
సాక్షి, గుంటూరు : జిల్లాలోని తుళ్లూరు మండలం బోరుపాలెంలో శుక్రవారం అర్థరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. బోటు ప్రమాదంలో చేపల వేటకు వెళ్లి తల్లీకూతుళ్లు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా నదిలో చేపల వేట కోసం సైదారాజ్ అతని భార్య మాధవి(26), కూతురు కావ్య(3)తో కలిసి పడవలో వెళ్లారు. నదిలో వలవేసి పడవపై నిద్రిస్తుండగా ఇసుక బోటు పడవను ఢీకోట్టడంతో నదిలో పడి తల్లీకూతుళ్లు మృతిచెందగా.. మత్స్యకారుడు ఈదుకుంటూ ఒడ్డుకుచేరుకున్నాడు. మృతులను పోలీసులు ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తించారు.