
టీమిండియా యంగ్ ఆటగాడు శుబ్‌మన్ గిల్ న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో స్టన్నింగ్ సెంచరీతో మెరిశాడు. వన్డేలు, టెస్టులకు మాత్రమే పనికొస్తాడని.. గిల్ ఆటతీరు టి20లకు సరిపడదని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. అయితే వీటన్నింటికి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు గిల్. అంతేకాదు కివీస్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
మ్యాచ్‌లో 126 పరుగులు నాటౌట్ చేయడం ద్వారా ముఖ్యంగా కింగ్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన గిల్.. టి20ల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో(వన్డే, టెస్టు, టి20లు) సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా.. ఈ ఫీట్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఇక గిల్ తన రికార్డును బద్దలు కొట్టడంపై కోహ్లి స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ను జత చేశాడు. ''సితార (స్టార్)... ఫ్యూచర్ ఇక్కడే ఉంది(భవిష్యత్తు ఇక్కడే ఉంది.. ఎక్కడికి పోలేదు)'' అంటూ శుబ్‌మన్ గిల్‌ని హత్తుకున్న ఫోటోలను పోస్ట్ చేశాడు. ఇక గిల్‌తో కలిసి ఇటీవలే వన్డేల్లో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. రానున్న ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనూ ఇద్దరు కీలకంగా మారనున్నారు.
The Virat Kohli and Shubman Gill bond is special! pic.twitter.com/o0chu3FsJG
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2023