
రాజరాజేశ్వరి అలంకరణలో కన్నికాపరమేశ్వరి
పళ్లిపట్టు: రాజరాజేశ్వరి అలంకరణలో కన్నికాపరమేశ్వరి దేవి కనువిందు చేశారు. పళ్లిపట్టు బజారువీధిలోని కన్నికాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులను కటాక్షించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే పళ్లిపట్టు గ్రామ దేవత కొళ్లాపురమ్మ ఆలయంలో సైతం నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా రోజూ కోళ్లాపురమ్మకు అభిషేక పూజలు చేసి సాయంత్రం సమయాల్లో ఉత్సవర్లను వివిధ అలంకరణలో పట్టణ వీధుల్లో ఊరేగిస్తున్నారు.