రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి దుర్మరణం | Mother And Son Died In Road Accident At Bhuvanagiri, More Details Inside | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి దుర్మరణం

Published Sat, Dec 28 2024 7:57 AM | Last Updated on Sat, Dec 28 2024 10:16 AM

Two Died In Road Accident at Bhuvanagiri

తండ్రి, కుమార్తెకు గాయాలు 

బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం 

దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన

భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చంపాపేట్‌కు చెందిన బైగళ్ల జగన్‌ భార్య పావని(30), కుమార్తె సాత్విక, కుమారుడు ప్రణయ్‌(2)తో కలిసి శుక్రవారం ఉదయం బైక్‌పై యాదగిరిగుట్ల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లాడు.  దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి యాదగిరిగుట్ట నుంచి నగరానికి తిరిగి వస్తుండగా భువనగిరి మండల పరిధిలోని హైదరాబాద్‌–వరంగల్‌ ప్రధాన రహదారిపై దీప్తి హోటల్‌ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

 ఈ ఘటనలో పావని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ప్రణయ్‌తో పాటు స్వల్పంగా గాయపడిన జగన్, సాతి్వకను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.  ప్రణయ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జగన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సంతోష్  కుమార్‌ తెలిపారు. 

సెలవు రోజు కావడంతో.. 
జగన్‌ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నాడు. వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్టతో పాటు స్వర్ణగిరిలో స్వామి వారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం రాయగిరి చెరువు వద్ద సంతోషంగా గడిపిన వారు భోజనం చేసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement