అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడ్డాక సహనంతో వ్యవహరిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ విమర్శలను తీవ్రం చేశారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ప్రతిపక్ష డీఎంకేలను ఇప్పటి వరకు విమర్శిస్తూ వస్తున్న చిన్నమ్మ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేశారు. పార్టీలో సంక్షోభానికి బీజేపీ, డీఎంకేలే కారణమని నిందించారు. పన్నీరు సెల్వం ఎప్పుడూ పార్టీకి విధేయుడిగా లేరని విమర్శించారు. సోమవారం పోయెస్ గార్డెన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. జయలలిత చనిపోయినపుడే పార్టీని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని తెలిసిందని చెప్పారు.