద్ర దేవరపల్లి, ప్రవీణ్ సామల, ప్రవీణ్ చింట, నరేశ్ బైనగరి, వెంకట్ అన్నపరెడ్డి కొత్తగా బోర్డ్ సభ్యులుగా నియమితులయ్యారు.మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ రెడ్డికి, బోర్డు సభ్యులకు స్వదేశం, స్వరాష్ట్రం నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందుతున్నాయి. నవీన్ రెడ్డి ఉద్యోగిగా అమెరికాలో అడుగుపెట్టి, కన్సల్టింగ్ కంపెనీలు, మీడియా, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లతో పాటు అనేక ఇతర సంస్థలను స్థాపించి, ఎన్నో విజయాలు అందుకుంటూ, తెలుగు వారికి గర్వకారణంగా నిలుస్తున్నారంటూ ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. -
ట్రంప్, జేడీ వాన్స్ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇక, జేడీ వాన్స్ ప్రమాణం సందర్భంగా ఆయన పక్కనే తన భార్య ఉషా వాన్స్(Usha Vance) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ఆనందంతో ఉప్పొంగిపోయారు. సాధారణంగా అధ్యక్షుడి కంటే ముందు ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలోనే తొలుత అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భార్య ఉషా చిలుకూరి, పిల్లలు ఆయన పక్కనే నిల్చుని ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జేడీ వాన్స్.. తన సతీమణి ఉషా చిలుకూరి ప్రేమగా ముద్దిచ్చారు.ఇక, ప్రమాణం సందర్బంగా జేడీ వాన్స్..‘విదేశీ, దేశీయ శత్రువులందరికీ వ్యతిరేకంగా.. నేను యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగానికి మద్దతు ఇస్తానని, దానిని రక్షించుకుంటానని నేను గంభీరంగా ప్రమాణం చేస్తున్నాను. నేను అమెరికా రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటాను. ఎటువంటి మెంటల్ రిజర్వేషన్ లేదా ఎగవేత ఉద్దేశ్యం లేకుండా.. నేను ఈ బాధ్యతను స్వేచ్ఛగా తీసుకుంటాను. నేను ప్రవేశించబోయే పదవి విధులను నేను చక్కగా, నమ్మకంగా నిర్వర్తిస్తాను అని అన్నారు.Having a woman who looks into your eyes with the trust and faith that J.D. Vance's wife, Usha, does is truly beautiful. It's a wonderful day for such a lovely family. pic.twitter.com/QviCXTK9PO— Kish (@kish_nola) January 20, 2025ఇదిలా ఉండగా.. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ భారత సంతతికి చెందినవారు. ఆమెకు తెలుగు మూలాలు కూడా ఉన్నాయి. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. వారు సుదీర్ఘ కాలం కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఉషా చిలుకూరి అక్కడే జన్మించారు. 1986లో కాలిఫోర్నియాలో జన్మించిన ఉషా చిలుకూరి.. శాన్ డియాగో శివారులో పెరిగారు. ఆమె రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు.జేడీ వాన్స్‌తో పరిచయం..2013లో జేడీ వాన్స్‌ను ఉషా చిలుకూరి కలిశారు. వారు కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికాపై చర్చా సమూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. ఆ తర్వాత వారు 2014లో వివాహం చేసుకున్నారు. ఒక హిందూ పూజారి సమక్షంలో నిర్వహించిన వేడుకలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జేమ్స్ డేవిడ్ వాన్స్-ఉషా చిలుకూరి వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవాన్, వివేక్, మిరాబెల్.Vice President JD Vance and Second Lady Usha joined President Trump and First Lady Melania for an inaugural ball dance. I’m crying 🥹❤️🇺🇸pic.twitter.com/vqLtMpB2sy— Jane Carrot (@JanecheersJazz) January 21, 2025 -
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువులు, ఉన్నతమైన జీవితం కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ దుండగుల కాల్పులకు బలయ్యా డు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన రవితేజ.. మాస్టర్స్ చదివేందుకు 2022లో అమెరికాకు వెళ్లాడు. వాషింగ్టన్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొడుకు మృతిచెందాడన్న వార్త తల్లిదండ్రులను కలచివేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెంకు చెందిన కొయ్యడ చంద్రమౌళి–సువర్ణ దంపతులు కొంతకాలం నుంచి ఆర్కే పురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రమౌళి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు రవితేజ (26), ఒక కుమార్తె ఉన్నారు. రవితేజ ప్రస్తుతం కనెక్టికట్‌లో ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కారు అద్దెకు తీసుకొని కేక్ డెలివరీ చేయడానికి వెళ్లారు. అయితే, దుండగులు అప్పటికే చోరీకి పాల్పడి.. పారిపోయే క్రమంలో రవితేజ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. రవితేజ ఎంతసేపటికీ తిరిగి రెస్టారెంట్‌కు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టిన లొకేషన్‌కు వెళ్లి చూడగా రవితేజ మృతదేహం కనిపించింది. ఈ సమాచారాన్ని సోమవారం తెల్లవారుజామున రవితేజ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రవితేజ సోదరి ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రీన్‌హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను మాస్టర్ డిగ్రీ పట్టా అందుకునే కార్యక్రమానికి రావాలని రవితేజ తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్‌పోర్ట్, వీసా తీసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇంతలోనే కుమారుడు మృతి చెందడంతో వారు విషాదంలో మునిగిపోయారని బంధువులు చెప్పారు. డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడుతాను గత శనివారం కొడుకుతో మాట్లాడానని చంద్రమౌళి చెప్పారు. తనకు త్వరలోనే మంచి జాబ్ వస్తుందని... మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడన్నారు. త్వరలోనే నీకు మంచి గిఫ్టు ఇస్తానన్నాడని, అయితే అది ఇదేనా అంటూ ఆయన భోరున విలపించారు. తన కొడుకు మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు వచ్చేలా చూడాలని చంద్రమౌళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. రవితేజ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి సహాయం చేస్తానని చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది. -
ట్రంప్ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి.. కారణం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తప్పుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విషయాన్ని వెల్లడించారు. ఇందుకు కారణం మాత్రం వెల్లడించలేదు.భారత సంతతి వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఎలాన్ మస్క్‌తోపాటు వివేక్ రామస్వామిని ఈ బాధ్యతల్లో నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఒహైయో గవర్నర్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్బంగా వివేక్ రామస్వామి.. డోజ్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడంలో ఎలాన్ మస్క్ బృందం విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒహియోలో నా భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలో నేను మరిన్ని చెప్పాలి. ముఖ్యంగా, అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన నిర్ణయం ఆసక్తికరంగా మారింది.It was my honor to help support the creation of DOGE. I’m confident that Elon & team will succeed in streamlining government. I’ll have more to say very soon about my future plans in Ohio. Most importantly, we’re all-in to help President Trump make America great again! 🇺🇸 https://t.co/f1YFZm8X13— Vivek Ramaswamy (@VivekGRamaswamy) January 20, 2025ఇదిలా ఉండగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిరోజే దాదాపు 100కుపైగా కార్యనిర్వాహక ఆదేశాల (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల)పై సంతకాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పేర్కొనే ఈ ఆదేశాల ప్రాధాన్యం, వాటి అమలు గురించిన అంశాలను పరిశీలిస్తే.. అమెరికా చట్టసభ ఆమోదం లేకుండా సమాఖ్య ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఇందులో ఉంటాయి.కేంద్ర సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం లేదా నివేదికలను కోరడం వంటివి ఉండవచ్చు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఆ దేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడిదే. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. చట్టసభ ఆమోదం లేకుండా జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉన్నా.. వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదేశాలను వ్యతిరేకించ లేనప్పటికీ.. ఆ నిర్ణయాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం లేదా ఇతర అడ్డంకులు సృష్టించడం ద్వారా వీటి అమలుకు ‘కాంగ్రెస్’ ఆటంకం కలిగించే వీలుంది. మునుపటి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి ఈ ఎగ్జిక్యూటివ్‌ను కొత్త అధ్యక్షుడు ఉపయోగించే అవకాశం ఉంది. -
హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ : వాళ్లకి నష్టం, భారతీయులకు ఇష్టం!
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కొత్త నియమాలు ఈ రోజు (జనవరి 17, 2025) అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కీలకమైన, మంచి వేతనాలను అందుకునే ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వారి ఉద్యోగ స్థితి ఆధారంగా అమెరికాలో ఉండటానికి అనుమతి లభిస్తుంది.పదవీ విరమణ అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో తుది వలస విధాన సంస్కరణలలో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకీకరించడమే కాకుండా సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మాత్రమే మరిన్ని అవకాశాలందించే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు సమాచారం. దీని వల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ H-1B ఫైనల్ రూల్ , H-2 ఫైనల్ రూల్ ప్రకారం, H-1B నాన్-ఇమ్మిగ్రెంట్ , H-2 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ల నిబంధనలు మారతాయి. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించిన H-1B వీసా ప్రోగ్రామ్ మార్పులు భారతీయులకే ఎక్కువ.2023లో H-1B వీసా హోల్డర్లలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయ నిపుణులు ఉన్నందున, ఈ మార్పులు వారికే ఎక్కువప్రయోజనం చేకూరుస్తాయి.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) "H-1B తుది నియమం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా, ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడానికి మెరుగైన యజమానులను అనుమతించేందుకు H-1B ప్రోగ్రామ్‌ను ఆధునీకరిస్తుందని వెబ్సైట్లో అని పేర్కొంది. హెచ్-1బీ వీసా కీలక మార్పులు హెచ్-1బీ వీసా ప్రక్రియ మరింత సులభతరం అయ్యింది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను 'స్పెషాలిటీ ఆక్యుపేషన్' కింద నియమించుకోవడం కంపెనీలకు ఇక సులభతరం. కంపెనీలు వారి నిర్దిష్ట శ్రామిక శక్తి అవసరాల ఆధారంగా H-1B కార్మికులను నియమించుకోవచ్చు, F-1 విద్యార్థి వీసాల నుంచి హెచ్-1బీ వీసాలకు మారడం ఈజీ. ప్రాసెసింగ్ జాప్యం కూడా తగ్గుతుంది. యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.జనవరి 17, 2025 నుండి కొత్త రూల్ ప్రకారం ఫారం I-129 తప్పనిసరి అవుతుంది. హెచ్-1బీ వీసా ప్రక్రియను సరళీకృతం చేసే దిశగానే దీన్ని తీసుకొచ్చింది. అయితే మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించేందుకే ఈ మార్పులని విమర్శలు వినబడుతున్నాయి. హెచ్-1బీ వీసా మార్పులు అమెరికా ఉద్యోగులకు నష్టమని, అమెరికన్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని విమర్శించారు. మరోవైపు రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్పులను ఎంతవరకు అంగీకరిస్తారు? తిరిగి ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
తెలుగు, సాహితీ ప్రియులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!
తానా సంస్థ సాహిత్యవిభాగంగా మే, 2020 న ఆవిర్భవించిన “తానా ప్రపంచసాహిత్య వేదిక ‘నెలానెలా తెలుగువెలుగు’ పేరిట విభిన్న సాహిత్యాంశాలతో ప్రతినెల ఆఖరి ఆదివారం (భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 లకు) మేము నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలకు మీరు చూపిస్తున్న ఆదరణకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ విశేష ఆదరాభిమానాలు, సూచనలు, సలహాలతో “తానా ప్రపంచసాహిత్యవేదిక్ఙ నేడు ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మక అగ్రగామి సాహిత్యసంస్థగా రాణిస్తోంది. ఈ ఉన్నతస్థితికి ఎదగడానికి తోడ్పడిన తానా కార్యవర్గసభ్యులకు, కార్యకర్తలకు, సాహితీ ప్రియులకు, ప్రసారమాధ్యమాలకు మా వినమ్రపూర్వక ప్రణామములు. 2020 మే నెలలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గారి జానపద కార్యక్రమంతో ప్రారంభమైన మా ఈ తానా ప్రపంచసాహిత్యవేదిక అప్పటినుండి ఇప్పటివరకు అంటే డిసెంబర్ 31, 2024 వరకు 75 విభిన్న సాహిత్యాంశాలమీద, 360 గంటల 5 నిమిషాల 43 సెకండ్ల నిడివిగా సాగింది. పాల్గొన్న మొత్తం అతిథులు, సాహితీవేత్తలు, అవధానులు, రచయితలు, రచయిత్రులు, కవులు, కళాకారులు 1,625 మంది. ఈ మొత్తం 75 సాహిత్య కార్యక్రమాల గొలుసుకట్టు యూట్యూబ్ లంకెను ఈ క్రింద పొందుపరుస్తున్నాము. మీకు వీలున్నప్పుడు వీక్షించగలరు. https://www.youtube.com/watch?v=g5J-BD0XdCA&list=PL0GYHgMt2OQzhobYN7BUnlSR9LBS7Xlm8సాహిత్యాభివందనాలతో.. డా. ప్రసాద్ తోటకూర, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు; నిరంజన్ శృంగవరపు, తానా అధ్యక్షులు; చిగురుమళ్ళ శ్రీనివాస్, తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త. -
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు. తొలి పండగ, పెద్ద పండగ అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సంబరాలు అంబరాన్నంటుతాయి. స్థానికంగా ఉన్న తెలుగువారంతా ఒక్క చోట సంబరంగా వేడుకచేసుకుంటారు. సంక్రాంతి-2025 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పోటీలను నిర్వహించారు. పిల్లలకు డ్రాయింగ్ ఈవెంట్, పెద్దలకు కబడ్డీ పోటీలు, ఆడవారికి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఇంకా కైట్ ఫెస్టివల్‌తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జపాన్‌లో నివసించే తెలుగువారు, జపనీయులు కూడ పెద్ద ఎత్తున పాల్గొని సంతోషంగా గడిపారు.ఉద్యోగగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా తరువాతి తరం వారికి అందించే విధంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్( తాజ్-TAJ) నిరంతరం కృషిచేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.గత పదేళ్లుగా సంక్రాంతి డుకులను జరుపుకుంటూ వస్తున్నామని తాజ్ నిర్వాహకులు ప్రకటించారు. ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే కాకుండా, ప్రతీ తెలుగు పండుగను అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకుంటా మన్నారు. -
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్లు మన చుట్టూనే వై..ఫై లా తిరుగుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నమ్మించి నట్టేట ముంచేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలా 17జంటలకు టోకరా ఇచ్చిన ఒక ఎన్ఆర్ఐ మహిళా స్కామర్ పోలీసులకు చిక్కింది. ఆమె చేసిన ఫ్రాడ్ ఏంటి? పోలీసులు ఆమెను ట్రాక్ చేశారు? భారతీయ సంతతికి చెందిన ప్రీలిన్ మోహానాల్ (53) దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తోంది. వివాహాలను ప్లాన్ చేసుకోవాలనుకునే ప్రేమ జంటలను సోషల్ మీడియా ద్వారా వలవేసి పట్టుకునేంది. వారికి అందమైన వెడ్డింగ్ నేషన్స్ చూపిస్తానంటూ వారితో నమ్మబలికేది. ఆ స్థలంతో ఎటువంటి సంబంధం లేకుండా వేదిక కోసం పెద్ద మొత్తాలను ముందుగానే చెల్లించాలన పట్టుబట్టేది. సొమ్ములనురాబట్టేది. తీరా అక్కడికెళ్లాక విస్తుపోవడం ఖాళీ ప్లేస్ ప్రేమ జంట వంతయ్యేది. ఉనికిలో లేని, లేదా కనీస వసతులు కూడా లేని ప్రదేశాన్ని చూసి లబోదిబోమనేవారు. నీళ్లు, కరెంట్ కూడా లేకపోవడంతో వారి కలకాలం తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన పెళ్లి సందడి కాస్త జీవితంలో మర్చిపోలేనంత విచారకరంగా మారిపోయేది. ఇలా దక్షిణాఫ్రికా వ్యాప్తంగా ఒకే రోజు ఒకే వేదిక కోసం డబ్బులు తీసుకొని దేశవ్యాప్తంగా 17 జంటలను మోసం చేసింది. తమ వివాహాన్ని రద్దు చేసుకుని, ఈ సంవత్సరం చివరిలో తిరిగి ప్లాన్ చేసుకోవడానికి చాలాకష్టపడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.చివరికి పేరు చెప్పడానికి ఇష్టపడని జంట ఫిర్యాదుతో గుట్టు రట్టయింది. వీరు గత ఏడాది డిసెంబర్లో భద్రతా సంస్థ రియాక్షన్ యూనిట్ సౌత్ ఆఫ్రికా (RUSA) తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెను ట్రాక్ చేసి (జనవరి 7) అరెస్టు చేశారు. నిందితురాలు మోసానికి పాల్పడినట్లు ,ఆమెకు క్రిమినల్ రికార్డ్ ఉందని 20 సంవత్సరాలకు పైగా జరిగిన స్కామ్‌ల చరిత్ర ఉందని నిర్ధారించినట్టు రూసా ప్రతినిధి బలరామ్ చెప్పారు.మరోవైపు ఇది స్కామ్ కాదు, తాను స్కామర్‌ను కాదని ఆమె వాదిస్తోంది. కంపెనీ చాలా కష్టాలను ఎదుర్కొంది. ప్రతీ పైసా తిరిగి చెల్లిస్తానని ప్రతీ జంటకు లేఖలు పంపాననీ తెలిపింది. కానీ భాగస్వాములు అక్టోబర్‌లో వైదొలిగిన కారణంగా సకాలంలో తిరిగి చెల్లించలేకపోయానని స్థానికమీడియాకు తెలిపింది. తొమ్మిది జంటలకు సుమారు 60వేలు దక్షిణాఫ్రికా రాండ్ (రూ.2,72,319) బాకీ ఉందని అంగీకరించి, వాటిని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది.అయితే నేరాన్ని అంగీకరించి, బాధితులందరికీ తిరిగి చెల్లిస్తానని ఆమె న్యాయవాది, కుటుంబ సభ్యులు కేడా చెప్పడంతో ఆమె జైలు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలా నిర్ణయిస్తుందో చూడాలి. -
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది పైగా భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ భజనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంగణపతి, పూర్వాంగ పూజ , అయ్యప్ప స్వామి ఆవాహనంతో ప్రారంభమైంది. ఆ తరువాత సభ పాలక దేవత పూర్ణాంబికా సమేత శ్రీ ఆనందేశ్వరర్కు లఘున్యాసం, రుద్రాభిషేకం , రుద్రగణ పారాయణం జేశారు. తదనంతరం అయ్యప్ప స్వామికి సహస్రనామం, అష్టోత్ర అర్చన, చివరలో అయ్యప్పను కీర్తిస్తూ భజనలు చేశారు.ఈ కార్యక్రమములో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత విజయా మోహన్ తన బృందంతో తీర్చిదిద్దిన రంగవల్లి విశేషంగా ఆకట్టుకుంది. రంగవల్లిలో ఉపయోగించిన వివిధ రకాల రంగులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని దైవత్వాన్ని జోడించాయి.రాంకుమార్ బృందం నామసంకీర్తన భజనలు, కొంత మంది స్త్రీలు ప్రదర్శించిన కోలాట నాట్య ప్రదర్శన ప్రేక్షలకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమములో పాల్గొన్న భక్తులు ఎంతో తన్మయత్వంతో అయ్యప్పస్వామి భక్తి గీతాలను ఆలపించారు. సభా ట్రస్టీలలో ఒకరైన శంకర్ తాళాల (కంజీర) కళాకారుడిగా భజనలో పాల్గొనడం విశేషం.గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక పాయసం తయారు చేయడంలో అనుభవంవున్న రత్నం గణేష్ నేతృత్వంలోని బృందం పాలు, బెల్లం , కొబ్బరి పాలతో పాయసం తయారు చేసారు. గత 6 దశాబ్దాలకుపైగా వారసత్వంగా ఈ పాయసం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో యువతరం చురుకుగా పాల్గొనడం అత్యంత విశేషం .ఉత్తరాంగ పూజానంతరం పడి పాట్టుతో 18 మెట్లపై దీపాలు వెలిగించారు. శబరిమలై లో రోజు ముగింపు పాటగా పాడే ప్రసిద్ధ హరివరాసనంతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అతిరుద్రం కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన సభ స్వచ్చంద కార్యకర్తలు అయిన సురేష్ శ్రీనివాసన్, వి జయరామన్, శ్రీరామ్, ఎంవి సీతారామన్, నారాయణన్ కె జె, శివకుమార్ వెంకటసు బ్రమణియన్, శ్రీకాంత్ సోమసుందరం, సత్యనారాయణన్ గోపాలన్, గణేష్ రామన్, మణికందన్ బాలసుబ్రమణియన్, స్వామినాథన్ రమణి, నారాయణసామి వెంకటసుబ్రమణియన్, గణేష్ కుమార్ వి వి, రమేష్ ముకుంత్, సుజిత్ కుమార్ తదితరులను సభాధ్యక్షుడు ఘనంగా సత్కరించారు.SDBBS అధ్యక్షులు కార్తీక్, సెక్రటరీ ఆనంద్ చంద్రశేఖర్ , కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు మణికండన్ మాట్లాడుతూ కార్యక్రమము విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన రాంకుమార్ బృందం, విజయా మోహన్ బృందం, కలై (AV వీడియో) తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. కార్యక్రమములో పాల్గొన్న భక్తులకు పెరుమాళ్ ఆలయం నుంచి తెచ్చిన ప్రసాదాన్ని వడ్డించడం విశేషం. -
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula) కేసులో విద్యార్థుల, ఎన్నారైల పోరాటం ఫలించింది. ఆమె మృతికి కారణమైన అధికారిని విధుల్లోంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మరణం గురించి చులకనగా మాట్లాడిన అధికారిపై సైతం వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో న్యాయం జరిగినట్లైంది!.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల(23).. 2023,జనవరి 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి అతివేగంగా పాట్రోలింగ్ వాహనం నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న ఆమెను ఢీ కొట్టాడు. దీంతో.. ఆమె చాలాదూరం ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.అయితే విధి నిర్వహణలో భాగంగానే ఆయన అంత వేగంగా వెళ్లాల్సి వచ్చిందని.. కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తొలుత పోలీస్ శాఖ భావించింది. అలాగే ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన అధికారి విషయంలోనూ క్షమాగుణం ప్రదర్శించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి. జస్టిస్ ఫర్ జాహ్నవి పేరుతో విద్యార్థులు ఫ్లకార్డులతో రోడ్డెక్కి నిరసనసలు చేపట్టారు. దీంతో సియాటెల్ పోలీస్ శాఖ దిగొచ్చింది. ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూసింది. చివరకు చర్యలకు ఉపక్రమించింది. ఇదీ చదవండి: జాహ్నవికి మరణానంతర డిగ్రీ‘‘ఘటనలో ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి ఉండకపోవచ్చు. డ్రగ్స్ ఓవర్‌డోస్ అయిన బాధితుడ్ని రక్షించాలని ఆయన తాపత్రయపడ్డారు. ఆ క్రమంలోనే తన వాహనంతో ఢీ కొట్టి ప్రాణం పోయేందుకు కారణం అయ్యారు. అయితే ఆయన తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడిపారు. సియాటెల్ పోలీస్ విభాగానికి చెడ్డ పేరు తెచ్చారు. డిపార్ట్మెంట్ పాలసీల్లో నాలుగింటిని ఆయన ఉల్లంఘించారు. అందుకే సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డేవ్‌ను తొలగించాం’’ అని సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ సూ రెహర్ ప్రకటించారు. ఆమె ప్రకటనను సియాటెల్ టైమ్స్ సోమవారం ప్రచురించింది. అంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మృతి పట్ల అనుచితంగా మాట్లాడిన అధికారి డేనియల్ అడెరెర్‌ను సైతం గతేడాది సెప్టెంబర్‌లో విధుల్లోంచి తొలగించారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా.. ఆమె ప్రాణం విలువ గురించి మరో అధికారి చులకనగా మాట్లాడారు. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఈ మరణానికి విలువలేదు. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నారైల నుంచి, విద్యార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో దర్యాప్తు అనంతరం అతన్ని విధుల్లోంచి తొలగించింది. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని డేనియల్ అడెరె వివరణ ఇచ్చినప్పటికీ వేటు మాత్రం తప్పలేదు. -
రైల్వేస్టేషన్లో ఎన్నారైకి టోకరా.. అధికారులు సీరియస్
సాధారణంగా రైల్వే స్టేషన్లలో నడవలేని వారి కోసం వీల్‌చైర్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించుకోవడానికి ఏ మాత్రం ఫీజు చెలాయించాల్సిన అవసరం లేదు. కానీ ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఓ పోర్టర్.. ఎన్ఆర్ఐ (NRI) ప్యాసింజర్ నుంచి రూ.10,000 వసూలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో వీల్‌చైర్ సేవలను అందించినందుకు పోర్టర్ రూ. 10వేలు వసూలు చేసాడు. ఈ ఘటన డిసెంబర్ 28న జరిగినట్లు తెలిసింది. ఆ స్టేషన్లో వీల్‌చైర్ సర్వీస్ ఉచితం అని తెలుసుకున్న ఆ ఎన్ఆర్ఐ కుమార్తె రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది.ఎన్ఆర్ఐ నుంచి 10,000 రూపాయలు వసూలు చేసిన ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టి, స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ పోర్టర్‌ను గుర్తించారు. ఎన్ఆర్ఐ దగ్గర నుంచి వసూలు చేసిన రూ. 10వేల రూపాయలలో 90 శాతం వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా ఆ పోర్టర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసి.. అతని దగ్గర ఉన్న బ్యాడ్జ్‌ను కూడా అధికారులు వెనక్కి తీసుకున్నారు.ప్రయాణికులను మోసం చేస్తే సహించేది లేదని, ఇలాంటి ఘటనలు రైల్వే ప్రతిష్టతను దెబ్బతీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల ప్రయోజనాలకే మొదట ప్రాధాన్యత కల్పిస్తామని వారు స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ప్రయాణికులు 139 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వారు సూచించారు. -
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్‌గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్‌లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్‌లో ఫెలో డాక్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్‌గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్‌మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు. సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
స్వదేశానికి గుడ్ బై
సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్‌బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు పేర్కొంది.అమెరికాలో రెండో స్థానం వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గుచూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. -
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్ఆర్ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. క్యూలో నిలబడమని చెప్పినందుకు సింగపూర్‌లోని ఒక కేఫ్‌లోని కేఫ్‌లోని క్యాషియర్‌పై (Cafe Cashier) దాడి చేశాడు. ఘటనలో భారత సంతతికి చెందిన రిషి డేవిడ్ రమేష్ నంద్వానీ (Rishi David Ramesh Nandwani ) దోషిగా తేలాడు. దీంతో సింగపూర్ కోర్ట్( Singapore Court ) నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4000 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.సింగపూర్‌లోని హాలండ్ విలేజ్‌లోని ప్రాజెక్ట్ అకాయ్ కేఫ్లొ అక్టోబర్ 31న ఈ ఘటన జరిగింది. కేఫేలో ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చాడు రిషి. దాదాపు మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో అక్కడంతా పిల్లలతో సహా కస్టమర్లు కిక్కిరిసి ఉన్నారు. ఈ సమయంలో క్యూలో తప్పుగా నిలబడటం గమనించిన మహిళా క్యాషియర్, రిషీని వెనక్కి వెళ్లమని సూచించింది. దీంతో అతను వెళ్లలేదు సరికదా అసహనంతో రెచ్చిపోయాడు. ఆ దేశం, అక్కడి ప్రజల గురించి అభ్యంతరకరంగా వ్యాఖానించాడు. ఆమెపై దుర్భాషలాడాడుతూ, అసభ్యమైన పదజాలంతో దూషించాడు. ఆవేశంతో కౌంటర్లో ఉన్న టిప్ బాక్స్ తీసుకుని ఆమెపైకి విసిరాడు. దీంతో ఆమె పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండుగంటల్లోనే రిషిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రిషీ దురుసుగా ప్రవర్తించినట్లు తేల్చారు.వీడియో లింక్ ద్వారా రిషిని కోర్టులో హాజరుపరిచారు. కేఫ్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా క్యాషియర్‌కు అసభ్యకరమైన సైగలు, దూషణలు చేస్తూ ఉన్న వీడియోను కోర్టులో ప్లే చేశారు. కేఫ్‌లో బాధితురాలి భద్రతకు హాని కలిగించే అవమానకరమైన పదాలను ఉపయోగించడం , అసభ్యకరమైన చర్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఛానల్ న్యూస్ ఆసియా ప్రకారం, శిక్ష సమయంలో రెండు అదనపు ఛార్జీలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం డిసెంబరు 30 జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. -
ఖతార్‌లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం
ఖతార్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన తెలుగు ప్రవాసి వెంకప్ప భాగవతుల "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డును గెలిచారు. ఖతార్‌లోని తెలుగు, భారత సమాజానికి ఆయన అందించిన అసాధారణ కృషి, ప్రేరణాత్మక నాయకత్వం, వివిధ రంగాల్లో కనబరచిన విశిష్ట ప్రతిభా పాటవాలు, , సేవలకు గౌరవంగా ఈ అవార్డు ఆయనను వరించింది."సౌత్ ఐకాన్ అవార్డు" అనేది SIGTA కార్యక్రమంలో అందించబడే అత్యున్నత గౌరవం. విదేశాల్లో నివసిస్తూ తమ మాతృభూమి సాంస్కృతిక వారసత్వం మరియు నైతిక విలువలను పరిరక్షించడంలో, వాటిని ప్రోత్సహించడంలో విప్లవాత్మకమైన కృషి చేసిన ప్రవాసులకు ఈ అవార్డు ప్రకటించబడుతుంది. ఖతార్‌లోని ప్రపంచ ప్రఖ్యాత AL MAYASA థియేటర్ (QNCC) లో జరిగిన ఈ ఘనమైన వేడుకకు 2,500 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల ప్రముఖులు, వ్యాపార, వినోద, సాంస్కృతిక, సేవా, సామాజిక రంగాల నుండి ప్రతిష్టాత్మక వ్యక్తులు పాల్గొని తమ అభినందనలు తెలిపి, ఈ కృషికి ఎంతో గౌరవం అర్పించారు.ఖతార్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు భాష, కళలు, సాంస్కృతిక వారసత్వం , సామాజిక సేవలలో చేసిన అసాధారణ కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యి, అందరి మన్ననలు పొందారు వెంకప్ప భాగవతుల.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డు పొందడం గర్వకారణంగా , గౌరవంగా భావిస్తున్నాను అని, ఇది తన బాధ్యతను మరింత పెంచింది" అని పేర్కొన్నారు అన్నారు వెంకప్ప భాగవతుల. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు సంబంధించి, SIGTA కార్యవర్గం, జ్యూరీ సభ్యులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ గుర్తింపు నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. ఈ అవార్డును నా కుటుంబసభ్యులకు, ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులకు, నాకు ప్రేరణగా నిలిచే నా మిత్రులకు, అలాగే ఖతార్‌లోని తెలుగు సమాజానికి అంకితం చేస్తున్నాను." అని ఆయన అన్నారు. -
హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!
హెచ్–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటికి అనుకూలంగా మాట్లాడడం.. ఆయన మద్దతుదారుల్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో.. టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్(Elon Musk) కాస్త మెత్తబడ్డారు. హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు స్వరం మార్చారు. ఈ పాలసీలో భారీ సంస్కరణలు అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించేవే హెచ్–1బీ(H1B) వీసాలు. అయితే.. ఈ వీసా వ్యవస్థ సజావుగా నడవడం లేదని.. దానికి భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఆయన బదులిచ్చారు.Easily fixed by raising the minimum salary significantly and adding a yearly cost for maintaining the H1B, making it materially more expensive to hire from overseas than domestically. I’ve been very clear that the program is broken and needs major reform.— Elon Musk (@elonmusk) December 29, 2024హెచ్–1బీ వీసా మీద సౌతాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు ఇలాన్ మస్క్. అయితే ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులుగా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ని నియమించారు. అయితే.. అమెరికా ఫస్ట్ అమలుకు ట్రంప్ ఏరికోరి నియమించిన ఈ ఇద్దరే బీ1 వీసా విధానానికి మద్దతు ప్రకటించడం.. ట్రంప్ మద్దతుదారులకు ఏమాత్రం సహించడం లేదు. దీనికి తోడు.. 👉తాజాగా.. వైట్‌హౌస్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. అయితే నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.👉మరోవైపు నెట్టింట జోరుగా చర్చ నడిచింది. అయితే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు ఇలాన్ మస్క్ సూచిస్తూ వస్తున్నారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా.👉ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. కౌంటర్‌గా కొందరు వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఒకానొక టైంలో సహనం నటించిన మస్క్.. బూతు పదజాలం ప్రయోగించిన సందేశం ఉంచారు.👉ఇక.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే.. విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని.. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తయారు చేస్తానని(Make America Great Again) తన ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు అప్పుడు సంకేతాలిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇటు డెమోక్రాట్లలో.. అటు రిపబ్లికన్లలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. -
సామాజిక చైతన్య సాహిత్యంపై తానా సదస్సు
ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా డిసెంబర్ 29న జరిగిన - 75వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సామాజిక చైతన్య సాహిత్యం – దశ, దిశ” (అభ్యుదయ, దిగంబర, పైగంబర, విప్లవ సాహిత్యాలు) ఘనంగా జరిగింది. విశిష్టఅతిథులుగా – అభ్యుదయ సాహిత్యం: డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి- సుప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, అధ్యక్షులు: అరసం, వేల్పుల నారాయణ - ప్రముఖ రచయిత, అధ్యక్షులు: తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శి: అఖిలభారత అరసం; దిగంబర సాహిత్యం: (దిగంబర కవులు) నిఖిలేశ్వర్ (శ్రీ కుంభం యాదవరెడ్డి) – దిగంబర కవి, ప్రముఖ కథారచయిత, అనువాద రచయిత, విమర్శకులు; నగ్నముని (మానేపల్లి హృషీ కేశవరావు) – దిగంబర కవి, ప్రముఖ కవి, నాటకరచయిత, నాస్తికులు; పైగంబర సాహిత్యం: (పైగంబర కవులు) కిరణ్ బాబు (రావినూతల సుబ్బారావు) - పైగంబర కవి, రచయిత, సంపాదకులు; వోల్గా (డా. పోపూరి లలితకుమారి) – పైగంబర కవి, ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమ ప్రతీక, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత; రజాహుస్సేన్ - కవి, రచయిత, పాత్త్రికేయుడు, సాహిత్య విమర్శకుడు; విప్లవ సాహిత్యం: (విప్లవ రచయితల సంఘం - విరసం): అరసవిల్లి కృష్ణ, విప్లవ కవి. అధ్యక్షులు: విరసం. సాహిత్యం కాలంతో పాటు ప్రవహించే ఓ వాహిక.. కాలగతిలో సామాజిక పరిణామాలకు అనుగుణంగా సాహిత్య ఉద్యమాలు రూపుదిద్దుకుంటాయి. వాటి ప్రభావం సామాజిక మార్పులకు దోహదపడుతుందని వక్తలు ఉద్ఘాటించారు. ’తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన అంతర్జాల సాహిత్య చర్చాకార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సామాజిక చైతన్యావసరాన్ని వివరించారు. సమాజంలో ఎక్కువమంది నిశ్శబ్దంగా ఉండడంవల్ల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. జనం చైతన్యంతో ప్రతిఘటించినప్పుడే, అరాచకాలు అరికట్టబడతాయని చెప్పారు. జనాన్ని చైతన్యవంతం చేసే బాధ్యత కవులు, రచయితలపై వుందన్నారు. ఈ కార్యక్రమంలో అరసం, విరసం, దిగంబర, పైగంబర కవిత్వోద్యమాలపై కూలంకష చర్చజరిగింది. అరసం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, తెలంగాణ అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ప్రసంగించారు. అరసం ఆవిర్భావం, వికాసం గురించి డా. రాచపాళెం ప్రసంగించారు. అరసం అందరిదీ కాకున్నా, అత్యధికులకు సంబంధించిందని ఆన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికోసం అరసం ఆవిర్భవించిందన్నారు. వేల్పుల నారాయణ మాట్లాడుతూ అరసం ఆవశ్యకతను, ఆచరణను వివరించారు. దిగంబరకవిత్వ ఆవిర్భావ వికాసాలు, సిద్ధాంతాల గురించి నిఖిలేశ్వర్, నగ్నముని ప్రసంగించారు. దిగంబర కవిత్వం చారిత్రక అవసరంగా ఆవిర్భవించిందని, సాహిత్యంలో ఓ దశాబ్ది నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసిందన్నారు. దిగంబరులు ఆరుగురు ఆరు రుతువుల్లా సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. దిగంబరుల కవిత్వంలో అభివ్యక్తి, భాష గురించి వచ్చిన విమర్శల్ని ఆయన తిప్పి కొట్టారు. నాటి యువతలో జడత్వాన్ని వదిలించడానికి ఆ మాత్రం ట్రీట్మెంట్ తప్పలేదన్నారు. నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి..లేపకు.. పీక నులిమి గోతిలోకి లాగుతాడు.. ప్రభందాంగనల తొడలు తాడి మొద్దులు తాకితే కాళ్ళు విరగ్గొట్టు.. కుచములు ఎవరూ ఎక్కని పర్వతాగ్రములు తలను ఢీకొని బద్దలు కొట్టు. భావకవుల నపుంసక హావభావాలకు సవాలు; అభ్యుదయ కవీ నల్ల మందు తిని నిద్రపోయావ్”!! అంటూ తన స్వీయ కవిత చదివి వినిపించారు. నిఖిలేశ్వర్.. ఇందులో శృంగార మేంలేదని, నిద్రపోతున్న యువతను తట్టిలేపడానికి ఈ మోతాదులో వ్రాయాల్సి వచ్చిందన్నారు. నిద్రపోతున్న తెలుగు సాహిత్యాన్ని మేల్కొలపటంలో దిగంబర కవిత్వం పాత్ర తక్కువేం కాదని నగ్నముని అన్నారు. దిగంబరకవిగా అరెస్ట్ అయి ప్రభుత్వోద్యోగాన్ని కూడా కోల్పాయనన్నారు. సిద్ధాంత ప్రాతిపదికనే జనచైతన్యం కోసం దిగంబరకవులు. కవిత్వం రాశారన్నారు. అభివ్యక్తిలో, భాషలో విమర్శలకు గురైనా…దిగంబర కవిత్వం నాటి సమాజంలో సంచలనం కలిగించిందన్నారు. పైగంబర కవి ఓల్గా మాట్లాడుతూ.. నాటి సాహిత్య, సామాజిక పరిస్థితులకు మేల్కొల్పుగా పైగంబర కవిత్వం ఆవిర్భవించిందన్నారు. పైగంబర కవులు మానవతకు పెద్దపీటవేశారని చెప్పారు. మరో పైగంబరకవి కిరణ్ బాబు..పైగంబర కవిత్వ ఆవిర్భావ వికాసాలను వివరంగా తెలియజేశారు. “మేము పైగంబరులం మాది ఒక తపస్సు మా కవితా దీపికలు విడదీస్తవి గాఢ తమస్సు ప్రపంచం సమస్యల కీకారణ్యంలా వుంది ఎటుచూసినా ఘోర నిబిడ నిశీథి ఎటుపోయేందుకు దారి చూపదు”.. 1970 నాటి సామాజిక పరిస్థితుల్ని చూసి, తట్టుకోలేక అయిదుగురు కవులు పైగంబరులుగా పేరుపెట్టుకొని కవిత్వం రాశారని కిరణ్ తెలిపారు. దేవిప్రియ, సుగమ్ బాబు, కమలాకర్, ఓల్గా తాను పంచపాండవుల్లా కవిత్వాయుధాలు పట్టి మానవత్వాన్ని తట్టి లేపేందుకు కలంపట్టామని చెప్పారు. విరసం తరపున అరసవిల్లికృష్ణ మాట్లాడారు. విరసం ఆవిర్భావ, వికాసాలను అరసవెల్లి వివరించారు. విరసం చారిత్రక అవసరంగా ఏర్పడిందన్నారు. సాహితీ విమర్శకులు ఎ.రజాహుస్సేన్ మాట్లాడుతూ పైగంబర కవిత్వంపై సాధికార విమర్శ పుస్తకం తేవడం తన అదృష్టమన్నారు. పైగంబర కవులతో, తన సాన్నిహిత్యాన్ని వివరించారు. దేవిప్రియ ఆత్మ కథ రాస్తానని ప్రకటించినా, చివరకు రాయకుండానే దూరమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ శుభాకాంక్షలందజేశారు. అమెరికామ్రేడ్స్ గా పిలువబడే లెనిన్ వేముల, కిరణ్మయి గుంట (వేముల) అనంత్ మల్లవరపు బృందం సందర్భోచితం గా పాటలు గానం చేసి, కవితా పఠనం చేశారు. కార్యక్రమం ఆసక్తికరంగా తెలుగు సాహిత్యంలోని వివిధ ఉద్యమాల ఆవిర్భావం, వికాసం, వాటి ఆనుపానులగురించి చక్కటి చర్చ జరిగింది. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె లో వీక్షించవచ్చును.https://www.youtube.com/live/j00sevVGbzE?si=gXSmem5xRkW3EJuX -
‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి
అల్వాల్ (సికింద్రాబాద్): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల వేధింపులు భరించలేక..ఇంటికి తిరిగి వచ్చేసిన కూతురి వేదన చూసి కుంగిపోయిన ఓ తండ్రి కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ విషాద ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రాంనగర్ ప్రాంతానికి చెందిన జగన్మోహన్రెడ్డి (60) ఆర్టీసీ ఉద్యోగి. 2021లో తన కుమారై సేహ్న (30)కు సూరారం ప్రాంతానికి చెందిన నవీన్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన వెంటనే నవీన్‌రెడ్డి, స్నేహలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లారు. మార్చి 2024లో నవీన్‌రెడ్డి, స్నేహ దంపతులకు ఒక పాప పుట్టింది. డెలివరీ సమయంలోనే స్నేహ అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త నవీన్‌రెడ్డి భార్యను నెలన్నర పసిపాపతో సహా అల్వాల్ రీట్రీట్ కాలనీలో ఉంటున్న స్నేహ తండ్రి జగన్మోహన్రెడ్డి వద్దకు పంపించేశాడు. ఈ క్రమంలో నవీన్ తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి, పద్మలు వీరిని వేధించారు. అనారోగ్యానికి గురయ్యావంటూ నిందించారు. అనంతరం చిన్నారిని బలవంతంగా సూరారం తీసుకెళ్లారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జగన్మోహన్రెడ్డి, స్నేహలు సూరారం వెళ్లి పాపను తమకు ఇచ్చేయాలని కోరారు. దీనికి నిరాకరించిన నవీన్ కుటుంబ సభ్యులు దూషించారు. వారి వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురైన కుమార్తెను తీసుకొని జగన్మోహన్రెడ్డి ఈ నెల 12వ తేదీన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఆమెకు చూపించి.. తిరిగి వస్తూ బోయిన్‌పల్లిలో బిర్యానీ కొనుగోలు చేసి..దాంట్లో విషం కలుపుకొని కారులో కూర్చొని తిన్నారు. ఇంటికి వచ్చిన అనంతరం వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం జగన్మోహన్రెడ్డి మృతి చెందగా కూతురు స్నేహ కోలుకుంది. కూతురు జీవితం చిన్నాభిన్నం అయిందన్న వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అల్వాల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఊహించని విధంగా మరణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు.. -
సింగపూర్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా జూంలో జాయిన్ అయ్యి ప్రసంగించారు. ఈ వేడుకలలో సింగపూర్ వైస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ రెడ్డి, అడ్వైసర్ కోటి రెడ్డి, మలేషియా కన్వీనర్ భాస్కర్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, సందీప్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, చంద్ర, కృష్ణారెడ్డి, సుధీర్, సుహాస్, యుగంధర్, దొరబాబు, సత్యనారాయన రెడ్డి, శ్రీనాథ్, శ్రీని, మధుతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు.సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా జగనన్న నిలిచారని ప్రవాసులు కొనియాడారు. విద్య, వైద్యం, పోర్టులు వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిరాని ప్రశంసించారు. -
ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు : సరికొత్త చరిత్ర
అమెరికన్ తెలుగు అసోసియేషన్ -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు రికార్డ్ సృష్టించాయి. ఆటా చరిత్రలోనే ఫస్ట్ టైం నాన్ స్లేట్ మెంబర్స్ ఆధిక్యం కనబరిచారు. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను, ఆటా ఎలక్షన్ కమిటీ రికమెండ్ చేసిన నలుగురు స్లేట్ అభ్యర్థులు గెలుపొందారు. ఐదుగురు నాన్ స్లేట్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించి.. ప్రత్యేకతను చాటారు. స్లేట్ నుంచి గెలిచిన వారిలో న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం , అట్లాంటా వాసి శ్రీధర్ తిరుపతి , హ్యూస్టన్ వాసి శ్రీధర్ కంచరకుంట్ల , వర్జీనియా వాసి సుధీర్ బండారు ఉన్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి , చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర RV రెడ్డి విజయం సాధించించారు. నాన్ స్లేట్ నుంచి గెలిచిన వారిలో విజయ్ కుందూర్ - న్యూజెర్సీ, విష్ణు మాధవరం- వర్జీనియా, శ్రీనివాస్ శ్రీరామ - అట్లాంటా ఉన్నారు.న్యూ జెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. సంతోష్ కోరం ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ నుంచి రెండు వైపులా ఓటర్లను ఆకర్షించి.. తన ప్రత్యేకతను చాటుకున్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి, చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర RV రెడ్డి విజయ ఢంకా మోగించారు. వీరి గెలుపుతోనే ఆటా చరిత్రలోనే మొట్టమొదటిసారి నాన్ స్లేట్ అభ్యర్థుల హవా కనబడింది. గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో ముగ్గురు కాశీ విశ్వనాథ రెడ్డి కొత్త, రామ్ మట్టపల్లి, శ్రీధర్ బాణాల.. స్లేట్ నుంచి గెలిచారు. ప్యాట్రన్ కేటగిరీలో ఒకరు స్లేట్ నుంచి, ఇద్దరు నాన్ స్లేట్ నుంచి గెలిచారు. శారద సింగిరెడ్డి, రవీందర్ కె. రెడ్డి, వెన్ రెడ్డి ప్యాట్రన్ కేటగిరీలో విజయం సాధించారు. న్యూ జెర్సీ , అట్లాంటా, వర్జీనియా నుండి ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ అభ్యర్థులు గెలపొందడం విశేషం. ఈ ఎన్నికల్లో గెలిచిన వారందిరికీ ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందనలు తెలిపారు. -
అట్లాంటాలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా
అమెరికాలోని అట్లాంటాలో వైయస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరైనారు. జగన్ అన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ పార్టీ అభిమానులతోపాటు, ,విదేశాల్లో ఉన్న మన తెలుగు ఎన్నారైలు కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నారని నాగార్జునరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను, సూపర్.6. ప్రజలు గమనిస్తున్నారని,వారి లోపాలను.. మోసాలను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలని అన్నారు. జగనన్న 2019లో 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఎన్నికల ముందు నవరత్నాలు. . పథకాలను అమలు చేస్తానని వాగ్దానం చేసి అధికారులు వచ్చిన తర్వాత నవరత్నాలు పూర్తిగాఅమలు చేసిన ఘనత జగనన్నదే అన్నారు. కులం,మతం, ప్రాంతం, పార్టీ లు చూడకుండా..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అన్నీ అందాయని, టిడిపి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు అన్నారు. ఇప్పుడు విజన్ 2047.. అని కొత్త రాగం పాడుతున్నారని విమర్శించారు. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు.. ఇక్కడి తెలుగు ఎన్నారైలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ,దినకర్, ఉదయ్, ముఖ్య అతిథులుగా వెంకట్రామిరెడ్డి గిరీష్ రెడ్డి , సందీప్ పాల్గొన్నారు. -
మెల్బోర్న్లో ఘనంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
వైయస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో YSR కేడర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ నాయకులు వై ఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, కుంచె రమణారావు లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో ఎప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి సాధనలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కృషిని ప్రశంసించారు.ఆస్ట్రేలియా - టీం మెల్బోర్న్ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, నాగార్జున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న స్ఫూర్తి అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. -
విదేశాల్లోనూ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను అనేక దేశాల్లోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అక్కడి బే ఏరియా, డల్లాస్, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీఎత్తున కేక్‌లు కట్‌చేసి.. విందు భోజనాలతో ఘనంగా నిర్వహించారు. అలాగే.. బ్రిటన్‌లోనూ అంగరంగ వైభవంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. లండన్ ఈస్ట్ హాంలో వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్చింతా ప్రదీప్, ఓబుల్‌రెడ్డి పాతకోట అధ్యక్షతన నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో ఆ దేశం నలుమూలల నుంచి జగన్ అభిమానాలు భారీఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రదీప్ మాట్లాడుతూ.. ఒకటే జీవితం, ఒక్కటే రాజకీయ పార్టీ, ఒక్కడే నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పడంతో జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ విమలారెడ్డి తనయుడు యువరాజ్‌రెడ్డి ఆన్లైన్లో యూకేలోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నారైలకు అభినందనలు : చెవిరెడ్డిఅనేక దేశాల్లో భారీఎత్తున వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్నారైలను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభినందించారు. జగన్ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని.. జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.సింగపూర్‌లోనూ సంబరాలు..వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సింగపూర్‌లో కూడా ఆదివారం ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగపూర్ వైఎస్సార్సీపీ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి, అడ్వైజర్ కోటిరెడ్డి, మలేసియా కన్వీనర్ భాస్కర్‌రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా.. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా.. విద్య, వైద్యం, పోర్టులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని జగన్‌ను కొనియాడారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! దుబాయ్‌లో అత్యంత వైభవంగా..ఇక యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ ఎన్నాౖరె కమిటీ సలహాదారు ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యూఏఈ కో–కన్వీనర్ మైనర్ బాబు, తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్‌లోని హోటల్ విస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఆ దేశం నలుమూల నుంచి అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అనంతరం.. కారుమూరి నాగేశ్వరావు తదితర వక్తలు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకుని.. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేద్దామని పిలుపిచ్చారు. మరోవైపు.. కెనడా, ఖతార్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా (మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్), జర్మనీ తదితర దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారుగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..
చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మార్పులు వీసా ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవతం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్‌మెంట్‌ని ఒకసారి రీషెడ్యూల్ చేయవచ్చు. అయితే మీరు రెండోసారి రీషెడ్యూల్ చేసినా లేదా అపాయింట్‌మెంట్‌ని మిస్ చేసినా.. మీకు మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ అవసరం. దీనికోసం మీరు మళ్ళీ సుమారు రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.రెండోసారి రీషెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ రోజున మీరు తప్పకుండా సమయానికి చేరుకోవాలి. అప్పుడే వీసా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని యూఎస్ ఎంబసీ తెలిపింది.హెచ్-1బీ వీసా నిబంధనలలో మార్పులుయూఎస్ హెచ్-1బీ వీసాను చాలామంది దుర్వినియోగం చేస్తున్న కారణంగా.. దీనిని నిరోధించడానికి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందవచ్చు.2025 జనవరి 17 నుంచి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ వీసా పొందడం కష్టం.సింపుల్‌గా చెప్పాలంటే, ఐటీ ఫీల్డ్ ఉద్యోగాల కోసం.. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే మీకు హెచ్-1బీ వీసా లభిస్తుంది. అంతే కాకుండా.. ఇప్పుడు హెచ్-1బీ వీసా పొడిగింపు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మునుపటి ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను ప్రాసెస్ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులుఇంటర్వ్యూ మినహాయింపులో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఇకపై ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు ఉపయోగించనున్నారు. ఈ రూల్ తరచుగా యూఎస్ వెళ్లాలనుకునే వారికి ప్రయోజనం చేకూర్చుతుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలుమార్పులు ఎందుకంటే?హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో చేసిన ఈ మార్పులు.. టెక్ పరిశ్రమతో సహా కీలక పరిశ్రమల అవసరాలను తీర్చడానికి యూఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. సిలికాన్ వ్యాలీ.. ఇతర యూఎస్ టెక్ హబ్‌లకు నైపుణ్యం కలిగిన కార్మికులకు భారతదేశం ప్రధాన వనరు. కాబట్టి.. ఈ మార్పులు బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి మాత్రమే కాకుండా, ఐటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతాయి. -
దేశ, విదేశాల్లో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం దేశ, విదేశాల్లో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అమెరికా నార్త్ కరోలినా, సెయింట్ లూయిస్, కెనడా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, బ్రిస్బేన్, సిడ్నీ, ఖతార్‌లోని దోహా, కువైట్, న్యూజిలాండ్ దేశాల్లో అభిమానులు కేక్‌లు కట్ చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విటర్)లో ‘హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో రికార్డు సృష్టించింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.. సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బేన్ లలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..ఈ సందర్భంగా పలువురు… pic.twitter.com/AKWOid47tq— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024దోహా ఖతార్ లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొని మన ప్రియతమ నేత మాజీ ముఖ్య మంత్రివర్యులు శ్రీ @ysjagan గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.#HBDYSJagan #YSJaganMohanReddy #JaganannaConnects pic.twitter.com/LA3niEnfUC— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024ఆస్ట్రేలియాలోని , సిడ్నీలో మన ప్రియతమ నేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన ఎన్నారైలు..ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.#HBDYSJagan #YSJaganMohanReddy #JaganannaConnects pic.twitter.com/yPskG9grXo— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024అమెరికాలోని చార్లోట్టే, నార్త్ కారోలినలో తెలుగు ఎన్నారైలు, కేక్ కట్ చేసి జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహా దారులు శ్రీ పొతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు.… pic.twitter.com/mJbMzMvTt0— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన @YSRCParty నాయకులు మరియు అభిమానులు.ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా తమ సందేశాలను పంచుకున్న వైస్సార్సీపీ ఎంపీ @MithunReddyYSRC గారు, మాజీ మంత్రి @AmbatiRambabu గారు .#HBDYSJagan #YSJagan… pic.twitter.com/kLutnIxDjW— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు మరియు అభిమానులుఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా తన సందేశాన్ని పంచుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే @SilpaRaviReddy గారు.#HBDYSJagan #YSJagan #JaganannaConnects pic.twitter.com/jyKNd7uJnN— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఇండియా టాప్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 24 గంటల్లో 18 గంటలకుపైగా టాప్ వన్ పొజిషన్లో నిలిచింది. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్‌కు ఏకంగా 37 లక్షల మందికిపైగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలి. ప్రజా సేవలో సుదీర్ఘకాలం ఉండాలి’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కెనడాలో జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు మరియు అభిమానులుఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగన్ గారి వెంట ఎల్లవేళలా ఉంటామని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడువబోమని పునరుద్ఘాటించారు.#HBDYSJagan #YSJagan… pic.twitter.com/NDWJ3ykVqj— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024 -
షార్లెట్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. జగన్ బర్త్‌డే సందర్భంగా పిల్లలూ, పెద్దలూ అంతా కేక్ కట్ చేసి తమ ప్రియతమ నేతలకు జన్మదిన శుభాకాంక్షలందించారు. జగనన్న అభిమానులు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో హాజరై.. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
బంధించేశారు, ఒక్కపూటే భోజనం..రక్షించండి: కువైట్‌లో ఏపీ మహిళ ఆవేదన
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి ఆందోళన రేపుతోంది. తిరుపతి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ చెందిన ఎల్లంపల్లి లక్ష్మి తన కుమార్తెను ఉద్దేశించి ఈ వీడియో చేసింది. కువైట్ లో తనను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.మతిస్థిమితం లేని పిల్లవాడి సంరక్షణ కోసం కువైట్ వచ్చిన తనకు కనీసం కడుపు నిండి తిండి పెట్టకుండా, వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. పిల్లవాణ్ని సరిగ్గా చూడటం లేదని ఆరోపిస్తూ తనను బాగా కొట్టిన యజమానులు గదిలో నిర్బంధించారని కన్నీళ్లు పెట్టుకుంది. తిండీ, తిప్పలు లేక, అనారోగ్యంతో బాధలు పడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు రక్షించాలని ఎజెంటుకు విన్నవించుకుంటే 2.50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నానని దయచేసిన తనను ఈ నరకంనుంచి రక్షించాలని సెల్ఫీ వీడియోలో కుమార్తెను వేడుకుంది. దీంతో లక్ష్మి కుమార్తె సుచిత్ర ఆందోళనలో మునిగిపోయింది. తల్లిని కాపాడాలని కోరుతూ స్టానిక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు విజ్ఞపి చేసింది. కువైట్ నుండి తన తల్లిని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కోరూతూ ఏమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కుమార్తె సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంది. -
సిడ్నీలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. సిడ్నీలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, జగనన్న అభిమానులు, పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. వైసీపీ నాయకులు గాయం శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి అంక్కిరెడ్డిపల్లి, శ్రీనివాస్ బేతంశెట్టి, అమరనాథ్ రెడ్డి , శిరీష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బేన్ లలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగనన్న వెంట ఎల్లవేళలా ఉంటామని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడవబోమని ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు పునరుద్ఘాటించారు. అలాగే కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యలను ఆటవిక రాజ్యపు పోకడలను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్తామని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జగనన్న వెంట ఉంటామని తెలియజేశారు.తెలుగుదేశం జనసేన కార్యకర్తల కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ప్రవర్తించాలని ఈ సందర్భంగా ఎన్నారైలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ జూమ్ కాల్ ద్వారా అనుబంధ విభాగాల అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు రోజా, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరే శ్యామల, ఎన్నారై లతో మాట్లాడి వారు చేస్తున్నా ఈ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా చేసే పోరాటంలో ఎన్నారైలు అందరూ సహకరిస్తున్నందుకు వారికి అన్ని విధాలుగా రుణపడి ఉంటామని నాయకులు తెలియజేశారు.అంకుఠిత దీక్షతో మద్దతుగా నిలుస్తున్న ఎన్నారైలు అందరికీ వైసీపీ నాయకులు జూమ్ కాల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బిస్మిన్ లో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, ఇరువురి బ్రహ్మారెడ్డి, వంశీ చాగంటి, జస్వంత్ రెడ్డి బొమ్మిరెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
గడ్డకట్టే చలిలోనూ... లెహంగాలో స్నాతకోత్సవానికి!
ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగ్గేదేలే అంటారు కొందరు. ఆ విద్యార్థిని సరిగ్గా అలాంటి వారిలో కోవలోకే వస్తుంది. గడ్డ కట్టించే చలిలోనూ వస్త్రధారణలో రాజీ పడలేదు. స్నాతకోత్సవంలో సంప్రదాయ దుస్తులే ధరించింది! స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం చలి వణికిస్తోంది. మైనస్ డిగ్రీలతో సర్వం గడ్డ కట్టుకుపోతోంది. అయినా సరే, లక్ష్మీకుమారి అనే భారతీయ విద్యార్థిని అస్సలు రాజీ పడలేదు. స్నాతకోత్సవానికి లెహెంగా ధరించి ప్రశంసలు అందుకుంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘మైనస్ డిగ్రీల వాతావరణం. బయట ఎటు చూసినా మంచు. ఊహించలేనంతటి చలి! అయినా సరే, లెహంగా ధరించడంలో రాజీపడలేదు’’అని రాసుకొచ్చింది. ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. జీవితంలో ప్రత్యేకమైన మైలురాయిని సంప్రదాయంతో మేళవించిందంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. అంతటిప్రతికూల వాతావరణంలోనూ గ్రాడ్యుయేషన్ కోసం సంప్రదాయ దుస్తులు ధరించడం బాగుంది. ఆమె నిజమైన భారతీయురాలు. అంతర్జాతీయ వేదికపై తన మూలాలను ఇంతందంగా చూపించింది’’అంటూ పొగుడుతున్నారు. View this post on Instagram A post shared by Lakshmi Kumari (@lakshmi.ch) -
కెనడాలో ఏపీకి చెందిన విద్యార్థి హఠాన్మరణం!
కెనడాలో ఉన్నత చదువులకోసం వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు పిల్లి ఫణి కుమార్(36) వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. దీంతో ఫణి కుమార్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయికాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SAIT)లో సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎంఎస్ చదివేందుకు 2024 ఆగస్టు నెలలో వెళ్ళాడు ఫణి కుమార్. అయితే డిసెంబర్ 14న ఫణి కుమార్ రూమ్మేట్, ట్రక్ డ్రైవర్ తన కమారుడి మరణం గురించి సమాచారం అందించాడని తండ్రి, నాగ ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో చనిపోయినట్టు భావిస్తున్నప్పటికీ అయితే, ఈ మరణానికి గల కారణాలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాల్గరీ పోలీసులు ఫణి కుమార్ వస్తువులను అతని ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన కుమారుడి మృతదేహాన్ని కెనడా నుంచి భారతదేశానికి తీసుకునేందుకు సహకరించాల్సిందిగా నాగప్రసాద్, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కెనడాలో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం!
కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (LMIA) మద్దతుతో ఉద్యోగ ఆఫర్‌కు సంబంధించినఎక్స్ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తోంది. జాబ్ ఆఫర్పేరుతో జరుగుతున్న మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను త్వరలో తొలగించనున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.ఇది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (CRS) కట్-ఆఫ్ స్కోర్‌ను చేరుకోవడానికి , అక్కడ శాశ్వత నివాసం పొందే అసలైన లబ్ధిదారులను ప్రభావితం చేయనుందని నిపుణులు భావిస్తున్నారు.తాత్కాలిక విదేశీ వర్కర్ (TFW) ప్రోగ్రామ్‌లో సంస్కరణల్లో భాగంగా ఇది మొదటిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. స్టీఫెన్ హార్పర్ ప్రభుత్వం "అర్హత కలిగిన కెనడియన్లు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన పూర్తి తీవ్రమైన కార్మికుల కొరతను నివారించేం పరిష్కారంగా" భావించింది. అంటే సాధారణంగా దేశంలోని వివిధ సంస్థలు నిపుణులైన, అర్హులైన ఉద్యోగులను అందుబాటులో లేనపుడు అప్పటికే శాశ్వత నివాసం ఉన్నవారిలో లేకపోతే విదేశీ వ్యక్తులను నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది. కెనడాలోని సంస్థలు ఒక విదేశీ ఉద్యోగిని నియమించుకోవాలనుకుంటే, వారు ముందుగా LMIA దరఖాస్తును పూర్తి చేయాలి. ఫెడరల్ ప్రభుత్వం అనుమతి పొందాలి. ఉద్యోగం చేయడానికి కెనడియన్లు లేదా ఇతర శాశ్వత నివాసితులు లేరని కూడా వారు ధృవీకరించాల్సి ఉంటుంది.అలా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎల్ఎంఏఐ) కింద దరఖాస్తు చేసుకుంటాయి. ఈ సందర్భంగా జాబ్ ఆఫర్ ద్వారా ఆయా వ్యక్తులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పేరుతో 50 పాయింట్లు అదనంగా లభిస్తాయి. దీంతో.. ఆ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం లేదా తాత్కాలిక నివాసం కోరుకుంటే ఈ పాయింట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పేరుతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని, విదేశీ వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి.. శాశ్వత నివాసాలు పొందేందుకు అవకాశంకల్పిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్ ఆఫర్ల పేరిట మోసాలు జరుగు తున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. కొంతమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు చట్టవిరుద్ధంగా LMIAలను వలసదారులకు లేదా శాశ్వత నివాసం పొందడానికి వారి CRS స్కోర్‌ను పెంచుకుంటోందన్న పలు నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. -
సింగపూర్‌లో కిరణ్ ప్రభ-కాంతి కిరణ్ దంపతులతో ముఖాముఖీ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు ఆద్వర్యంలో "కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో" ఇష్టాగోష్టి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 18 డిసెంబర్, బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ఆ ముఖాముఖీలో కౌముది మాసపత్రిక సంపాదకులు, కిరణ్ ప్రభ ప్రసంగించారు. అలాగే కౌమిది వెబ్ మాగజైన్ మొదలు పెట్టి 17 సంవత్సరాలు పూర్తి అయిందని, ఏ నెలా ఆలస్యం కాకుండా 1వ తేదీనే విడుదల అవ్వడం వెనుక ఎంతో శ్రమ ఉన్నప్పటికీ అది మనకు పని పట్ల ఉన్న నిభద్దతగా భావించి విడుదలలో జాప్యం రానివ్వమని అన్నారు. అలాగే దాదాపు 1300 టాక్ షోలను కూడా నిర్వహించామని, తెలిసినంతలో ఒక్క మన తెలుగు భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా ఇన్ని విభిన్న రంగాలను ఎంచుకుని రకరకాల సబ్జక్ట్ లలో ఒక్క మనిషి ఇన్ని టాక్ షోలను చేసింది లేదని అంతే కాకుండా ఇదంతా ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగు భాష మీద అబిమానంతో మాత్రమే చేస్తున్న కార్యక్రమం అని వివరించారు. అదే విధంగా వారి టాక్ షో లను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే క్రమం ఎలా ఉంటుందో సోదాహరణలతో వివరించారు. ఎంతో మంది వింటున్న కార్యక్రమం కాబట్టి మాట్లాడే ప్రతి పదం నిజ నిర్ధారణతో, ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటానని వివరించారు, అదే విధంగా కౌముది పత్రిక నిర్వహణలో భార్య కాంతి కిరణ్ సహాయసహకారాలు ఎలా ఉంటాయో వివరించారు. కాంతి కిరణ్ మాట్లాడుతూ కౌముది పత్రిక ప్రారంభించినప్పుడు ఇంతమంది అభిమానుల్ని ప్రపంచవ్యాప్తంగా మాకు అందిస్తుందని అస్సలు అనుకోలేదని, ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తదుపరి వచ్చిన ఆహూతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దాదాపు 2 గంటల పాటు ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు.సుబ్బు వి పాలకుర్తి సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమములో, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ కిరణ్ ప్రభతో గత 3 సంవత్సరాలుగా ఆన్లైన్ వేదికలు ద్వారా పరిచయం ఉన్నప్పటికీ వారిని సింగపూర్ లో ఇలా ఇష్టాగోష్టి కార్యక్రమములో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెపుతూ వారిని పరిచయం చేసిన తానా సాహిత్య సంఘం అధ్యక్ష్యులు తోటకూర ప్రసాద్ కి ధన్యవాదములు తెలియచేసారు. అలాగే సింగపూర్ లో సాహిత్య కార్యక్రమాలకు నాంది పలికిన వంగూరి చిట్టెన్ రాజుకి మరొక్కసారి ధన్యవాదములు తెలియచేస్తూ, వర్కింగ్ డే అయినా కానీ 30 మందికి పైగా ఈ కార్యక్రమములో పాల్గొనటం అది కేవలం కిరణ్ ప్రభ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమములో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్ష్యులు జవహర్ చౌదరి, రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, సాంకేతిక సహకారం అందించారు. 30 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమములో పాల్గొన్న అతిధులందరికి విందు భోజన ఏర్పాట్లను సరిగమ బిస్ట్రో రెస్టారంట్ వారు కేశాని దుర్గా ప్రసాద్, సురేంద్ర చేబ్రోలు, మోహన్ నూకల ఏర్పాటు చేసారు. -
హెచ్-1బీ వీసా : భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవితపై అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో యూఎస్ ప్రకటన లక్షలాది మంది భారతీయ టెకీల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.హెచ్ 1 బీ వీసా : కీలకమైన అప్డేట్స్F-1 విద్యార్థి వీసాదారులు, ఉద్యోగాలు, H-1B స్థితికి మారడం, తద్వారా అమెరికాలో కొనసాగడం వంటి మార్పులు ఉండనున్నాయి.దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారంను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీంతో వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది లక్ష్యం.అంతేకాదు హెచ్1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారం మరింత ఉంటుంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయ నున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.గతంలో H-1B వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొన్ని షరతులతో పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు అర్హతను పొడిగిస్తుంది.కాగా ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సింహభాగం భారతదేశానికి చెందినవారే. 2023లో, జారీ చేసిన వీసాల్లో భారతీయులు 72.3శాతంఉన్నారు.H-1B వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు లాటరీ విధానంద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే. -
NRI: జాకీర్ హుస్సేన్ మృతిపై ఐఎఎఫ్ సంతాపం
డాలస్, టెక్సస్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్సి) ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐఎఎఫ్సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాల్గు పర్యాయాలు అందుకున్నవారు, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని అన్నారు. పసి ప్రాయంలో ఏడు సంవత్సరాల వయస్సునుండే ఎంతో దీక్షతో తన తండ్రి, సంగీత విద్వాంసుడు అయిన అల్లా రఖా వద్ద తబలా వాయించడంలో మెళుకువలు నేర్చుకుని, విశ్వ వ్యాప్తంగా మేటి సంగీత విద్వాంసులైన రవిశంకర్, ఆలీ అఖ్బర్ ఖాన్, శివశంకర శర్మ, జాన్ మేక్లెగ్లిన్, ఎల్. శంకర్ లాంటి వారెందరితోనో 6 దశాబ్దలాగా పలు మార్లు, ఎన్నో విశ్వ వేదికలమీద సంగీతకచేరీలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న జాకీర్ మృతిపట్ల వారి కుటుంబ సభ్యులుకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, జాకీర్ తో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని, తాను జరిపిన ముఖా-ముఖీ కార్యక్రమ లంకెను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఐఎఎఫ్సి ఉపాధ్యక్షులు తాయబ్ కుండా వాలా, రావు కల్వ ల, కార్యదర్శి మురళి వెన్నం, కోశాధికారి రన్నా జానీ, బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు హాజరయ్యారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థిని నాగశ్రీ వందన పరిమళ మృతి చెందగా ఆమె ఇద్దరు స్నేహితులు గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ (26) ఉన్నత చదువుల కోసం 2022 డిసెంబర్లో అమెరికాకు వెళ్లారు. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్)చదువుతున్నారు.అయితే ఈ తరుణంలో గత శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా, రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో ట్రక్ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళతో పాటు ఆమె స్నేహితులకు పవన్, నికిత్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వందన మరణించగా.. పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా, రోడ్డు ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళ మృతి చెందడంతో తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వందన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అక్కడి అధికారులు, తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎన్ఆర్ఐ అకౌంట్లోని రూ.6.5 కోట్లు మాయం
పంజగుట్ట: ఓ ఎన్ఆర్ఐ ఖాతా నుండి రూ.6.5 కోట్ల నగదును బ్యాంకు సిబ్బంది మాయం చేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ్రస్టేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయకు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుండి ప్రీమియం అకౌంట్ ఉంది. బేగంపేట యాక్సిస్ బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ పాసర్ల, వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్, బ్రాంచ్ హెడ్ శ్రీదేవి రఘు, సురేఖ సైనాలు కలిసి పరితోష్ ఉపాధ్యాయ పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారు. ఈ చెక్కుల ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఆయన సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకు నుండి పలుమార్లు మొత్తం రూ.6.5 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. చెక్కులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారునికి మెసేజ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అంతటితో ఆగకుండా పరితోష్ ఉపాధ్యాయ బ్యాంకు అకౌంట్‌ను పూర్తిగా క్లోజ్ చేశారు. బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీయగా తన బ్యాంకు అకౌంట్ నుండి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్యూన్ పక్కా ప్లాన్.. రూ.10 కోట్ల మోసం -
అత్తగారి కుటుంబంతో సరదాగా.. అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడి ఫొటో వైరల్
వాషింగ్టన్ : అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సతీమణి ఉష చిలుకూరి దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనా.. సాదాసీదాగా నీలిరంగు టీ షర్ట్ ధరించిన జేడీ వాన్స్ తన కుమారుడిని ఎత్తుకున్నారు. తన భార్య ఉష చిలుకూరి తరఫు బంధువులతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతవారం అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోని సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాప్టలిస్ట్ ఆషా జెడేజా మోత్వాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. JD Vance at Thanksgiving -). Reminds me of the big fat Indian wedding…. pic.twitter.com/vzEjODMRZt— Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) December 2, 2024జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడేఅమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిరోహించబోతున్న రిపబ్లికన్ నేత జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామమని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. చిలుకూరి ఉషాబాల ముత్తాత రామశాస్త్రి కొంత భూమిని గ్రామంలో ఆలయం కోసం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే గ్రామస్తుల సహకారంతో సాయిబాబా ఆలయం, మండపాన్ని నిర్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లలోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూరీ్వకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలుసహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఉషా ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి. వీరందరూ ఉన్నత విద్యావంతులే. తొలి భారత సంతతి ‘సెకండ్ లేడీ’ అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్ సంస్థలో పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. శాన్‌డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కార్యనిర్వాహక పదవిలోనూ కొనసాగుతున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్‌లో ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటే కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. వాన్స్‌తో ఉష పరిచయం యేల్ లా స్కూల్లో ఉషా, వాన్స్ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లిచేసుకోవడం విశేషం. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్ ఉన్నారు. భర్త వాన్స్‌కు చేదోడువాదోడుగా ఉంటూ విజయంలో ఉషా కీలకపాత్ర పోషించారు. ‘భార్యే నా ధైర్యం. చెబితే నమ్మరుగానీ ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అని ఉషను పొగడటం తెల్సిందే. -
దిగ్విజయంగా ముగిసిన '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు'
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుఘనంగా ముగిసాయి. మధ్య ప్రాచ్య దేశాలలో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహింపబడిన ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విచ్చేశారు. ఖతార్ లో భారతదేశ రాయబారిశ్రీ విపుల్ కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు. అమెరికా, భారత దేశం, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్, MSME, SERP & NRI సాధికారత శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సుకు ప్రత్యేక అభినందనలు వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్), వంశీ రామరాజు (హైదరాబాద్) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్నా రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి, మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు. వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది. రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై, అబుదాబి, బెహ్రైన్, ఒమాన్, ఖతార్ తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు. -
డాల్లాస్‌లో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
వాషింగ్టన్ : ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి అమెరికా.. ఆంధ్రాలో ఉన్నన్ని సంప్రదాయాలు.. ఆధ్యాత్మికత అక్కడ ఎందుకు ఉంటుంది.. అది అమెరికా.. అక్కడి జనాలు వేరు.. అందరూ మనలా ఉండరు అని అనుకుంటారు. కార్తీకం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇల్లిల్లూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. నిత్యం శివారాధన.. ఆలయాల దర్శనాలు.. పూజలు.. ప్రతి ఊళ్లోనూ శివమాలలు వేసుకునే భక్తులు.. అయ్యప్ప దీక్షలు.. వీధుల్లో శరణుఘోష.. తెల్లారితే శివ స్తోత్రాలతో ఒక ప్రశాంత భావన ఉంటుంది.. ఇదే వాతావరణం అమెరికాలో ఉంటుందా ? ఆహా..అది సాధ్యమేనా .. అక్కడివాళ్లకు ఈ పూజలు భజనలు. మాలలు ఉంటాయా.. అంటే అక్కణ్ణుంచి ఒక పెద్దాయన లైన్లోకి వస్తారు.. భలేవారే మీరు అలా సులువుగా తీసిపడేయకండి. మన మాతృ భూమికి దూరంగా ఉన్నా సరే.. మెం మీకన్నా ఎక్కువగా మన సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం అంటారు. అంతేకాదు తనతోబాటు వందలమందికి ఈ ఆధ్యాత్మిక సౌరభాలను అందించి వారిని కూడా భక్తిమార్గంలో నడిపిస్తున్నారు.అటు కంప్యూటర్ పని ఇటు అయ్యప్ప భజనలు కొమండూరి రామ్మోహన్ .. అయన ఓ టెక్ కంపెనీ సీఈవో.. నిత్యం ప్రాజెక్టులు.. టీమ్ మీటింగులు.. కార్పొరేట్ డిస్కషన్స్ అంటూ ఏడాదంతా బిజీగా ఉంటారు. కానీ కార్తీకంలో మాత్రం అయన ఆ సీఈవో స్థానం నుంచి కాస్తా పక్కకు జరిగి గురుస్వామిగా మారతారు. అమెరికాలోని డల్లాస్.. టెక్సాస్... వాషింగ్టన్ మినియాపోలిస్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని తెలుగు యువతను ఐక్యం చేసి వారిలో భక్తిభావాన్ని నింపుతారు. ఏటా కనీసం ఐదారు వందలమందికి అయ్యప్ప మాలధారణ చేస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మాలవేసుకునే ప్రతి కన్నె స్వామి ఇంటికి వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప పీఠాన్ని పర్యవేక్షించి నిత్య పూజలు భజనలు ఎలా చేయాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి .. మాలధారణ తరువాత మన నడవడిక ఎలా ఉండాలి అనేది పూసగుచ్చినట్లు చెప్పి వారిని స్వాములుగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే పాతికసార్లకు పైగా మల ధారణ చేసిన రామ్మోహన్ గురుస్వామి తాను వీలు కుదిరినప్పుడల్లా శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని మాల విసర్జన చూస్తుంటానని అన్నారు. అయితే అమెరికాలో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి ? వారు మల విసర్జన ఎలా అంటే.. అమెరికాలో ప్రతి పెద్ద నగరంలోనూ అయ్య్యప్ప ఆలయాలు ఉన్నాయని, అక్కడకు వెళ్లి మాలను విసర్జిస్తాం అని అన్నారు.అత్యంత నిష్ఠతో పూజలు భజనలు అమెరికావాళ్లకు అంత టైం ఉండదు.. ఏదో అలా పూజలు చేసేసి మామ అనిపిస్తారు అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా అమెరికాలోనే అత్యంత భక్తిప్రపత్తులతో అయ్యేప్ప మండల దీక్ష చేస్తారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా భక్తులంతా వీలును బట్టి ఇళ్లలోనే పీఠాలు పెట్టుకుంటారు. లేనిపక్షంలో పదిమంది కలిసి ఒక ఇంటిని వేరేగా అద్దెకు తీసుకుని అందులో పీఠం పెట్టుకుంటారు. కొంతమంది ఐతే ఇంట్లోని పీఠంలోనే 18 మెట్లతో కూడిన పీఠం పెట్టుకుని పూజలు చేస్తారు. ముఖ్యంగా అత్యంత ఖర్చుతోకూడిన పడిపూజ చేయడానికి ఎంతో వ్యయప్రయాసలకు సైతం సిద్ధం అవుతారు. జెపి మోర్గాన్‌లో పనిచేసే సిస్టమ్స్ ఆర్కిటెక్ సప్తగిరి పద్మనాభం, ఐటి కంపెనీ మేనేజర్ శ్రవణ్, ఉత్తమ్ కుమార్ అనే మరో సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ తమకు ఈ నెలన్నారా అత్యంత ప్రశాంతమైన భావన కలుగుతుందని, అటు ఉద్యోగాలు.. ఆఫీస్ బాధ్యతలు చూస్తూనే అయ్యప్ప భజనలు.. పూజలు ఎక్కడా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. ఇదంతా తమ గురుస్వామి రామ్మోహన్ గారి ప్రోత్సహంతోనే సాధ్యం అయిందని అన్నారు. ఐటి ఉద్యోగులే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు సైతం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.శరణు ఘోషతో మార్మోగిన డల్లాస్ తొలిసారి దీక్ష తీసుకున్న సప్తగిరి స్వామి మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా మన మనసు ప్రశాంతత వైపు పయనిస్తుందని.. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి సైతం విముక్తి లభిస్తుందని అన్నారు. మొన్న భారీ ఎత్తున చేపట్టిన పడిపూజకు ఐదువందలమంది దీక్షాధారులతోబాటు కనీసం రెండువేలమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రామ్మోహన్ గురుస్వామి మాట్లాడుతూ తాము ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని అక్కడ పడిపూజ చేస్తామని.. ఇది యావత్ డల్లాస్ లో జరిగే పెద్ద కార్యక్రమం అని.. ఇది ఈ ప్రాంతం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని అన్నారు. మనిషి ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా అద్దేఆత్మికత లేకపోతె జీవితానికి సార్థకత లేదని సెప్పే గురుస్వామి రామ్మోహన్ తనకు చేతనైనంత వరకు యువతలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంటానని చెప్పారు. అమెరికాలోనూ అయ్యప్ప ప్రాచుర్యం పొందడం వెనుక ఆ దీక్షలో ఉండే నియమాలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం వంటివే కారణముంది... అందుకే యువత పెద్దసంఖ్యలో ఈ దీక్ష తీసుకుంటున్నారని అయన చెప్పారు.-సిమ్మాదిరప్పన్న. -
అమెరికా ఎన్ఆర్ఐ కుటుంబానికి భారీ పరిహారం
హైదరాబాద్: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కోర్ ట్రాకర్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్మెంట్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి కొల్లి మణిదీప్ కుటుంబానికి ఆ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించిందంటూ సంస్థ చైర్మన్ విక్రంసాగర్ పసాలను అభినందించారు.శనివారం మాదాపూర్ టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మణిదీప్ కుటుంబానికి భారీ నష్టపరిహారం (5.4 కోట్ల రూపాయలు) చెక్కును మంత్రి ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఐటీ టెక్నాలజీ సంస్థ కోర్ ట్రాకర్ కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ క్యూ ఆరిఫ్ బలమైన ఆధారాలు సేకరించి అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని వాదనను సమర్థవంతంగా వినిపించారని కొనియాడారు.చదవండి: కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ -
ఉన్నత చదువులకు వెళ్లి.. అనంతలోకాలకు
ఖమ్మంక్రైం: ఉన్నత చదువులు పూర్తి కాగానే తమ కుమారుడు ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. కుమారుడిని గొప్ప స్థాయిలో చూడాలని ఆశించి వారు అమెరికాకు పంపించగా అక్కడ దుండుగులు జరిగిన కాల్పుల్లో మృతి చెందాడనే సమాచారం అందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎంబీఏ చదివేందుకు వెళ్లిన ఐదు నెలల్లోనే జిల్లాకు చెందిన నూకారపు సాయితేజ(25) మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.అక్క అక్కడే..ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి ఖమ్మం రాపర్తినగర్‌లోని రమణగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య వాణితో పాటు కుమార్తె ప్రియ, కుమారుడు సాయితేజ ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే ప్రియ అమెరికాకు వెళ్లగా ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. కుమారుడైన సాయితేజ హైదరాబాద్‌లో ఇంటర్, బీబీఎం పూర్తిచేశాక అమెరికా ఎంబీఏ చేసేందుకు పంపించారు. ఆయనకు చికాగో ప్రాంతంలోని కాంకాడ్సి యూనివర్సిటీలో సీటు రావడంతో ఈ ఏడాది జూన్ 15వ తేదీన అక్కడకు బయలుదేరాడు. అమెరికా వెళ్లాక సాయితేజ మరికొందరు స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటూ పార్ట్‌టైం ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. ఖమ్మంలో ఉన్న తల్లిదండ్రులకే కాక అమెరికాలోని మరో ప్రాంతంలో ఉన్న తన సోదరి ప్రియకి ఫోన్ చేస్తుండేవాడు. వారంలో కనీసం మూడు రోజులైనా గ్రూప్ కాల్ మాట్లాడుకునేవారు. ఎంబీఏ పూర్తికాగానే మంచి ఉద్యోగం సాధిస్తానని, తల్లిదండ్రులను సైతం అమెరికా తీసుకెళ్తానని తరచుగా చెప్పేవాడు.ఏం జరిగింది...సాయితేజ అమెరికాలోని ఓ స్టోర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఆయన క్యాష్‌కౌంటర్‌లో ఉండగా తుపాకులతో వచ్చిన దుండగులు బెదిరించడంతో డబ్బులు ఇచ్చేసి పక్కన నిల్చున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ దుండగులు అతి సమీపం నుంచి కాల్చడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆయన స్నేహితులకు తెలపడంతో వారు కోటేశ్వరరావుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. కాగా, శుక్రవారం కూడా సాయితేజ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడగా శనివారం ఫోన్ కోసం ఎదురుచూస్తుండగా పిడుగు లాంటి వార్త తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. తల్లి వాణికి మృతి చెందినట్లు కాకుండా గాయాలయ్యాయని మాత్రమే చెప్పారు. అమెరికాలోని తానా సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడి సాయి మృతదేహాన్ని త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో ఐదు రోజుల్లో మృతదేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ఎంపీలు, ఎమ్మెల్సీ సంతాపంఖమ్మం మయూరిసెంటర్/ఖమ్మంవన్‌టౌన్: అమెరికాలో ఖమ్మం విద్యార్ధి నూకారపు సాయితేజ మృతి చెందడంపై ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. అలాగే, అమెరికా నుంచి సాయితేజ మృతదేహాన్ని త్వరగా రప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. కాగా, సాయితేజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరామర్శించారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మం త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని తానా బాధ్యులైన లావు అంజయ్య చౌదరి, లావు శ్రీనివాస్ తదితరులను ఫోన్లో కోరారు. ఎమ్మెల్సీ వెంట నాయకులు బెల్లం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. -
భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్‌పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి! సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది. “ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్‌లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్‌లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్‌ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Mustafa Jewellery Singapore (@mustafajewellerysg) -
తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం'
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగ్ఙు పేరిట నిర్వహిస్తున్న 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “మన భాష మన యాస “మాండలిక భాషా అస్తిత్వం అనే కార్యక్రమం వైభవంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం పలికి వివిధ ప్రాంతాల మాండలిక భాషలు వాటి సొగసును సోదాహరణంగా వివిరించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే గాక తెలుగునేలనుండి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో పాటు శ్రీలంక, మయన్మార్, మారిషస్ మొదలైన దేశాలకు వలసవెళ్ళిన తెలుగు కుటుంబాలవారు కూడా వివిధ రకాల యాసలతో తెలుగు భాషను సజీవంగా ఉంచడానికి శతాబ్దాలగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాండలిక భాషలోఉన్న సహజ సౌందర్యం నిరాదరణకు, నిర్లక్ష్యానికీ గురికాకుండా అస్తిత్వం నిలుపుకుంటూ మాండలిక భాషలో ఎంతో సాహిత్య సృజన చేయవలసిన అవసరం ఉందన్నారు మన దేశంలోనే ఒక లంబాడీ గిరిజన మహిళ ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎన్నికకాబడిన తొలి మహిళ ‘వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ’ ఉపకులపతి ఆచార్య డా. సూర్యా ధనంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని “ఇలాంటి ముఖ్యమైన అంశంమీద సమావేశం నిర్వహిస్తున్న తానా ప్రపంచసాహిత్యవేదిక కృషిని అభినందిస్తూ, మాండలిక భాషలతో పాటు, లిపిలేని లంబాడీ భాషల లాంటి భాషలకు లిపిని కల్పించి పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లిపి ద్వారా ఆయా తెగల జీవన విధానం, ఆచార వ్యవహారాలను సజీవంగా చిత్రీకరించవచ్చు అన్నారు.్ఙ విశిష్టఅతిథిగా పాల్గొన్న సుప్రసిద్ధ రచయిత, ఆంధ్రప్రదేశ్ పూర్వ భాషా, సాంస్కృతిక శాఖా నిర్దేశకులు డా. డి. విజయభాస్కర్ ‘ఉత్తరాంధ్ర యాస’ అస్తిత్వంపై శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం ప్రాంతాల ప్రజల యాసల మాధుర్యాన్ని, ఆ సాహిత్య సృజనచేసిన ఆయా ప్రాంత కవుల, రచయితల పాత్రను వివరించారు. లిపిలేని “రెల్ల్ఙి జాతికి చెందిన ప్రముఖ రచయిత మంగళగిరి ప్రసాదరావు పారిశుద్ధ్య కార్మికులుగా రెల్లి కులస్తులు చేస్తున్న సేవ, రెల్లి భాషకు లిపి కల్పిస్తేనే, ఇంకా ఎక్కువ సాహిత్యం వస్తేనే, వారి జీవనవిధానం పైన యితరులకు అవగాహన కలుగుతుంది అన్నారు. విద్యారంగంలో 50కు పైగా డిగ్రీలు సాధించిన అరుదైన విద్యావేత్త, వృత్తిపరంగా మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరంవాసి, ‘అర్థంపర్థం’ అనే శీర్షికతో ఇప్పటికే ఏడువందలకు పైగా ఎపిసోడ్స్ రాసిన తెలుగు భాషాభిమాని డా. కర్రి రామారెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. చింతకుంట శివారెడ్డి రాయలసీమ మాండలికంలో నిత్యం వాడుకలోఉండే అనేక పదాలకు అర్థాలు, వాటి విశిష్టతను ఆసక్తికరంగా పంచుకున్నారు. తెలంగాణ ప్రాంత వాసి, ప్రస్తుతం కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాశిలో భాషాశాస్త్రంలో సహయాచార్యులుగా ఉన్న డా. గట్ల ప్రవీణ్ తెలంగాణా భాషా మాధుర్యాన్ని, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మాండలిక భాషల వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదికమీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకు మాత్రమే సాధ్యమైంది అన్నారు. ఎంతో సమయం వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును: https://youtube.com/live/pd6wroBTRLg -
జపాన్‌లో ‘తాజ్’ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు
పుణ్య కార్తీకమాసం సందర్భంగా వనభోజనాల కార్యక్రమాన్ని జపాన్‌లోని తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. జపాన్‌లో నవంబర్ 24, ఆదివారం, తాజ్ (Telugu Association of Japan) అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ వేడుక ఆద్యంతం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం పిల్లలు, పెద్దలు విందు భోజనాన్ని ఆరగించారు. -
దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!
చాలామంది భారతీయులు ఎక్కువగా విదేశాల్లోనే స్థిరపడుతున్నారు. ఇక అక్కడ ఉండే మన వాళ్లకు కొన్ని విషయాల్లో మన భారత్‌లో ఉన్నట్లు కుదరదు. ఆ దేశ నియమ నిబంధనలకు అనుగుణంగా మలసుకోక తప్పదు. అలాంటి వాటికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్ నెట్టింట షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె ఆ వీడియోలో మన భారతీయ వంటకాల వాసనలు దుస్తుల నుంచి రాకూడదంటే ఏం చేయాలో.. కొన్ని చిట్కాలను షేర్ చేశారు.మన భారతీయులు వంట చేయగానే కూర వాసన చూస్తారు. ఆ తర్వాత రుచి ఎలా ఉందో చూస్తాం. పైగా ఆ ఘుమ ఘుమలు వండిన వాళ్ల శరీరం నుంచి రావడం మాములే. కానీ పాశ్చాత్యా దేశాల్లో ప్రజల తీరు చాలా క్లీన్‌గా.. క్రమపద్ధతిలో ఉంటుంది. అక్కడ ఆహారాలన్నీ మన వంటకాల మాదిరి ఘుమఘుమలు రావు. అందువల్ల బట్టలకు గనుక కూర వాసన వస్తే చాలు వాళ్లు భారతీయులు అన్నట్లు గుర్తించడమే గాక అదోలా ముఖాలు పెట్టుకుంటారు కూడా. అందువల్ల ఆ వాసన రాకుండా కాస్త జాగ్రత్తలు తప్పనిసరి ఆ విషయాన్నే కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్ నెట్టింట షేర్ చేసింది. తనకు కూడా అలా దుస్తుల నుంచి కూరల వాసన రావడం ఇష్టముండదట. అలా కర్రీ వాసన రాకుండా ఎలా జాగ్రత్తపడాలో కొన్ని చిట్కాలు కూడా చెప్పుకొచ్చింది. మన భారతీయ వంటకాల్లో ఉల్లిపాయలు, మసాలాలు ఉంటాయి. వాటి ఘాటు వాసన దుస్తులను అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి వంట చేసేటప్పడు ధరించిన బట్టలనే బయటకు వెళ్లేటప్పడు ధరించొద్దని అంటున్నారు. అలాగే వంట చేసే సమయంలో జాకెట్లు ధరించకపోవడమే మంచిదని సూచించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఆమెది శ్వేతజాతీయుల భావన అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shivee Chauhan | Indian in USA | Desi Lifestyle (@shiveetalks) (చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!) -
దుబాయ్‌లో ఘనంగా కార్తీక వనభోజన మహూత్సవం
క్రోధి నామ సంవత్సర బ్రాహ్మణ కార్తిక వనసమారాధనన కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరమ్ న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాన్సమమ్మాసాలన్నిటిలో మహిమాన్వితమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. ఇటువంటి పవిత్ర కార్తీక మాసంలో, శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి, రావి, తులసి, జమ్మి వంటి దేవతా వృక్షాల చెంత వనభోజనాలు, ఉసిరి కాయలతో దీపారాధన వంటివి భారతావనిలో సర్వసాధారణం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అన్ని ఎమిరేట్స్ నుంచి వందలమంది ఉభయ రాష్ట్రాల తెలుగు బ్రాహ్మణులు అందరూ కలసి దుబాయిలోని అల్ మంజార్ బీచ్ పార్క్‌లో కార్తీక వనసమారాధనను నవంబర్ 17, ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.గాయత్రి మహిళల భక్తి గీతాలు, దీపాధనలతో ప్రారంభం అయిన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు, పాటలు, కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. సంప్రదాయ తెలుగు రుచుల కార్తిక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి, ఆటలు, తంబోల, కామేశ్వరరావు హాస్యభరిత సందేశ కార్య్రాక్రమం, ఆదిభట్ల కామేశ్వరశర్మ ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బాహూకరించారు. యుఎఈలో సనాతనం, సంఘటితం, సత్సంగం, సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా ఏర్పడిన గాయత్రీ కుటుంబం (తెలుగు బ్రాహ్మణ సంఘం) ఆధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది. కుటుంబ సభ్యులు కల్లేపల్లి కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులు అందరూ ప్రగాఢ సహానుభూతి ప్రకటించి నివాళులు అర్పించారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా
ఉన్నత చదువులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం అమెరికా. అగ్రరాజ్యంలో చదువుకోవడం, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవడం ప్రపంచవ్యాప్తంగా యువత కల. అమెరికాకు విద్యార్థులను పంపించడంలో చైనా ముందంజలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ దక్కించుకుంది. అమెరికాలో ప్రస్తుతం 3.3 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపిస్తున్న దేశాల జాబితాలో భారత్ తొలిస్థానంలో నిలవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ‘ఓపెన్ డోర్స్’సోమవారం తమ నివేదికలో వెల్లడించింది. 2022–23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చైనా విద్యార్థులే అధికంగా ఉండేవారు. ఆ తర్వాతి స్థానం భారతీయ విద్యార్థులది. సంవత్సరం తిరిగేకల్లా పరిస్థితి మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి స్థానంలో భారతీయ విద్యార్థులు, రెండో స్థానంలో చైనా విద్యార్థులు ఉన్నారు. ⇒ 2023–24లో అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022–23లో 2,68,923 మంది ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఈసారి ఏకంగా 23 శాతం పెరిగింది. ⇒అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 29 శాతం కావడం గమనార్హం. ⇒ఇండియా తర్వాత చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలున్నాయి. ⇒చైనా విద్యార్థులు 2.77 లక్షలు, దక్షిణ కొరియా విద్యార్థులు 43,149, కెనడా విద్యార్థులు 28,998, తైవాన్ విద్యార్థులు 23,157 మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ⇒2008/2009లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉండేవారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి పునరావృతమైంది. ⇒ ఒక విద్యా సంవత్సరంలో 3,31,602 మంది అమెరికాలో చదువుకుంటుండడం ఇదే మొదటిసారి. ⇒అంతర్జాతీయ గ్రాడ్యుయేట్(మాస్టర్స్, పీహెచ్డీ) విద్యార్థులను అమెరికాకు పంపుతున్న దేశాల జాబితాలో ఇండియా వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలుస్తోంది. ఇండియన్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 19 శాతం పెరిగి 1,96,567కు చేరుకుంది. ⇒ఇండియన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 13 శాతం పెరిగి 36,053కు చేరింది. ఇండియన్ నాన్–డిగ్రీ విద్యార్థుల సంఖ్య 28 శాతం తగ్గిపోయి 1,426కు పరిమితమైంది. ఓపెన్ డోర్స్ రిపోర్టును ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ప్రచురించింది. ఈ సంస్థను 1919లో స్థాపించారు. అమెరికాలోని విదేశీ విద్యార్థులపై ప్రతిఏటా సర్వే నిర్వహిస్తోంది. వారి వాస్త వ సంఖ్యను బహిర్గతం చేస్తోంది. 1972 నుంచి యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్, కల్చరల్ అఫైర్స్ కూడా సహకారం అందిస్తోంది. -
‘ఐక్యరాజ్య సమితి’లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సందర్శించారు. అంతకు ముందు.. జనరల్ అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ప్రవచించిన శాంతి, అహింస, ఐక్యత ప్రపంచానికి ఆదర్శమైందని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ కు భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి సభ్యులుగా వెళ్లిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ అవకాశంపై ఆయన స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. This week, I am in New York as part of India’s Non-Official Delegation to the 79th Session of the UNGA. Engaging with global stakeholders on critical issues of peace and conflict, we have had the opportunity to interact with UN organizations and representatives from the Permanent… pic.twitter.com/2pMdbTiTvX— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024శాంతి, అంతర్యుద్ధాలు.. లాంటి ఎన్నో అంశాలపై భారత్, ఇతర దేశాల ప్రతినిధులు సాధారణ అసెంబ్లీలో మాట్లాడతారు. నవంబర్ 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది.Offered floral tributes at the Mahatma Gandhi Bust on the United Nations Lawn during the 79th Session of the UNGA. A moment to honor the ideals of peace, nonviolence, and unity that continue to inspire the world. #UNGA79 #MahatmaGandhi #PeaceForAll #GlobalUnity pic.twitter.com/elppFhiAun— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024 -
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్‌లోని వాక్ ఇన్ ఒవెన్‌లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్‌లోని వాల్‌మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్‌లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం. -
కారు డిక్కీలో శవమై తేలిన యువతి : పరారీలో భర్త!
భారత సంతతికి చెందిన మహిళ లండన్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. లండన్‌లోని కారు ట్రంక్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం హత్యగా అనుమానిస్తున్న నార్తాంప్టన్‌షైర్ పోలీసులు హర్షిత భర్త పంకజ్ లాంబా కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతగాడు దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు.హర్షిత బ్రెల్లా (24) మృతదేహాన్ని తూర్పు లండన్‌లోని ఇల్ఫోర్డ్లోని బ్రిస్బేన్ రోడ్లో గురువారం తెల్లవారు జామున వాలెంటైన్స్ పార్క్ ప్రవేశానికి సమీపంలో, ఒక కారు డిక్కీలో గుర్తించారు. ఆమెను భర్తే హత్య చేశాడని అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం హర్షిత గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇరుగుపొరుగువారు అందించిన సమాచారం ప్రకారం గత రెండు రోజులుగా హర్షిత ఆందోళనగా కనిపించింది. చనిపోవడానికి ముందు ఇద్దరి మద్యా వాగ్వాదం జరిగిందని, అయితే భార్యాభర్తల వ్యవహారం కాబట్టి తాను పట్టించుకోలేదని ఒక మహిళ వెల్లడించింది. వరుసగా ఇలాంటి ఘర్షణలను తాను గమనించినా కల్పించుకోలేదని, ఇపుడు ఆ బిడ్డ ప్రాణాలే కోల్పోవడం తనకు చాలా బాధగా ఉందని, అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను అంటూ హర్షితకు పొరుగున ఉండే కెల్లీ ఫిలిప్ ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు శుక్రవారం నాడు జరిగిన ఫోరెన్సిక్ పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్టు నార్త్మ్ప్టన్షైర్ పోలీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ పాల్ క్యాష్ ఆదివారం ధృవీకరించారు. హర్షిత మృతదేహాన్ని నార్తాంప్టన్‌షైర్ నుండి ఇల్‌ఫోర్డ్‌కు కారులో తరలించినట్లు అనుమానిస్తున్నామన్నారు. నిందితుడు దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షునిగా గడప రమేష్ బాబు ఎన్నిక
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గడపా రమేష్ బాబు ఎంపికయ్యారు. నవంబర్ 17వ తేదీన జరిగిన పదకొండో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సభ ప్రారంభంలో సభ్యులందరు గోనె నరేందర్ రెడ్డి సొసైటీకి చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం 2023-2024 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చు వివరాలకు సభ ఆమోదం తెలిపింది.2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గార్లపాటి లక్ష్మా రెడ్డి, బండారు శ్రీధర్‌కు సభ్యులు కృతజ్ణతలు తెలిపారు. అలాగే రెండోసారి అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన గడప రమేశ్ బాబు, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి దోర్నాల చంద్ర శేఖర్ ప్రకటించారు. తనకు రెండోసారి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు గడప రమేష్ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కార్య, కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా కిరణ్ కైలాసపు , తెల్లదేవరపల్లి వెంకట కిషన్ రావును కొత్త ఆడిటర్లుగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ముఖ్యమైన మార్పులు గత 8 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన బసిక ప్రశాంత్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా, ప్రాంతీయ కార్యదర్శులుగా సేవలు అందించిన బొందుగుల రాము, నంగునూరు వెంకట రమణ ఈ సారి ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారిగా, కోశాధికారిగా సేవలు అందించిన జూలూరి సంతోష్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా సేవలు అందించబోతున్నారు. దీంతో నూతన కార్యవర్గం మరియు కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, దుర్గ ప్రసాద్ ఎం, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు, శశిధర్ రెడ్డి, బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, సంతోష్ వర్మ మాదారపు మరియు రవి కృష్ణ విజ్జాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, శివ ప్రసాద్ ఆవుల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రవి చైతణ్య మైసా, చల్లా క్రిష్ణ మరియు సుగుణాకర్ రెడ్డి మొదలగు వారు ఉన్నట్టు తెలిపారు. సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, గింజల సురేందర్ రెడ్డి, ఆరూరి కవిత సంతోష్ రెడ్డి, నగమడ్ల దీప, కిరణ్ కుమార్ వీరమల్లు & రంగా పట్నాల గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి
తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్ విద్యాభవన్‌లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్‌లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు హాజరయ్యారు.మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్ బ్రిటిష్ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్,అంతకు ముందు.. భవన్ యూకే చైర్మన్ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎన్ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. -
ట్రంప్ 2.0 అమెరికాలో భారతీయ విద్యార్థుల భవిష్యత్ ఏంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి ఎంపికయ్యాడు. గతంలో ట్రంప్ విదేశీ వలసలు, గ్రీన్ కార్డులు, వీసాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అమెరికా డాలర్‌డ్రీమ్స్ కంటున్న విద్యార్థుల భవిష్యత్ ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలను చూద్దాం.ట్రంప్ 2.0లో ప్రభావితమయ్యే మరో అంశం స్టూడెంట్స్ వీసాలు, ఉద్యోగాలు. ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి H1B వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారనున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే.. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది.లే ఆఫ్.. ఆర్థిక మాంద్యం.. ఆంక్షలు, నిరుద్యోగం వంటి సమస్యలు అమెరికాలో భారతీయ విద్యార్థులను వెంటాడే సమస్యలు. అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్‌కు భారత్ పోల్చితే అమెరికాలో వేతనాలెక్కువ. డాలర్ ప్రభావం కూడా అధికం. అమెరికాలో 4500కు పైగా యూనివర్సిటీలు, 8 వేలకు పైగా కాలేజీలున్నాయి. విదేశీయులు జాయిన్ అయితేనే అమెరికాలో వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్ వీసాలకు ఢోకా ఉండదనే చెప్పాలి. ఇక అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? మరి ఇది అమలవుతుందా? లేదా? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది. ఉద్యోగ అవకాలు పెరుగుతాయా.. ?ట్రంప్ విధానాల కారణంగా అమెరికా సిటిజన్స్, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్ ఫోర్స్‌కు డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో హెచ్1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది.అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ఆయన కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. దీంతో H1B,OPT వారికి కూడా జాబ్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లీగల్ గా వర్క్ చేసే వారికి ట్రంప్ పాలనలో మంచి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఇల్లీగల్ గా అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది. అక్రమ వలసదారులు పట్ల ట్రంప్ వైఖరిఇక అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి.ట్రంప్ విధానాలు వలసవచ్చిన వారికి గతంలో చాలా సమస్యలు సృష్టించాయి. భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ట్రంప్ వలసల విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం. అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే, అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భారత టెక్ కంపెనీలు సైతం అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి. ఇదీ చదవండి : ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక ఎదురు దెబ్బనా?ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి..అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.- సింహబలుడు హనుమంతు -
ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగి ఉన్న అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇమ్మిగ్రేషన్, H1B, F1 వీసాలపై ట్రంప్ 2.O ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికాలో విదేశీయుల విద్యకు ట్రంప్ విజయం అనుకూలమా? వ్యతిరేకమా? మరి అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? అమలు చేస్తాడా? లేదా ? అందరి మదిలో ఇదే ప్రశ్న.. మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న ట్రంప్ అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది. స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ, విదేశాంగ విధానంపై ఎన్నికల సమయంలో ట్రంప్ అనేక హామీలు ఇచ్చారు.ఇమ్మిగ్రేషన్ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమ్మిగ్రేషన్. భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలమంది H1B వీసాలపై వెళుతుంటారు. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం.. ట్రంప్ విజయానికి ఒక కారణం.గ్రీన్ కార్డు నిబంధనలు : మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనుంది.అమెరికా పౌరసత్వం ఎవరికి వస్తుంది..? ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. ఇది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది.అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి. కాగా ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి. -
ఫిలిప్పీన్స్‌లో తెలుగు యువతి అనుమానాస్పద మృతి
డాక్టర్ అన్న కోరికతో విదేశాలకు వెళ్లిన 20 ఏళ్ల యువతి అనూహ్య మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు కెందిన స్నిగ్ధ వైద్య విద్య అభ్యసించ డానికి ఫిలిప్పీన్స్ వెళ్లింది. పుట్టినరోజు నాడే అనుమానాస్పదంగా మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయింది.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో పంచాయతీ పరిధిలో నివాస ముంటున్నారు చింత అమృత్ రావు. మెదక్‌లోని ట్రాన్స్‌కో డీఈ అమృతరావు కుమార్తె స్నిగ్ధ రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లింది. పర్ఫెచువల్ హెల్ప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు కానీ పుట్టిన రోజు విషెస్ చెబుతామని ఫోన్ చేస్తే అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికి కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఏం జరిగిందో అర్థంకావడం లేదని, తమ పాప చాలా ధైర్యవంతురాలని స్నిగ్ద తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని, తమ బిడ్డ మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన అధికారులు ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్నిగ్ధ మరణానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్
అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో నవంబర్ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్‌గా నిలిచిన ఈ ఈవెంట్ సుమారు 120,000 డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్, రతన్ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. కొంతమంది దాతలను సత్కరించారు. అలాగే మరో ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు , ఆంధ్రప్రదేశ్‌కు రెండు దాతలు ముందుకు వచ్చారు.కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం $4,875 సేకరించాము, ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, గార్లు టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్ కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్‌కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది శంకర నేత్రాలయ.ఈ కార్యక్రమం పట్ల హాజరైన వారందరూ ప్రశంసలు వ్యక్తం చేయగా, ఫీనిక్స్ శాఖలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. షైనింగ్ స్ప్రౌట్స్ మరియు లవింగ్ కైండ్‌నెస్ బృందాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంస్థ, శంకర నేత్రాలయ మిషన్‌ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. -
ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకో శాఖ..సారథులుగా మస్క్, వివేక్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత మూలాలున్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. యంత్రాంగంలో సమూల ప్రక్షాళన కోసం వారి సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ఏర్పాటును ప్రకటించారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరిన నిబంధనలకు కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్ వ్యవస్థీకరణ తదితరాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. ఇందుకు ‘ది గ్రేట్’ మస్క్, ‘అమెరికా దేశభక్తుడు’ వివేక్ నాయకత్వం వహిస్తారు. తమ అమూల్య సలహాలతో సేవ్ అమెరికా ఉద్యమానికి మార్గదర్శనం చేస్తారు’’ అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 ఏళ్లు నిండే 2026 జూలై 4వ తేదీకల్లా ప్రక్షాళన ప్రక్రియను పూర్తి చేయాలని మస్క్, వివేక్‌లకు డెడ్‌లైన్ విధించారు. ‘డోజ్’ను ఈ కాలపు మన్హాటన్ ప్రాజెక్టుగా ట్రంప్ అభివరి్ణంచారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబుల నిర్మాణానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘మన్హాటన్’. డోజ్ పనితీరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఫెడరల్ అడ్వైజరీ కమిటీ చట్టం పరిధిలోకి రావచ్చంటున్నారు. ప్రభుత్వోద్యోగులు ఆస్తులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే మస్క్, రామస్వామి ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచే పనిచేస్తారని ట్రంప్ చెప్పడంతో ఆ నిబంధన వారికి వర్తించే అవకాశం లేదు. గతంలోనూ అమెరికా అధ్యక్షులు ఇలా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన రొనాల్డ్ రీగన్ 1981–1989 మధ్య ‘గ్రేస్ కమిషన్’ను స్థాపించారు. ఇక ప్రకంపనలే: మస్క్ డోజ్ ఏర్పాటును మస్క్ స్వాగతించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చన్నారు. పారదర్శకత కోసం డోజ్ చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రజా ధనం వృ«థాను అరికట్టేందుకు లీడర్ బోర్డ్ ఏర్పాటవుతుందని తెలిపారు. ట్రంప్ టీమ్‌లో తొలి భారత అమెరికన్ ట్రంప్ 2.0 టీమ్‌లో చోటు సంపాదించిన తొలి భారత అమెరికన్‌గా 39 ఏళ్ల వివేక్ నిలిచారు. డోజ్ ఏర్పాటుపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనలో సున్నితంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. కాలం చెల్లిన పలు ఫెడరల్ ఏజెన్సీలను తొలగించాలంటూ ప్రచార పర్వంలో రిపబ్లికన్లు తరచూ ఉపయోగించిన నినాదం ‘షట్ ఇట్ డౌన్’ను ఈ సందర్భంగా రీ పోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు వివేక్ పూర్తిస్థాయిలో మద్దతివ్వడం తెలిసిందే. ట్రంప్ విజయానంతరం పలు టీవీ షోల్లో మాట్లాడుతూ ఆయన్ను ఆకాశానికెత్తారు. వివేక్ 1985 ఆగస్టు 9న ఒహాయోలోని సిన్సినాటిలో జని్మంచారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన కేరళ బ్రాహ్మణులు. ఆయన ఒహాయోలోని రోమన్ కాథలిక్ స్కూల్లో చదివారు. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో పట్టా పొందారు. యేల్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. హెడ్జ్ ఫండ్ ఇన్వెస్టర్‌గా చేశారు. యేల్లో డిగ్రీ పూర్తవకముందే మిలియన్ల కొద్దీ సంపాదించానని చెప్పుకుంటారు. 2014లో ఓ బయోటెక్ కంపెనీని స్థాపించారు. 2023 నాటికే వివేక్ సంపద ఏకంగా 63 కోట్ల డాలర్లని ఫోర్బ్స్ అంచనా వేసింది. 18 ఏళ్లకే అద్భుత ప్రసంగం హైసూ్కల్ విద్యారి్థగా సెయింట్ 18 ఏళ్ల వయసులో జేవియర్ స్కూల్లో వివేక్ చేసిన ప్రసంగ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రసంగం పొడవునా ఆయన కనబరిచిన ఆత్మవిశ్వాసం, భవిష్యత్తును గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Congratulations to @elonmusk and @VivekGRamaswamy on this historic achievement! $DOGE #DonaldJTrump #ElonMusk #MAGA #TrumpVance2024 #VivekRamaswamy pic.twitter.com/6b98v4hyyO— Brock W. Mitchell (@BrockWMitchell) November 13, 2024 -
Canada: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు
ఒట్టావా: కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని, హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. Chief of Police with the Peel Regional Police in Canada, Nishan Duraiappah writes to Brampton Triveni Mandir & Community Centre, requesting them to consider rescheduling the upcoming Consular Camp at the Brampton Triveni Mandir & Community Centre on November 17, 2024."We…— ANI (@ANI) November 12, 2024నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు -
ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె రామసహాయం రాధిక అమెరికాలోని కొలంబస్లో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా, రాధికను అమెరికాలో ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ అడ్వయిజరీ బోర్డు సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారని ఆమె తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు.రాధికకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన రఘురాంరెడ్డితో 2006లో వివాహం జరగగా, ఆయనతోపాటు అమెరికా వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరి అంచెలంచలుగా కంపెనీలో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. 2009 నుంచి వివిధ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో రాధికకు ఈ అవకాశం వచ్చిందని బుచ్చిరెడ్డి తెలిపారు. 2026 వరకు అమె ఈ పదవిలో కొనసాగుతారని చెప్పారు. -
లండన్‌లో ఘోర ప్రమాదం, చావు బతుకుల మధ్య హైదరాబాద్ యువతి
ఉపాధికోసం విదేశాలకు వెళ్లిన యువతిని దురదృష్టం వెంటాడింది. హైదరాబాద్‌కు చెందిన బాధిత యువతి ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనలో పడిపోయారు.హైదరాబాద్ దిల్ సుఖ్‌నగర్ సమీపంలోని మారుతి నగర్‌కు చెందిన హిమ బిందు ఉద్యోగం కోసం లండన్ వెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్ హిమ బిందును డీకొట్టింది దీంతో ఆమెకు తీవ్ర గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమ బిందు ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ యాక్సిండెట్ గురించి అధికారులు బిందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్‌ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
అమెరికా ఎన్నికల్లో ఎన్నారైల సత్తా.. ఎంతమంది గెలిచారంటే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని విజయాన్ని నమోదు చేసుకున్నారు. పాపులర్ ఓటింగ్ ద్వారానే ఆయన తన గెలుపును ఖరారు చేశారు. అదే సమయంలో.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతి పౌరులు (ఎన్నారై) సైతం తమ సత్తా చాటారు. అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. వీరిలో ఆరుగురు విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోసారి బరిలోకి దిగిన ఐదుగురు సీనియర్ నాయకులు.. విజయాన్ని దక్కించుకున్నారు.1. రాజా కృష్ణమూర్తి(51): డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బలమైన నాయకుడు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్(8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా అయిదోసారి గెలుపొందారు. 2017 నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2. రో ఖన్నా(48): డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రో ఖన్నా..2017 నుంచి కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడే బరిలో దిగిన ఆయన మరోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి అనితా చెన్ను ఓడించి విజయం సాధించారు.3. సుహాస్ సుబ్రమణ్యం(38): డెమొక్రాటిక్ అభ్యర్థిగా వర్జీనియా (10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి బరిలో దిగిన సుహాస్ సుబ్రమణ్యం.. రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ క్లాన్సీని ఓడించి విజయం సాధించారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా వ్యవహరిస్తున్న ఆయన... డెమొక్రాట్లకు కంచుకోట రాష్ట్రంగా పేరున్న వర్జీనియా నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుబ్రమణ్యన్ రికార్డు సృష్టించారురు. గతంలో అధ్యక్షుడు ఒబామాకు వైట్ హౌస్ సలహాదారుగా కూడా సుహాస్ పనిచేశారు.4. శ్రీథానేదార్(69): మిచిగాన్ (13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి బరిలోకి దిగిన శ్రీ థానేదార్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన ప్రత్యర్ధి రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతం ఓట్ల తేడాతో ఓడించి, రెండవసారి గెలుపును దక్కించుకున్నారు. ఈయన 2023 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.5. డాక్టర్ అమిబెరా(59): వృత్తి పరంగా వైద్యుడు అయిన అమిబెరా.. సీనియర్ మోస్ట్ ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు.2013 నుంచి కాలిఫోర్నియా(6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి బరిలోకి దిగిన అమిబెరా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయాన్ని సాధించారు.6. ప్రమీలా జయపాల్(59): డెమోక్రటిక్ నేత ప్రమీలా జయపాల్ వాషింగ్టన్( 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నేత డాన్ అలెగ్జాండర్‌ను ఓడించి తిరిగి ఎన్నికయ్యారు.అమిష్ షా: భారతీయ సంతతికి చెందిన అమిష్ షా... అరిజోనా(1వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అతను రిపబ్లికన్‌కు చెందిన డేవిడ్ ష్వీకర్ట్ కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు విజయం దక్కించుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ స్క్యూకెర్ట్‌తో అమిష్ తలపడుతుండడం గమనార్హం. కాగా అరిజోనా రాష్ట్ర అసెంబ్లీకి వరుసగా మూడు సార్లు(2018, 2020, 2022) ఎన్నికయ్యారు షా. -
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీపి కబురు అందించింది. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించవచ్చు.ఎన్నారైలు ఇక నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్‌ఫోన్ నుండి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించవచ్చు. తద్వారా విదేశాల నుండి లావాదేవీలను నిర్వహించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కొత్తగా నమోదైన యూపీఐ ఐడీల ద్వారా తొలి 24 గంటల్లో రూ.5,000 మాత్రమే పంపేందుకు వీలుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు రూ.1 లక్ష పంపొచ్చు.ఇవీ బ్యాంకులు..యూపీఐ కోసం అంతర్జాతీయ మొబైల్ నంబర్ల అనుసంధానానికి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ మద్దతు ఇస్తున్నాయి.అంతర్జాతీయ మొబైల్ నంబర్లకు అనుకూలమైన యూపీఐ అప్లికేషన్లలో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, భీమ్ ఏయూ, ఫెడ్‌మొబైల్, ఐమొబైల్, భీమ్ ఇండస్ పే, ఎస్ఐబీ మిర్రర్ ప్లస్ వంటివి ఉన్నాయి. ఎన్నారైలు తమ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్వో ఖాతాల మధ్య, అలాగే భారత్‌లోని ఖాతాలకు యుపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎన్ఆర్వో ఖాతా నుండి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయలేరు. విభిన్న బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న ఎన్నారైలు ప్రతి ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ అవసరం. ఖాతా ఉమ్మడిగా ఉంటే ప్రాథమిక ఖాతాదారు మాత్రమే యూపీఐని ఉపయోగించగలరు. -
లండన్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్
నవంబర్ 5-7 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో భారతదేశం పాల్గొంటుంది.ఇన్‌బౌండ్ టూరిజంను మెరుగుపరచడం , దేశాన్ని ప్రధాన ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా ఉంచడం లక్ష్యంగా ఇందులో పాల్గొంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , భారతీయ టూరిస్ట్ పరిశ్రమకు చెందిన హోటళ్లతో సహా దాదాపు 50 మంది వాటాదారుల ప్రతినిధి బృందంతో WTMలో పాల్గొంటున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇందులో భాగంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకేలో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి తెలంగాణా ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ తో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో ఐకానిక్ జాయింట్ వీల్ ఏర్పాటుపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీ కృష్ణ, డా. రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఘనంగా సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశవర్ష వార్షికోత్సవం
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినో భవంతు అనే భావనతో పదేళ్ల క్రితం ప్రారంమైన సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం 2 నవంబర్, 2024 నాడు దశ వర్ష వార్షికోత్సవము ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా దాదాపుగా 50 మంది తెలుగు బ్రాహ్మణ రుత్వికుల ఆధ్వర్యంలో శ్రీ మహా త్రిపురసుందరీ సమేత శ్రీ ఉమా సహస్ర లింగార్చన పూర్వక హరిద్రా కుంకుమార్చన సహిత లక్ష బిల్వార్చన కార్యక్రమంలో స్వామి వారిని అర్చనకార్యక్రమాన్ని నిర్వహించారు.కార్తీక మాసం మొదటి రోజున చేపట్టిన ఈ కార్యక్రమము లిటిల్ ఇండియాలో, ఆర్య సమాజ్ వారి ప్రాంగణములో 12 గంటలు పైగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనం తో మొదలుకొని మృత్తికా శోధన కార్యక్రమంతో మహాన్యాసా పూర్వకము గా భారతదేశం నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో 1136 మహా పరమశివ లింగములు చేసి వాటిని సమంత్ర పూర్వకము గా మూల మంత్రము తో ఆవరణ అర్చన చేసి ఆ తరువాత అరుణపారాయణం చేసిన పిదప ఏకాదశ వార రుద్రాభిషేకం శ్రీ రుద్ర పూర్వకము గా చేసిన అనంతరం సూక్తముల పారాయణా సహితము గా వేదోక్త శాంతులయిన దశశాంతులు తో శ్రీ సహస్ర లింగేశ్వరుని సామ్రాజ్య పట్టాభిషేకం కావించుకుని, చిన్న విరామం అనంతరం 50 మంది దంపతులు కలసి లలిత సహస్రనామములతో హరిద్రాకుంకుమార్చన చేసి, అటుపిమ్మట శివ సహస్రనామ పూర్వక లక్ష బిల్వార్చనా అంతర్గత రుద్రాక్రమార్చన పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.చివరగా షోడశ ఉపచారా పూజ, దర్భార్ సేవతో ప్రదోష వ్రతం కార్యక్రమమును ఘనంగా ముగించారు.ఈ కార్యక్రమమును సింగపూర్ బ్రాహ్మణ సమాజ బ్రహ్మలు ప్రసాద్ కప్పగంతుల, నేమాని సత్య రమేష్ మరియు రాజేష్ శ్రీధర ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించగా, భారతదేశం నుంచి వచ్చిన సలక్షణ ఘనాపాటి వంశీ(రాధే) పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని సింగపూర్‌లో తొలిసారిగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమానికి సహకరిచిన వర్కింగ్ టీం సభ్యులు గణపతి శాస్త్రి ఆకెళ్ళ, సూర్య పవన్ యనమండ్ర, వంశి కృష్ణ శిష్ట్లా , ముఖ్యదాతలు రంగనాథ్ వల్లభజోస్యుల, ఆదిత్య కర్రా , రామన్, భాను ఆకుండి, సంపూర్ణ స్వదేశ్, వీర ఫ్లవర్స్, వేద ఫ్లవర్స్ వాలంటీర్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే అడగగానే హాల్ ని సమకూర్చిన ఆర్యసమాజ్ వారికీ ప్రత్యేక ధన్యవాదాలా తెలిపారు. కార్యక్రమములో పాల్గొన్న రిత్విక్ లకు, భక్తులకు పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాద వితరణ చేసారు.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతిఒక్కరికి నిర్వాహకులు శ్రీప్రదాయ చల్లా, రాజేష్ యనమండ్ర, వేణు మాధవ్ మల్లవరపు, రత్నకుమార్ కవుటూరు పేరు పేరున ధన్యవాదములు తెలియచేసారు. -
శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్‌హౌజ్‌లోని బ్లూ రూమ్‌లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్‌రూమ్‌లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం. మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు. అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు. -
హనీట్రాప్ కేసులో కూటమి ఎమ్మెల్యే?
విశాఖ సిటీ: హనీట్రాప్ కేసు వ్యవహారంలో కూటమి ఎమ్మెల్యే ఉన్నారా? బీజేపీ యువనేతలకు కూడా ఈ కేసుతో ప్రమేయముందా? వీరూ హనీట్రాప్ బాధితులా? లేదా యువతి ద్వారా వ్యాపారులను దోచుకుంటున్న సూత్రధారులా? ఇప్పుడివే సందేహాలు సర్వత్రా చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారులు, బిగ్షాట్స్ లక్ష్యంగా జాయ్ జమీనా అనే యువతి వలపు వల విసిరి.. వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు వ్యాపారులు మాత్రమే ఆమె వలలో చిక్కుకున్నట్లు భావించినప్పటికీ.. ఆ జాబితాలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారన్న వార్తలు గుçప్పుమంటున్నాయి. ఈ కేసు వివరాలు బయటకు వెల్లడించకుండా పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తుండడం కూడా ఈ వాదనలకు బలాన్ని చేకూరిస్తోంది. వలపు వల విసిరి.. రేప్ కేసు పెట్టి.. జాయ్ జమీనా కోసం ఎన్ఆర్ఐ యువకుడు అమెరికా నుంచి వచ్చి.. ఆమె వలలో చిక్కుకొని రూ.లక్షలు పోగొట్టుకున్నాడని.. అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైంది. అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. విచారణలో ఆమె వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు విస్తుపోయారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఆమె నోరువిప్పనట్లు తెలిసింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. గతంలో ఈ తరహా కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా? అని దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఒక వ్యక్తిపై పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ కేసు వివరాలను ఆరా తీయడంతో హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు ఆమెను భీమిలి పోలీస్‌స్టేషన్‌లో విచారించినప్పటికీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనట్లు సమాచారం. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టుకు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇంతలో కంచరపాలెం, ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఆమె ఇద్దరి వ్యాపారులను ఇదే తరహాలో మోసం చేసినట్లు ఫిర్యాదు అందాయి. స్ప్రే కొట్టి.. ముగ్గులోకి దించి.. జాయ్ జమీనా ట్రాప్‌లో చిక్కుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆమె వ్యాపారులను దోచుకున్న తీరుపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా రెస్టారెంట్, కాఫీషాప్, రాజకీయ నేతలు ఇలా ఆర్థికంగా బలమైన వారినే ఎంచుకుంది. వారిని ఏదో ఒక విధంగా పరిచయం చేసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని, కవ్వింపు మాటలతో ముగ్గులోకి దింపేది. ఒక రోజు వారితో కారులో బయటకు వెళ్లడం.. ఆ సమయంలో వారి ముఖంపై ఒక రసాయనాన్ని స్ప్రే చేయడం.. ఇంటికి తీసుకువెళ్లడం.. వారు వద్దన్నా డ్రింక్ లేదా కాఫీ బలవంతంగా తాగించడం.. ఆ తరువాత బాధితులు మత్తులోకి జారిపోవడం.. లేచి చూసేసరికి ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం.. రూ.లక్షలు డిమాండ్ చేయడం.. పెళ్లి చేసుకోమని కత్తితో బెదిరించడం.. డబ్బు ఇవ్వని వారిపై రేప్ కేసు పెట్టడం.. ఇదే తరహాలో అనేక మందిని ఆమె దోచుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో వ్యాపారులు, ఎన్ఆర్ఐలతో పాటు రాజకీయ నేతలు సైతం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నా..జమీనా నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి స్టేషన్లో నమోదైన కేసులో ఆమె అరెస్టయింది. కోర్టు ద్వారా ఆమెను కస్టడీకి తీసుకొని విచారించారు. ఆమె వెనుక ఉన్న ముఠా సమాచారం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా.. నోరు విప్పడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ల్యాప్‌టాప్, మొబైల్లో ఉన్న సమాచారం సేకరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు సమాచారం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, నచ్చింది చేసుకోమని ఆమె సమాధానమివ్వడంతో పాటు తిరిగి వారినే బెదిరిస్తూ మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కస్టడీ సమయం ముగియడంతో ఆమెను మళ్లీ జైలుకు పంపించారు. అయితే కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కాఫీషాప్ యజమాని ఫిర్యాదుపై నమోదైన కేసులో కూడా గత రెండు రోజుల క్రితం ఆమెను రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఆమె నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయతి్నంచారు.