'తోక పార్టీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి' | vellampalli Srinivas Comments About CRDA Bill In Vijayawada | Sakshi
Sakshi News home page

'తోక పార్టీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి'

Published Fri, Jul 31 2020 8:09 PM | Last Updated on Fri, Jul 31 2020 8:16 PM

vellampalli Srinivas Comments About CRDA Bill In Vijayawada - Sakshi

సాక్షి, విజ‌య‌వాడ :  టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా చివరికి న్యాయమే గెలిచిందని,  ఐదుకోట్ల మంది ఆంధ్రుల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆమోద ముద్ర వేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు పేర్కొన్నారు. వెల్లంప‌ల్లి శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లో మాట్లాడుతూ.. ఇప్ప‌టికైనా తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాల‌ని విమ‌ర్శించారు. పదమూడు జిల్లాలను సమానంగా  అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమ‌న్నారు. అందరి అభిప్రాయం మేరకే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన కమిటీలు అన్నీ ప్రాంతాల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నివేదికలు ఇచ్చాయన్నారు.(యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా?)

స్వప్రయోజనాల కోసం చంద్రబాబు అండ్ కో అన్నిప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం చేసిందని తెలిపారు.శాసనసభ ఆమోదించిన బిల్లులను వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అడ్డుకోవాలని చూసారని వెల్ల‌డించారు.  శాసనమండలిలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. గవర్నర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ నిర్ణయంతో నవ్యాంధ్ర ప్రగతికి సోపానాలు పడబోతున్నాయి.. సంక్షేమంతో పోటీగా అభివృద్దిని పరుగులు పెట్టిస్తామని వెల్లంప‌ల్లి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement