
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో.. కేకేఆర్ బ్యాటర్ బాబా ఇంద్రజిత్ మిడాన్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఇంద్రజిత్, ఫించ్ సింగిల్ కోసం ప్రయత్నించారు. అయితే మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ వెంటనే బంతిని అందుకుని వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు.
ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ త్రో చేసిన బంతి నేరుగా ట్రెంట్ బౌల్ట్ బూట్‌కు తగిలింది. దీంతో దెబ్బకు బౌల్ట్ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడపోయాడు. కాగా ప్రసిద్ధ్ చేసిన పనికి బౌల్ట్‌తో పాటు సహచర ఆటగాళ్లు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది.
స్కోర్లు
రాజస్తాన్ రాయల్స్: 152/5
కోల్‌కతా నైట్‌రైడర్స్: 158/3
చదవండి: Arun Lal : 66 ఏళ్ల వయస్సులో భారత మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్..!
— Eden Watson (@EdenWatson17) May 2, 2022