
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 16వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినందున ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడ్డాక బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై.. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? తదితర అంశాలను ఖరారు చేయనుంది.