రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేవలం ప్యాకేజీ ప్రకటించినందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ బంద్ విజయవంతంగా జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపుకు వామపక్షాలు మద్దతు పలకడం, ప్రజలు, వాణిజ్య, వ్యాపార సంస్థల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో అన్ని పట్టణాల్లో దుకాణాలు మూతపడ్డాయి