అమారావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎం.మాలకొండయ్య నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈయన నియామకంపై గురువారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం కల్పిస్తూ ఏపీ పోలీస్ యాక్టును సవరిస్తూ మంగళవారం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు.