
సాక్షి, అనంతరపురం : అనంతపురం జిల్లా కదిరి షెల్టర్ హోమ్‌లో ఉన్న 36మంది రాజస్థానీయులను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 18న బెంగళూరు నుండి కదిరి మీదుగా వెళ్తున్న 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని షెల్టర్‌హోమ్‌కు తరలించారు. అక్కడే వారికి అన్ని వసతులు కల్పించి భోజన ఏర్పాట్లు కూడా చేశారు.
లాక్‌డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించడంతో వారందరినీ స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్వయంగా దగ్గరుండి వారిని విజయవాడ తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే బస్సులో వారు రాజస్థాన్ వెళ్లనున్నారు. 14 రోజుల పాటు అన్ని వసతులు కల్పించిన అధికారులకు, ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి రాజస్థానీయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.