ప్రమాదంలో ప్రజాస్వామ్యం | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

Published Mon, May 6 2024 7:15 AM

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

● టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

పాతమంచిర్యాల: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్‌ భవన్‌లో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం–పార్లమెంటు ఎన్నికల్లో మన కర్తవ్యం’అనే అంశపై ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా నిరంతర దాడి చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదమేనన్నారు. కులం, మతం పేరుతో భావో ద్వేగాలను రెచ్చగొడుతుందని, మనమంతా ఐక్యంగా ఉండి బీజేపీ చర్యలను తిప్పికొట్టాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీ ఆర్‌ను ఓడించినట్లే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బాబన్న, నాయకులు రాంచంద్రారెడ్డి, బచ్చలి ప్రవీణ్‌కుమార్‌, గోనెల శ్రీనివాస్‌, సీనియర్‌ జర్నలిస్టు మునీర్‌, కాంగ్రెస్‌ నాయకులు కే.రవి, శ్యాంసుందర్‌ రెడ్డి, జైపాల్‌సింగ్‌, దేవి సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement