తన భర్త ప్రదీప్ కుమార్ ఆత్మహత్యపై వస్తున్న ఆరోపణలను అతని భార్య పావనీరెడ్డి ఖండించింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రదీప్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. క్షణికావేశంలోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప, మరొకటి కాదని పేర్కొంది. గత రాత్రి తనకు, ప్రదీప్‌కు మధ్య జరిగింది చిన్న గొడవే అని, అయితే ఆత్మహత్య చేసుకునేంత గొడవలు తమ మధ్య లేవని పావనీరెడ్డి స్పష్టం చేసింది. శ్రావణ్ తన అన్నయ్య అని, గతరాత్రి అతడి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నామని అంతకుమించి ఏమీలేదని తెలిపింది.